Latest Updates
-
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా..
రైలు టిక్కెట్లు ఈజీగా ఆన్ లైన్ లో బుక్ చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోకుంటే మీకే నష్టం!
ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్స్‌లో భారతీయ రైల్వే ముందు వరుసలో ఉంటుంది. మనదేశంలో నిత్యం కోట్లాది మంది ప్రయాణికులు రైళ్లల్లో ప్రయాణాలు చేస్తుంటారు. సాధారణంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్ లో రైలు ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతుంది. సరుకు రవాణాతో పాటు ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడంలో భారతీయ రైల్వే కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయ రైల్వే ప్యాలెస్ ఆన్ వీల్స్, మహారాజా ఎక్స్ ప్రెస్ వంటి లగ్జరీ రైళ్లను కూడా అందుబాటులోకి తెచ్చాయి.
మన దేశంలో 170 ఏళ్ల క్రితమే మొదటి రైలు అందుబాటులోకి వచ్చింది. 1853 ఏప్రిల్ 16న బోరి బందర్ నుంచి థానే మధ్య మొదటి ప్యాసింజర్ రైలు నడిచింది. 34 కిలోమీటర్ల దూరాన్ని ఈ ట్రైన్ కవర్ చేసేది. దీని జ్ఞాపకార్థంగా ఏటా ఏప్రిల్ 16న భారతీయ రైలు రవాణా దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు.

గతంలో సీటు పొందడానికి ప్రయాణికులు టికెట్ కౌంటర్ల దగ్గర పొడవైన క్యూలలో నిలబడాల్సి వచ్చేది. కానీ భారతదేశం డిజిటల్ ఇండియాగా మారడం ప్రారంభించిన తర్వాత ఆన్ లైన్ టికెట్ బుకింగ్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం టికెట్ కౌంటర్లలో ట్రైన్ టిక్కెట్లు కొనుగోలు చేసే వారి కంటే ఆన్‌లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకునే వారి సంఖ్య చాలా రెట్లు పెరిగింది. భారతదేశంలోని అన్ని రైలు టిక్కెట్లలో 80శాతం IRCTC ద్వారా ఆన్‌లైన్ లో బుక్ చేయబడుతున్నాయి. అయితే చాలా ప్రయాణికుల ఆందోళన ఏమిటంటే..ఆన్ లైన్ టిక్కెట్ల ధర కౌంటర్ టిక్కెట్ల కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది.
మీరు ఎప్పుడైనా ఆన్‌లైన్‌లో రైలు టికెట్ బుక్ చేసుకుని ఉంటే..అది కౌంటర్ టికెట్ కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ రేటు ఉండటం మీరు గమనించి ఉంటారు. ఎందుకంటే ఆన్‌లైన్ రైలు టిక్కెట్లను IRCTC వెబ్‌సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవచ్చు. మీరు టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ఇతర యాప్ లను ఉపయోగించినా కూడా మీకు IRCTCలో అకౌంట్ ఉండాలి. అది లేకుండా ఆన్ లైన్ లో రిజర్వేషన్ చేసుకోవడం సాధ్యపడదు.
ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు IRCTC ప్రయాణీకుల నుండి GST తో పాటు సౌకర్య రుసుమును వసూలు చేస్తుంది. ఇది నేరుగా IRCTC కి వెళుతుంది, GST ప్రభుత్వం సేకరిస్తుంది. ఈ అదనపు రుసుములు ఆన్ లైన్ టిక్కెట్లను కౌంటర్ టిక్కెట్ల కంటే ఖరీదైనవిగా చేస్తాయి.
రైల్వే మంత్రి దీనిపై ఏం చెప్పారు?
ఇటీవల ఒక లోక్‌సభ సభ్యుడు పార్లమెంట్ లో కౌంటర్ టిక్కెట్ల కంటే ఆన్‌లైన్ టిక్కెట్లు ఎందుకు ఖరీదైనవని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిస్తూ..ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థను నిర్వహించడం, మెరుగుపరచడం, విస్తరించడం కోసం IRCTC గణనీయమైన ఖర్చులను భరిస్తుందని వివరించారు. ఈ ఖర్చులను తిరిగి పొందడానికి,ఐఆర్‌సిటిసి ఆన్ లైన్ టికెట్ బుకింగ్ లకు సౌకర్య రుసుమును వసూలు చేస్తుందని ఆయన తెలిపారు. ఆన్‌లైన్ టిక్కెట్లు ప్రయాణీకులు రైల్వే స్టేషన్లలో పొడవైన క్యూలలో వేచి ఉండకుండా ఉండటానికి సహాయపడతాయని, ఇది సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుందని, టికెట్ కౌంటర్లకు వెళ్లి తిరిగి వచ్చే ప్రయాణ ఖర్చులను కూడా తగ్గిస్తుందని ఆయన అన్నారు.



Click it and Unblock the Notifications