Latest Updates
-
చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి! -
డా. మంతెన ఆరోగ్య చిట్కాలు.. అన్ని విటమిన్లనూ ఒకే కప్పులో అందించే ప్రకృతి రహస్యం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలితే ఇలా ఊతప్పం చేయండి.. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుని తింటారు! -
చీర ఎత్తితే చీరేస్తారు: పంక్షన్లలోనే కాదు.. రైళ్లలోనూ హిజ్రాల బీభత్సం! -
ఉదయాన్నే ఒక కప్పు చాలు.. ఒంటి నొప్పులను తగ్గించి, పుష్టిగా బలాన్ని ఇచ్చే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.! -
బెంగాలీ స్పెషల్ రాధాభల్లవి పూరీ..ప్లేట్ లోనే స్వర్గం కనిపించేస్తది! -
మరో పది రోజుల్లో మంగళ గోచారం.. వీరికి దీనికి మించిన మంచి సమయం ఉండదు.! -
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.!
వేడికి ఫుడ్ తొందరగా పాడైపోతుందా?.. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే అస్సలు పాడవదట!
వేసవిలో ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే. బయటికి వెళ్తేనే మాడు పగిలిపోయేంత ఎండ కొడుతుంది. ఈ వేడికి ఇంట్లో కూడా ఉన్నట్టుండి వేడి పెరిగిపోతుంది. దీనివల్ల చాలా మంది ఇంట్లో ఆహరం తొందరగా పాడైపోతుంది. ఈ సమస్య కేవలం ఒకటి రెండు ఇంట్లో కాదు.. చాలా మందిని ఈ సమస్య పట్టిపీడిస్తోంది. ఉదయం వండిన ఆహరం సాయంత్రం కాగానే పాడైపోయి.. తెగ వాసన వచ్చేస్తుంటుంది. ఫ్రిడ్జ్‌లో ఆ ఆహారం పెట్టినా.. ఆ ఆహరం అనేది వాడుకోవడానికి అనువుగా ఉండదు. అందుకే ఈ స్టోరీలో కొన్ని టిప్స్ గురించి వివరించాము. ఆ టిప్స్ ఎంత వేడికి అయినా మీ ఆహరం అనేది పాడవదు. అలాగే మీరు ఆ ఆహారాన్ని శుభ్రంగా వినియోగించుకోవచ్చు. ఆ టిప్స్ ఏంటో చూద్దాం రండి..
1. వేర్వేరు వంటకాలను కలపకండి
సాధారణంగా మన ఇంట్లో తక్కువ ప్రదేశం ఉన్నప్పుడు రెండు ఆహారాలను ఒకే దగ్గర కలిపిస్తుంటాం. అయితే వేడి ఎక్కువగా ఉన్నప్పుడు అలా చేయకూడదు. కొత్త వంటకం, పాత వంటకంతో కలపడం వల్ల అది త్వరగా పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలాగే తొందరగా స్మెల్ వచ్చేస్తుంది. అందుకే వండిన ఆహారాన్ని వేరే వేరేగా ప్యాక్ చేసి, భద్రపరచడం ముఖ్యం.

2. పదే పదే వేడి చేయడం మానుకోండి
ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల అది ఎక్కువకాలం నిలుస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి అది రుచి మరియు పోషక విలువలను కోల్పోవడానికి దారితీస్తుంది. పైగా వేడి చేసినపుడు బ్యాక్టీరియా ఎక్కువగా పెరిగే అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి వండిన వెంటనే తినడం ఉత్తమం.
3. మసాలా, టమాటో పరిమితంగా వాడండి..
తీవ్ర మసాలాలు, ఎక్కువగా టమాటోలు వేసిన వంటకాలు వేడి వాతావరణంలో త్వరగా చెడిపోతాయి. కాబట్టి వేసవి కాలంలో తక్కువ మసాలాలతో, అవసరమైతే తినే సమయానికి మాత్రమే టమాటో లేదా మసాలా కలపడం మంచిది. తక్కువ మసాలా వాడి వంట చేయడం వలన ఆ ఆహరం అనేది ఎక్కువ రోజులు వస్తుంది. అలాగే పాడవకుండా ఉంటుంది.
మన ముత్తాతలు ఎక్కువగా ఈ స్వీట్స్ తినేవారట.. అందుకే ఒక్కొక్కరు 10 మందిని దడాదడా..ఎలా చేసుకోవాలంటే
4. మూతలతో సురక్షితంగా కప్పండి
వంటకాలను నిల్వచేస్తున్నప్పుడు గాలి చొరబడకుండా బరువైన మూతతో మూసేయాలి. వేడి వాతావరణంలో గాలిలో ఉండే సూక్ష్మ జీవులు ఆహారంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు ఇది ముఖ్యం. అలా చేస్తే, ఆహారం ఎక్కువసేపు తాజాగా ఉంటుంది.
5. నీటి పద్ధతిని ఉపయోగించండి
ఫ్రిజ్ లేని రోజుల్లో నీటిలో ఆహారాన్ని భద్రపరిచే పద్ధతిని వినియోగించేవారు. మీరు కూడా ఆ టిప్స్‌ను ప్రయోగించవచ్చు. ఒక పెద్ద పాత్రలో చల్లటి నీటిని పోసి, అందులో గాలి చొరబడని డబ్బాలో వంటకాన్ని ఉంచండి. నీటి చల్లదనంతో ఆహారం కొంతసేపు ఫ్రెష్‌గా నిలవడంలో సహాయపడుతుంది. ఈ పద్ధతిని మన పూర్వీకులు తరచుగా వాడే వారు.
చివరగా..
వేసవిలో వేడి అధికంగా ఉండడం వల్ల ఆహార పదార్థాలు పాడుపోవడం సర్వసాధారణం. అయితే, కొన్ని స్మార్ట్ చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్యను సమర్థంగా ఎదుర్కోవచ్చు. తక్కువ మసాలా వాడడం, సరిగ్గా మూత పెట్టడం, అవసరానికి మించి వండకపోవడం, సహజంగా నిల్వచేసే పద్ధతులను పాటించడం ద్వారా మీరు ఆహారాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచవచ్చు.



Click it and Unblock the Notifications
