Latest Updates
-
శుక్రుడి వక్రగతి మహర్దశ.. ఆ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో సిరుల పంట.! -
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
తొలిసారి విదేశీ ప్రయాణమా.. ఈ 5 తప్పులు చేస్తే మీ వీసా తిరస్కరణకు గురైనట్లే.! -
మొఘలాయ్ తవా చికెన్.. మసాలా వేశాక ఇలా చేస్తే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.!
నకిలీ డిస్కౌంట్లకు నో ఛాన్స్.. ఆన్‌లైన్ షాపింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు.!
దసరా పండుగ సీజన్ మరికొన్ని రోజుల్లో మొదలు కానుంది. ఆ తర్వాత దీపావళి. ఇక, తెలుగు రాష్ట్రాల్లో సందడి షురూ అవుతుంది. షాపింగ్, ప్రయాణాలు, పండుగ సామగ్రి ఇలా ఇంటిల్లిపాదీ బిజీబిజీగా గడుపుతారు. ఇక, ఈ సీజన్‌ని క్యాష్ చేసుకుంటూ ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్స్ ఆఫర్ల వర్షం కురిపిస్తాయి. గుండు సూది నుంచి మొదలుకొని భారీ సామగ్రి వరకు డిస్కౌంట్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటాయి. అయితే ఈ డిస్కౌంట్లు అన్నీ వాస్తవమేనా.. సదరు సంస్థలు నిజంగానే తగ్గింపు ప్రకటిస్తున్నాయా.. ఆఫర్ల పేరుతో మనం బోల్తా పడుతున్నామా, లేదా పర్సులో డబ్బులు ఆదా చేసుకుంటున్నామా.. తెలుసుకోవడం చాలా అవసరం.

ఆఫర్లు, డిస్కౌంట్లు ఉన్నాయంటే చాలు ఒకటి కొనాల్సిన చోట మరో రెండు కొనుగోలు చేసి బాస్కెట్‌లో కుమ్మరించేస్తాం. తక్కువకి వస్తున్నాయ్ కదా.. లక్కీ ఛాన్స్ అంటూ ఎగబడిపోతాం. ఇక ఆన్‌లైన్ విక్రయాల గురించి తెలిసిందే. ఒక్క క్లిక్‌తో ఎన్నయినా ఇంటికి డెలివరీ చేయించుకుంటాం. పండుగల సందర్భాల్లో బిగ్ బిలియన్ డేస్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఇలా ప్రత్యేకమైన రోజులను తీసుకువస్తాయి. కోట్లలో విక్రయాలు జరుగుతాయి. అయితే అప్పటివరకూ ఆఫర్, డిస్కౌంట్‌లు లేని వస్తువులకి సడెన్‌గా పండుగల సమయంలో ఎలా వస్తాయి.? అసలు ఈ ఆఫర్స్ నిజమేనా.. మీరు కొనుగోలు చేసే ప్రొడక్ట్ ధరకి, డిస్కౌంట్‌కి ఎంత తేడా ఉంటుంది. దాని నిజమైన ధర ఎలా తెలుసుకోవాలి. దానిపై నిజంగానే డిస్కౌంట్ ఇస్తున్నారా ఎలా తెలుసుకోవాలో ఎప్పుడైనా ఆలోచించారా.?
పండుగల సమయాల్లో కస్టమర్ల పేరుతో ఆన్‌లైన్ విక్రయాల్లో నకిలీ ఆఫర్లు, డిస్కౌంట్ల బారిన పడకుండా డబ్బులను కాపాడుకునేందుకు కేంద్రం ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకువచ్చింది. ఆ రూల్స్ తెలుసుకుంటే ఇకపై మీరు మోసపోయే అవకాశం ఉండదు. ఈ రూల్స్ జనవరి 1, 2027 నుంచి అమల్లోకి రానున్నాయి. అవేంటంటే..

ఫేక్ డిస్కౌంట్స్
సీజన్ సమయంలో చాలా వరకు రూ. 2000 ఉన్న ప్రొడక్ట్‌కి రూ. 4,000 పెట్టి 50 శాతం డిస్కౌంట్ ప్రకటిస్తారు. దీంతో కస్టమర్లు తమకు తెలియకుండా ఎలాంటి తగ్గింపు లేకుండా ప్రొడక్ట్ కొనుగోలు చేస్తారు. ఇదే ఫేక్ డిస్కౌంట్. అయితే దీనికి సంబంధించి కేంద్రం కొత్త రూల్ తీసుకువచ్చింది. ఇకపై డిస్కౌంట్ ప్రకటించినప్పుడు దాని కింద ఖచ్చితంగా గత 30 రోజుల్లో దాని అత్యంత కనీస ధరను ప్రకటించాల్సిందే.
స్పాన్సర్‌డ్ ప్రొడక్ట్స్
మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, మీషో లాంటి యాప్స్‌లో ప్రొడక్ట్ కోసం సెర్చ్ చేసినప్పుడు మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేసేందుకు మీరు వెతికే ప్రొడక్ట్ కాకుండా ఆరంభంలో ఇతర ప్రొడక్ట్‌లను ప్రదర్శిస్తుంది. అయితే ఇకపై అలా కాకుండా ప్లాట్‌ఫామ్‌కి డబ్బులు కట్టే కంపెనీల ఉత్పత్తుల వాటికి స్పష్టంగా sponsored అని మెన్షన్ చేయాల్సిందే.

చెక్‌ఔట్ ట్రిక్స్
కొన్ని ప్రొడక్ట్స్‌ను ఆర్డర్ పెట్టే క్రమంలో మీకు తెలియకుండానే insurance వంటి వాటిని సదరు ప్లాట్‌ఫామ్ యాడ్ చేస్తుంది. Cancel ఆప్షన్‌ను దాచిపెడుతుంది. ఇకపై ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది.
కస్టమర్ డేటా
మీ షాపింగ్ డేటా ఆధారంగా సదరు ప్లాట్‌ఫామ్స్ సొంత ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేయాలని అనుకుంటే మీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే.
ఫిర్యాదులు
ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్స్ నేషనల్ కన్యూమర్ హెల్ప్‌లైన్(1915)తో తప్పనిసరిగా కనెక్ట్ కావాలి. కస్టమర్ ఫిర్యాదు చేసినప్పుడు మీకు ఖచ్చితంగా దానికి సంబంధించిన కాపీని అందించాల్సి ఉంటుంది.
మ్యానుఫాక్చర్ వివరాలు
దిగుమతి చేసుకున్న ప్రొడక్ట్స్‌కి సంబంధించి సదరు సంస్థ, దేశం వివరాలు ఖచ్చితంగా ప్లాట్‌ఫామ్‌లు ప్రదర్శించాలి. సంబంధం లేని ఛార్జీలను కస్టమర్లపై వేయకూడదు.



Click it and Unblock the Notifications

