Latest Updates
-
ప్రేమించిన పాపానికి ఇంత ఘోరమా? తండ్రీకొడుకులను నగ్నంగా నడిపించిన యువతి కుటుంబం! -
పంజాబీ జీరా ఆలూ ఫ్రై.. అన్నం, పూరీ, చపాతీల్లోకి అదిరిపోయే సైడ్ డిష్! -
బీహారీ స్పెషల్ దాల్ పిఠీ..ఇది తింటే పిజ్జా, బర్గర్లు కూడా మర్చిపోతారు! -
షుగర్ పేషెంట్లు తినాల్సిన బెస్ట్ హెల్తీ స్నాక్స్ ఇవే.. -
బెండకాయ ఫ్రై ఇలా చేస్తే..కరకరలాడుతూ ఎక్కువ రోజులు నిల్వ..పప్పుచారు, రసంలో నంజుకుంటే కేక -
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన 5 ఫుడ్స్ ఇవే.. -
ఎనకటి తరం హెల్తీ బ్రేక్ ఫాస్ట్..పోషకాలు నిండిన రాగి మునగాకు రొట్టె..చేయడం చాలా ఈజీ -
మా కంపెనీలో ఎందుకు పని చేయాలనుకుంటున్నారు? అభ్యర్థి ఆన్సర్ తో నెట్టింట రచ్చ.. -
గొంతు గరగరను తగ్గించే,రోగనిరోధక శక్తిని పెంచే వెల్లుల్లి కొత్తిమీర సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
రైస్ vs చపాతీ..రాత్రి డిన్నర్ లోకి ఏది తినాలి?..డాక్టర్ దీప్తి చెప్పిన కీలక విషయం..
ఇట్ట తయారయ్యారేందే: ప్రియుడితో సుఖం కావాలని భర్తను దారుణంగా..
ఆడవాళ్లు తమ ప్రియుడితో కలిసి భర్తను చంపుతున్న కేసులు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. విహాతేర సంబంధం పెట్టుకున్న ఒక మహిళ భర్తను దారుణంగా చంపేసింది. ఇప్పుడు కటాకటాల పాలయ్యింది. చివరకి ఆమె కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలు తండ్రిని కోల్పోయి, తల్లి జైలు పాలయ్యి అనాథులుగా మిగిలారు.
అసలేం జరిగిందంటే..
కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ జిల్లాలోని హన్సూర్ టౌన్ లోని వినోబా కాలనీలో పవిత్ర(30), రమా ప్రసాద్(35)దంపతులు నివసించేవాళ్లు. వీరికి 11 ఏళ్ల కుమారుడు, 9 ఏళ్ల కూతురు కూడా ఉంది. అయితే పవిత్రకు కొంతకాలంగా సునీల్ అనే వ్యక్తితో ఎఫైర్ ఉంది. ఈ విషయం భర్తకు కూడా తెలుసు..దీని గురించి తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి.

అక్రమ సంబంధం కొనసాగించవద్దని భర్త చెప్పడంతో..అతడినే చంపేయాలని పవిత్ర నిర్ణయించుకుంది. భర్తను చంపి ప్రియుడితో హాయిగా కలుకుదాం అని డిసైడ్ అయ్యింది. దీంతో అక్టోబర్ 16న రాత్రి ఇడ్లీ పిండిలో విషపూరితమైన ఉమ్మెత్త గింజలను పొడి చేసి కలిపింది. దీంతో తయారుచేసిన ఇడ్లీలను భర్తకు పెట్టింది. అవి తిన్న భర్త చనిపోతాడని పవిత్ర అనుకుంది.
అయితే ఆ ఇడ్లీ తిన్నాక కూడా రమా ప్రసాద్ చనిపోలేదు. దీంతో తన ప్రియుడు సునీల్ కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది పవిత్ర. ప్రియురాలు పిలవడంతో పరుగెత్తుకెళ్లిన సునీల్ ఆమెతో కలిసి రమాప్రసాద్ ని గొంతుపిసికి చంపేశారు. ఆ తర్వాత సునీల్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఇక పవిత్ర తన డ్రామా స్టార్ట్ చేసింది. వెంటనే రమాప్రసాద్ సోదరుడు చంద్రహాస్ కి ఫోన్ చేసి మీ తమ్ముడు పెరుగు తిన్నాడు తర్వాత ఉలుకుపలుకు లేకుండా పడిపోయాడు అని చెప్పింది. చివరకు రమాప్రసాద్ కుటుంబం, బంధువులు వచ్చారు. అందరూ ఇది సహజ మరణం అని భావించి అంత్యక్రియలు కూడా చేశారు.

అయితే అంత్యక్రియలు అయిపోయిన నాలుగు రోజులకి..ఘటన జరిగిన రోజు రాత్రి సునీల్ ఆ ఇంటి పరిసరాల్లో కనబడినట్లు చంద్రహాస్ కి స్థానికుల ద్వారా తెలిసింది. వెంటనే చంద్రహాస్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి విషయం చెప్పాడు. పోలీసులు పవిత్ర, సునీల్ ని విచారించారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. పోలీసులు సునీల్, పవిత్రను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు జరుగుతుండగా, ప్రస్తుతం ఇద్దరు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.



Click it and Unblock the Notifications
