290 కేజీల భర్త, 204 కేజీల భార్య శృంగారం..కుప్పకూలిన మూడంతస్తుల భవనం?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక జంట శృంగారానికి సంబంధించిన విషయమొకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ జంట శృంగారం చేస్తున్న సమయంలో వారి బరువు కారణంగా బెడ్ రూమ్ నేల కుంగిపోయి 3 అంతస్థుల కిందపడిపోయారట.

శృంగారం చేస్తుంటే ఇళ్లు కూలిపోవడం ఏంట్రా బాబు అంటూ సోషల్ మీడియాలో ఈ వార్త చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. అసలు ఇది ఎక్కడ జరిగింది? వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజమెంత? పూర్తి వివరాలను ఇక్కడ చూడండి.

Fact Check Did a Liverpool Couple Fall 3 Floors While Romance Truth Behind the Viral Story

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథ ఏంటంటే..

ఇంగ్లాండ్‌ దేశంలోని లివర్‌పూల్‌ నగరంలో 250 ఏళ్ల నాటి ఓ బిల్డింగ్ లో నివపిస్తున్న జంట..రొమాన్స్ చేస్తూ గడుపుతుండగా, వారున్న బెడ్‌ రూమ్ నేల ఒక్కసారిగా కుంగిపోయి ఏకంగా మూడు అంతస్తుల కింద పడిపోయారంట. ఆ భార్యాభర్తల ఇద్దరి బరువు కలిపి సుమారు 494 కిలోలు. ఇందులో భర్త బరువు 290 కిలోలు కాగా, భార్య బరువు 204 కిలోలు.

కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ!కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ!

ఆ పాత భవనం వారి బరువును మోయలేక నేల ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఆ దంపతులు ఇద్దరూ తాము పడుకున్న బెడ్‌ తో సహా నేరుగా మూడు అంతస్తులను చీల్చుకుంటూ వెళ్లి బేస్‌ మెంట్‌ లోని లాండ్రీ రూమ్‌లో పడిపోయారు. భవనం శిథిలాలు కింద అంతస్తులన్నింటిలో చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆశ్చర్యకరంగా ఇంత పెద్ద ప్రమాదం జరిగినా ఆ జంట కేవలం చిన్న గాయాలతో బయటపడ్డారని, మెయింటెనెన్స్ సరిగ్గా చేయనందుకు ఇంటి యజమానిపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారని ఈ వార్తలో ప్రచారం జరిగింది.

అసలు నిజం ఏంటి?
అయితే, ఈ కథలో ఎంత నిజం ఉందంటే.. లివర్‌ పూల్ నగరంలో కానీ, చుట్టుపక్కల కానీ ఇలాంటి ఘటనేదీ జరగలేదని స్పష్టమైంది. ఏ స్థానిక వార్తా సంస్థలలో దీని గురించి రిపోర్ట్ చేయలేదు.

మరి ఈ వార్త ఎలా పుట్టుకొచ్చింది?
ఇదొక ఏఐ జనరేటెడ్ ఇంటర్నెట్ వదంతి. ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్ వంటి సోషల్ మీడియాలో ఫాలోవర్లను, లైక్స్ పెంచుకోవడం కోసం కొన్ని మీమ్ పేజీలు కావాలనే ఇలాంటి కల్పిత వార్తలను సృష్టిస్తుంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఇలాంటి ఆసక్తికరమైన కథలను అల్లి, దానికి కొన్ని నకిలీ ఫోటోలను జతచేసి నెట్టింట వదిలేస్తారు. జనాలు వాటిని నిజమని నమ్మి విపరీతంగా షేర్ చేస్తారు.

Story first published: Tuesday, September 29, 2026, 12:34 [IST]
Desktop Bottom Promotion