Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వ్యాపారంలో, దుకాణాల్లో ఇలా చేయండి.. లాభాలే లాభాలు, కావాలంటే ట్రై చేసి చూడండి
వాస్తు శాస్త్రం ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. వాస్తు శాస్త్రాన్ని అనుసరించి నిర్మించే ఇల్లు, దుకాణాలు, వస్తువుల ప్లేస్‌మెంట్ అన్ని కీలక ప్రభావాన్ని చూపిస్తాయి. 8 దిక్కుల్లో ఏదైనా ఉంచకూడని వస్తువు ఉంచితే దాని ప్రభావం వల్ల చెడు ఫలితాలు రావడం, పనులు జరగకపోవడం, నష్టాలు చవిచూడటం లాంటివి జరుగుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం వ్యవహరిస్తే వ్యాపారంలో అయినా, ఇంట్లో అయినా మంచి ఫలితాలు వస్తాయి.

వ్యాపారాలు లాభాలు కోసమే పెడుతుంటారు. ఉత్పత్తులు, సేవలు అందించడం ద్వారా లాభపడాలని కోరుకుంటారు. కానీ మనకు తెలియకుండా చేసే కొన్ని పొరపాట్ల వల్ల లాభాలు రావాల్సిన వ్యాపారాలు నష్టాల్లో నడుస్తుంటాయి. అందుకే వాస్తు శాస్త్రాన్ని అనుసరించాలని చెబుతారు. వ్యాపారం నిర్వహిస్తున్నా, కమర్షియల్ దుకాణాలు నడుపుతున్నా ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే విజయవంతంగా సాగడంతో పాటు లాభాలు కూడా వస్తాయి.
వాస్తు ప్రకారం దుకాణాల దిశ:
వాస్తు ప్రకారం స్టేషనరీ దుకాణాలు పశ్చిమ దిశలో ఉండాలి. ఇలా ఉన్న దుకాణాల వల్ల విజయం వస్తుంది. మరింత లాభాలు వస్తాయి. ఫర్నిచర్ దుకాణాలు దక్షిణం వైపు ఉండాలి. ఇలా ఉంటే కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కిరాణా దుకాణాలు ఈశాన్య దిశవైపు ఉండాలి. లేదంటే తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండవచ్చు. బట్టల దుకాణాలు.. ఆగ్నేయం వైపు ఉండాలి.
దుకాణాల క్యాష్ కౌంటర్:
దుకాణాలు ఎటు వైపు ఉన్నప్పటికీ క్యాష్ కౌంటర్ మాత్రం ఉత్తరం వైపు తెరుచుకునే విధంగా ఉండాలి. అలాగే క్యాష్ కౌంటర్ లో ఎప్పుడూ కొంత డబ్బు ఉంచాలి. ఖాళీగా ఉండకుండా ఎంతో కొంత డబ్బు ఉండాలి. ఖాళీ పెట్టే కష్టాలను సూచిస్తుంది. క్యాష్ కౌంటర్, డబ్బు పెట్టెలో లక్ష్మీ, గణేష విగ్రహాలు ఉంటే.. రోజూ పూజించాలి.
విగ్రహాల చిత్రాలు:
దుకాణంలో పూజా మూర్తులు లేదా పూజాగది వాస్తు శాస్త్రం ప్రకారమే ఉండాలి. చిత్రాలు, విగ్రహాల దిశ ఈశాన్యంగా ఉండాలి. దీని వల్ల వ్యాపారంలో లాభాలు వస్తాయి. అలాగే ఈ దేవతా చిత్రాలు, విగ్రహాలను రోజూ పూజించాలి. దీపం వెలిగించి ప్రార్థన చేయాలి.
ముడి పదార్థాలు ఎక్కడ ఉంచాలంటే:
వ్యాపారానికి సంబంధించి ముడి పదార్థాలు కూడా వాస్తు ప్రకారం ఉంచడం కీలకం. భారీ వస్తువులు, ముడి పదార్థాలు స్టోర్ యొక్క నైరుతి దిశలో ఉంచాలి. ఇలా ఉంచడం ద్వారా అదృష్టం వరిస్తుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి.
దుకాణ ప్రవేశం ఎటువైపు ఉండాలి:
వాస్తు ప్రకారం, దుకాణ ప్రవేశ ద్వారా ఉత్తరం వైపు ఉండటం మంచిది. ఇది సానుకూలతను తీసుకువస్తుంది. లాభాలు తెచ్చిపెడుతుంది. అలాగే దుకాణ యజమానికి కూర్చునే స్థానం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి. ఇంటికైనా, వ్యాపారానికైనా ప్రవేశ ద్వారం ముఖ్యం కాబట్టి ఇది కచ్చితంగా వాస్తు ప్రకారం ఉండేలా చూసుకోవాలి. అలాగే ప్రవేశ ద్వారం విశాలంగా ఉండటం మంచిది. అలాగే ఆ మార్గంలో చిందరవందరగా, చెత్తతో, లేదా చెత్త డబ్బా ఉండటం మంచిది కాదు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications