Latest Updates
-
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.!
డాక్టర్ ను వదిలేసి చాట్ జీపీటీని నమ్మాడు..అరుదైన వ్యాధితో హాస్పిటల్ లో..
డాక్టర్లు, నిపుణుల సలహాలు లేదా సూచనలకు ప్రస్తుతం విలువ తగ్గిపోతుంది. డాక్టర్ దాకా వెళ్లడం ఎందుకు ఈ సమస్యకు పరిష్కారాన్ని ఏఐని అడిగి తెలుసుకొని పాటించేవాళ్ల సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. ఆన్ లైన్ లో చూసుకొని తమ సమస్యకు తామే పరిష్కారం వెత్తుక్కునేందుకు ట్రై చేస్తున్నారు. అయితే చాలా సమయాల్లో ఇది ప్రమాదకరంగా మరుతుందనడానికి తాజా ఉదాహరణను చెప్పవచ్చు. తన డైట్ ను ఎలా మెరుగుపర్చుకోవాలని అని చాట్ జీపీటీ ద్వారా తెలుసుకొని దానిని ఫాలో అయిన వ్యక్తి ఇప్పుడు హాస్పిటల్ పాలయ్యాడు.
చాట్ GPT సలహా తీసుకొని ఉప్పుకు బదులుగా సోడియం బ్రోమైడ్ ను ఉపయోగించిన 60 ఏళ్ల వ్యక్తికి ఒక వింత వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ 60 ఏళ్ల వ్యక్తి బ్రోమిజం బారిన పడ్డాడు, ఇది 19వ శతాబ్దంలో ఉందని నమ్ముతున్న అరుదైన వ్యాధి. వాషింగ్టన్ యూనివర్శిటీలోని ముగ్గురు డాక్టర్లు ప్రచురించిన అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అనే జర్నల్ లో ఈ కేసు నివేదించబడింది. 60 ఏళ్ల ఆ వ్యక్తి.. ఆహారంలో సాధారణ పదార్ధమైన ఉప్పు లేదా సోడియం క్లోరైడ్ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి ఒక అధ్యయనాన్ని చదివాడు.

ఆ తర్వాత అతను తన ఆహారంలో సోడియం క్లోరై డ్‌కు బదులుగా ఏమి ఉపయోగించవచ్చో చాట్‌జిపిటిని అడిగాడు. పూల్ నిర్వహణకు సాధారణంగా ఉపయోగించే సోడియం బ్రోమైడ్ అనే రసాయనాన్ని ఉపయోగించమని AI చాట్‌బాట్ సిఫార్సు చేసింది. అప్పటివరకు ఎలాంటి మాసనసిక అనారోగ్యం లేదా ఇతర తీవ్రమైన అనారోగ్యం లేని ఆ వ్యక్తి AI సిఫార్సును అనుసరించి మూడు నెలల పాటు సోడియం బ్రోమైడ్‌ను ఉపయోగించాడు.
ఒకరోజు 60 ఏళ్ల వ్యక్తి తన పొరుగువాడు తనకు విషం ఇస్తున్నాడని ఫిర్యాదు చేస్తూ హాస్పిటల్ కి వచ్చాడు. తర్వాత పరీక్షల్లో అతని శరీరంలో అసాధారణ ఎలక్ట్రోలైట్ స్థాయిలు ఉన్నాయని తేలింది. అప్పుడు డాక్టర్లు అతనికి 18వ శతాబ్దానికి చెందిన బ్రోమిజం అనే వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. 24 గంటల్లోనే అతని పరిస్థితి క్షీణించడం ప్రారంభమైంది. ఆ వృద్ధుడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. దృష్టి, వినికిడి రెండింటిలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అతను అలసట, నిద్రలేమి, ముఖం మీద మొటిమలు, సూక్ష్మ అటాక్సియా, అధిక దాహం కూడా అనుభవిస్తున్నాడని డాక్టర్లు తర్వాత తెలుసుకున్నారు. ఇవన్నీ బ్రోమైడ్ విషప్రయోగంతో సంబంధం ఉన్న లక్షణాలు.
బ్రోమిజం మొదట 1800ల చివర్లలో, 1900ల ప్రారంభంలో నివేదించబడింది. ఆ సమయంలో ఇది మానసిక హాస్పిటల్స్ లో ఒక సాధారణ పరిస్థితి. తర్వాత అమెరికాకు చెందిన FDA తినదగిన ఉత్పత్తుల నుండి బ్రోమైడ్ ను తొలగించింది.
ఇదే సమయంలో చాట్ జీపీటీ మాతృ సంస్థ అయి ఓపెన్ ఏఐ ఓ సందర్భంలో చాట్ బాట్‌లు ఎటువంటి ఆరోగ్య సమస్యలకు ట్రీట్మెంట్ చేయడానికి ఉద్దేశించినవి కాదని నొక్కి చెప్పింది. ప్రమాదాలను తగ్గించడానికి మా దగ్గర భద్రతా బృందాలు పనిచేస్తున్నాయి. మా AI వ్యవస్థలు ప్రజలు వృత్తిపరమైన మార్గదర్శకత్వం కోరుకునేలా ప్రోత్సహించడానికి శిక్షణ పొందాయి అని ఓపెన్ ఏఐ ఒక ప్రకటనలో తెలిపింది.



Click it and Unblock the Notifications
