Latest Updates
-
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం -
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్‌డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.!
ప్రపంచంలో అత్యంత చిన్న దేశం ఇదే..వాటికన్ సిటీ కాదు..దీని గురించి మీకు తెలుసా?
ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం ఏదంటే భారతదేశం అని క్షణం ఆలోచించకుండా చెప్పేయగలరు ఎవ్వరైనా. అదే ప్రపంచంలో అతిచిన్న దేశం ఏదంటే కొంచెం ఆలోచించి వాటికన్ సిటీ అని ఠక్కున చెప్పేస్తారు. అయితే ప్రపంచంలో అత్యంత చిన్న దేశం వాటికన్ సిటీ కాదని మీకు తెలుసా? అత్యంత చిన్న దేశం పేరు సీలాండ్. ఈ దేశ జనాభా ఎంత? ఇది ఎక్కడ ఉంది? ఈ దేశానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంగ్లాండ్‌లోని సఫోల్క్ తీరానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో, సముద్ర గర్భంలోంచి పుట్టుకొచ్చిన వింత దేశం పేరే 'సీలాండ్(SeaLand)'. సీలాండ్ ను ప్రపంచంలోని ఏ ఇతర దేశం అధికారికంగా గుర్తించలేదు. అయినా సరే తన సూక్ష్మరాజ్యం(micronation)హోదాతో ఇది ప్రత్యేకంగా నిలుస్తోంది. విస్తీర్ణంలో చాలా చిన్నదైన ఈ ప్రదేశంలో నివసించేది కేవలం 27 మంది మాత్రమే. సముద్రంలో ఏర్పాటు చేసిన రెండు భారీ ఉక్కు స్తంభాలపై పూర్తిగా మానవ నిర్మితంగా వెలసిన దేశమిది . ఇక్కడ మాట్లాడే భాష ఇంగ్లీష్ కాగా కరెన్సీ.. సీలాండ్ డాలర్. అయితే ఈ డాలర్ కేవలం సీలాండ్‌లో మాత్రమే చెల్లుతుంది, అంతర్జాతీయంగా దీనికి గుర్తింపు లేదు.

సీలాండ్ కథేంటి?
1943లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ సేనల నుంచి రక్షణ కోసం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం సముద్రం మధ్యలో రెండు పెద్ద కాంక్రీట్ స్తంభాలను అనుసంధానించి వాటిపై ఒక కోటను నిర్మించింది. యుద్ధం ముగిశాక ఆ కోట నిరుపయోగంగా మారింది. ఆ సమయంలో సెప్టెంబర్ 2, 1967న బ్రిటిష్ పౌరుడైన మేజర్ ప్యాడీ రాయ్ బేట్స్, ఆయన కుటుంబంతో కలిసి ఈ కోటను ఆక్రమించుకున్నారు. వెంటనే దీనిని "ప్రిన్సిపాలిటీ ఆఫ్ సీలాండ్" పేరిట స్వతంత్ర సూక్ష్మదేశంగా ప్రకటించుకున్నారు. అప్పటినుంచి బేట్స్ కుటుంబమే దీనికి పాలకులుగా వ్యవహరిస్తోంది.
వివిధ సమయాల్లో వేర్వేరు వ్యక్తులు సీలాండ్ ను పాలించినప్పటికీ, అక్టోబర్ 9, 2012న రాయ్ బేట్స్ ఇక్కడి రాజుగా ప్రకటించుకున్నారు. ఆయన మరణానంతరం ఆయన కుమారుడు మైఖేల్ పాలకుడయ్యాడు. ఈ దేశానికి సొంత జెండా, రాజధాని (సీలాండ్ ఫోర్ట్), పాస్‌పోర్ట్, కరెన్సీ, జాతీయ గీతం, రాచరికపు కుటుంబం కూడా ఉన్నాయి. దీని మొత్తం వైశాల్యం కేవలం 0.004 చదరపు కిలోమీటర్లు మాత్రమే.
ప్రపంచంలోని ఏ దేశం సీలాండ్‌ను అధికారికంగా గుర్తించనప్పటికీ.. ఏ దేశం కూడా దీని ఉనికిని తీవ్రంగా వ్యతిరేకించలేదు. ఈ ప్రత్యేక పరిస్థితుల కారణంగా సీలాండ్ ప్రపంచవ్యాప్తంగా ఒక విలక్షణమైన సూక్ష్మ దేశంగా ప్రసిద్ధి చెందింది.



Click it and Unblock the Notifications
