Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
గల్లీలో చిన్న పాన్ కొట్టు నుంచి 15 వేల కోట్ల ఆదాయం..మైండ్ బ్లాక్ అయ్యే బిజినెస్ బాసూ ఇది
అది 1929 భారతదేశాన్ని బ్రిటీష్ వాళ్లు పరిపాలిస్తున్న కాలం. దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాలు ఉధృతంగా సాగతున్న సమయంలో ఢిల్లీలోని ఒక చిన్న సందులో మహా సామ్రాజ్యానికి పునాది రాయి పడింది. ధరమ్‌పాల్ సుగంధి అనే వ్యక్తి సుగంధ్ పేరుతో సాధారణ పాన్ షాపు పెట్టుకున్నాడు. కానీ అది ఓ మహ సామ్రాజ్యానికి పునాది రాయి అని ఆనాడు ఎవరూ ఊహించలేదు.
ఒకప్పుడు పాన్ లు, అత్తర్లు అమ్ముకున్న ఆ చిన్న కొట్టే నేడు రూ. 15000 కోట్ల విలువైన వ్యాపార దిగ్గజం ధరమ్‌పాల్ సత్యపాల్ (డీఎస్) గ్రూప్ గా అవతరించింది. అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా వంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం ప్రచారం చేసే స్థాయికి ఎదిగింది.

ఓ చిన్న అడుగుతో మొదలైన ప్రయాణం
ధరమ్‌పాల్ సుగంధి ప్రారంభించిన పాన్ షాపులో ఆయన తయారుచేసే సుగంధభరితమైన పాన్ లు, అత్తర్లకు ఆ ప్రాంతంలో మంచి పేరు వచ్చింది. 1958లో ఆయన కుమారుడు సత్యపాల్ వ్యాపారంలోకి అడుగుపెట్టడంతో ఆ షాపు దశ తిరిగింది. ఆయన ప్రవేశపెట్టిన బాబా జర్దా పొగాకు ఒక సంచలనం సృష్టించింది. దాని రుచికి ప్రజలు ఎంతగా అలవాటు పడ్డారంటే నేటికీ అది లేకుండా పాన్ తినని వారు ఎందరో ఉన్నారు.
రజనిగంధతో మార్కెట్ పై దండయాత్ర
ఈ గ్రూప్ కు అసలైన కీర్తిని తెచ్చిపెట్టిన ప్రొడక్ట్ రజనిగంధ పాన్ మసాలా. 1983లో మార్కెట్‌లోకి వచ్చిన రజనిగంధ అప్పటికే ఉన్న తీవ్రమైన పోటీని తట్టుకుని నిలబడింది. అందరిలా కాకుండా, సామాన్యులను కాకుండా ప్రీమియం వినియోగదారులనే లక్ష్యంగా చేసుకుంది.
వెండి పూత పూసిన యాలకులు, మేలిమి కుంకుమపువ్వు, అత్యుత్తమ సుగంధ ద్రవ్యాలతో తయారైన రజనిగంధ, అనతికాలంలోనే మార్కెట్ ను శాసించే స్థాయికి ఎదిగింది. ఇది కేవలం ఒక పాన్ మసాలాగా కాకుండా ఒక స్టేటస్ సింబల్‌గా మారింది.

విభిన్న రంగాల్లో విస్తరణ
రజనిగంధ విజయంతో ఆగిపోలేదు డీఎస్ గ్రూప్. పాన్ మసాలా వ్యాపారం నుంచి బయటకు వచ్చి ఆహారం, పానీయాలు, మిఠాయిలు, హాస్పిటాలిటీ, లగ్జరీ రిటైల్ వంటి ఎన్నో రంగాల్లోకి విస్తరించింది.
పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఉర్రూతలూగించిన పల్స్ మిఠాయి, ప్రతి ఇంటి వంటగదిలో భాగమైన క్యాచ్ మసాలాలు, పాస్ పాస్ మౌత్ ఫ్రెషనర్లు అన్నీ ఈ సంస్థవే. ఇటీవలే స్విస్ లగ్జరీ చాక్లెట్ బ్రాండ్ లాడె రాచ్ ను భారతదేశానికి తీసుకురావడమే కాకుండా LuvIt అనే మిఠాయి బ్రాండ్‌ను కూడా కొనుగోలు చేసింది.
నేడు ఈ గ్రూప్ వార్షిక ఆదాయం రూ. 10,000 కోట్లు కాగా రూ. 20,000 కోట్ల లక్ష్యంతో ముందుకు సాగుతోంది. వారి కుటుంబ నికర ఆస్తి విలువ ఏకంగా రూ. 15,000 కోట్లు. ఒకప్పుడు ఢిల్లీ వీధుల్లోని పాన్ గల్లీలో మొదలైన ఈ ప్రయాణం నేడు ప్రపంచ లగ్జరీ వేదికల వరకు విస్తరించడం నిజంగా ఓ అద్భుతమైన విజయమే.



Click it and Unblock the Notifications