Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
Chiranjeevi: మెగాస్టార్ లగ్జరీ లైఫ్..చిరంజీవి ఆస్తుల వివరాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే
చిరంజీవి..ఈ పేరు వింటేనే కొందరికి పూనకం వచ్చేస్తుంటది. కేవలం టాలీవుడ్ కే మెగాస్టార్ కాదు..ఇండియన్ సినిమాకే మెగాస్టార్ గా చిరంజీవి గుర్తింపు పొందారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న చిరంజీవి ఒక స్టార్ నటుడిగా కీర్తిని సంపాదించడమే కాకుండా తన అద్భుతమైన కెరీర్ తో ఓ సామాజ్రాన్నే సృష్టించారు. పలు రిపోర్ట్స్ ప్రకారం చిరంజీవి.. రూ.2000 కోట్లకు పైగా నెట్ వర్త్ తో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత సంపన్న నటుల్లో ఒకరిగా రిలిచారు. ప్రధానంగా సినిమాలు,బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ ద్వారా ఆయన ఆదాయాన్ని పొందుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలతో పాటు ఆయనకు వ్యాపార రంగంలో కూడా పెట్టుబడులు ఉన్నాయి.
చిరంజీవి కెరీర్ లో స్వర్ణయుగం
1990ల ప్రారంభం నాటికి చిరంజీవి దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా నిలిచాడు. ఆ సమయంలో అమితాబ్ బచ్చన్ వంటి బాలీవుడ్ దిగ్గజాలను కూడా అధిగమించాడు. మనదేశంలో కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి హీరో చిరంజీవి. ఘరానా మొగుడు సినిమా భారీ విజయంతో చిరంజీవి కెరీర్ కొత్త శిఖరాలకు చేరుకుంది . ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 10 కోట్లు వసూలు చేసిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది. ఈ సినిమా విజయం నటుడి ఫీజుల పెరుగుదలకు గణనీయంగా దోహదపడింది. తర్వాత సంవత్సరాల్లో ఆయన సంపాదన వేగంగా పెరుగుతూనే ఉంది. తెలుగు ఆడియన్స్ కి బ్రేక్ డ్యాన్స్ ని పరిచయం చేసింది కూడా చిరంజీవే. ఓ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు కూడా తెలుగు ఇండస్ట్రీలో డ్యాన్స్ మెదలుపెట్టింది తానే అయినా దాన్ని టాప్ కి తీసుకెళ్లింది చిరంజీవినే అని అన్నారు.

దానధర్మాలు
అయితే తన డబ్బులో కొంతభాగాన్ని ఆయన ఎప్పుడూ దానధర్మాలకే కేటాయించారు. పేదల కోసం బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఏర్పాటు చేయడమే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. కరోనా సమయంలో ఎందరో పేదలకు,సినీ కార్మికులను అండగా నిలిచారు. కేంద్ర పర్యాటక శాఖ సహాయమంత్రిగా కూడా అనేక రకాలు కార్యక్రామాలు చేపట్టి పేరుపొందారు.
చిరంజీవి ఆస్తుల వివరాలు
నివాస గృహాలు
హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న అత్యంత విలాసవంతమైన ఇల్లు చిరంజీవికి ఉంది. దీని విలువ రూ. 50 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ ఇల్లు ఆధునిక, సాంప్రదాయ డిజైన్ల సమ్మేళనంగా ఉంటుంది. హైదరాబాద్ నివాసంతో పాటు ఆయనకు బెంగళూరు, చెన్నైసిటీల్లో కూడా విలాసవంతమైన ఇళ్ళు, ఖరీదైన స్థలాలు ఉన్నాయి. తమిళనాడులోని ఊటీలో 6 ఎకరాల విస్తీర్ణంలో ఒక కొండపై ఉన్న స్థలాన్ని రూ.16 కోట్లకు చిరంజీవి కొనుగోలు చేసినట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి.

లగ్జరీ కార్లు,ప్రైవేట్ జెట్
చిరంజీవికి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. ఆయన గ్యారేజ్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన, ప్రతిష్టాత్మకమైన వాహనాలతో నిండి ఉంది. ఆయన కలెక్షన్లలో రోల్స్ రాయిస్ ఫాంటమ్ (ధర రూ. 9-10.5 కోట్ల మధ్య) అత్యంత ఖరీదైనది. ఈ కారును ఆయన కుమారుడు రామ్ చరణ్ చిరంజీవికి పుట్టినరోజు బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. రేంజ్ రోవర్ వోగ్ (రూ. 2.39 నుండి 4.17 కోట్ల దాకా), రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ (రూ. 3.15 కోట్లు), టయోటా ల్యాండ్ క్రూయిజర్ (రూ. 2.10 కోట్లు)చిరంజీవి దగ్గర ఉన్నాయి. చిరంజీవికి ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది, అయితే ఖచ్చితమైన ధర బహిరంగంగా వెల్లడించబడలేదు, దాని విలువ అనేక కోట్లు ఉంటుందని అంచనా. దీనిని ఆయన తన ప్రయాణాల కోసం ఉపయోగిస్తారు.
ఇతర పెట్టుబడులు
చిరంజీవి తన సోదరుడు నాగబాబుతో కలిసి 1988లో అంజనా ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు, ఇది తెలుగు సినిమా పరిశ్రమలో పేరుపొందిన బ్యానర్‌లలో ఒకటి. సచిన్ టెండూల్కర్, నాగార్జునలతో కలిసి ఇండియన్ సూపర్ లీగ్‌లో కేరళ బ్లాస్టర్స్ FCకి సహ యజమానిగా ఉన్నారు.
అత్యున్నత పౌర పురస్కారాలు
తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు, సామాజిక సేవలకు గాను 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా భారత్ లో మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషన్ పురస్కారాన్ చిరంజీవి అందుకున్నారు. 2024లో రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి అందుకున్నారు.

సినిమాలు
గత కొన్నేళ్లుగా చిరంజీవి మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం అనీల్ రావిపూడి డైరక్షన్ లో ఓ సినిమా, మల్లిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాల విడుదల కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.



Click it and Unblock the Notifications