Latest Updates
-
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.!
ఒకప్పుడు సైకిల్ పై స్నాక్స్ అమ్మేవాడు..నేడు రూ.5,507 కోట్ల కంపెనీకి ఓనర్..ఇది కదా సక్సెస్ అంటే
కృషి, పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదు అని మన పెద్దలు తరుచూ చెబుతుంటారు. దీనికి ఉదాహరణగా చాలామందిని కూడా చూపెడుతుంటారు. నిరుపేద కుటుంబంలో పుట్టినా కూడా తమ కృషి,అంకితభావం, పట్టుదలతో జీవితంలో సక్సెస్ అవుతుంటారు కొందరు అలాంటి కొందరిలో బిపిన్ భాయ్ విఠల్ హద్వానీ ఒకరు. ఒకప్పుడు సైకిల్ వేసుకుని ఇంటింటికెళ్లి స్నాక్స్ అమ్మే బిపిన్ భాయ్ ఇప్పుడు రూ.5,507 కోట్ల రూపాయల విలువైన కంపెనీకి ఓనర్ అయ్యారు. ఒక సాధారణ వ్యాపారిగా కెరీర్ ప్రారంభించిన బిపిన్ భాయ్..నేడు ఈ స్థాయికి రావడం వెనుక ఎన్నో నిద్రలేని రాత్రుల కృషి ఉంది.
గుజరాత్ రాష్ట్రంలోని భద్ర గ్రామంలో బిపిన్ భాయ్ జన్మించాడు. బిపిన్ తండ్రి సొంత గ్రామంలోనే ఓ చిన్న షాపులో సాంప్రదాయ గుజరాత్ స్నాక్స్ అమ్మేవాడు. తండ్రి కష్టనష్టాలను చూస్తూ పెరిగిన బిపిన్ కి వ్యాపారంమీద ఆసక్తి పెరిగింది. 1990లో తన తండ్రి ఇచ్చిన రూ.4500 తో తన స్నేహితుడుతో కలిసి స్నాక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కొత్త టెక్నిక్స్, ఆలోచనలతో వ్యాపారాన్ని పెంచాడు. నాలుగేళ్ల తర్వాత భాగస్వామ్య బిజినెస్ నుంచి బయటికొచ్చాడు. అప్పుడు బిపిన్ వాటా కింద రూ.2.5 లక్షలు వచ్చింది. ఆ డబ్బుతో బిపిన్ సొంతంగా గోపాల్ స్నాక్స్ ని స్థాపించాడు.

1994లో బిపిన్,ఆయన భార్య కలిసి ఓ ఇంటిని కొనుగోలు చేసి దానిని ఫ్యాక్టరీగా మార్చారు. భార్య ఇంట్లో స్నాక్స్ తయారుచేసేది. బిపిన్ సైకిల్ మీద దగ్గర్లోని షాపుల్లో,మార్కెట్లలో వాటిని అమ్మతుండేవాడు. నెమ్మదిగా ఆ చుట్టుపక్కల గోపాల్ స్నాక్స్ టేస్ట్ బాగున్నాయి అనే పేరు వచ్చింది. బిపిన్ వ్యాపారం ఊపందుకుందుంది. బిపిన్ ఇంట్లో తయారయ్యే స్నాక్స్ కి డిమాండ్ పెరిగిపోవడంతో రాజ్ కోట్ సిటీ శివార్లలో ఓ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశాడు బిపిన్ భాయ్. అయితే ఆఫ్యాక్టీరీ ఊరు చివర ఉండటంతో ఆపరేషనల్ ఇష్యూస్ వంటి అనేక సమస్యలు వచ్చి దానిని రన్ చేయడం బిపిన్ కి కష్టతరంగా మారింది.
అయితే బిజినెస్ ని క్లోజ్ చేయడానికి బదులుగా బిపిన్ బ్యాంకు నుంచి లోన్ తీసుకొని రాజ్ కోట్ సిటీ లోపలే ఓ ప్యాక్టీరీని ఏర్పాటు చేశాడు. ఈ నిర్ణయం బిపిన్ జీవితంలో గేమ్ ఛేంజర్ గా మారింది. మెల్లగా బిపిన్ ఫ్యాక్టరీలో తయారయ్యే గోపాల్ స్నాక్స్ బాగా పాపులర్ అయ్యాయి..ఆయన బాగా ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం గోపాల్ స్నాక్స్ దేశవ్యాప్తంగా పాపులర్..క్వాలిటీ,టేస్ట్ సూపర్ అన్న పేరు వచ్చింది. గోపాల్ స్నాక్స్ ఇప్పుడు..దేశంలోనే 4వ అతిపెద్ద సంప్రదాయ స్నాక్ బ్రాండ్ గా ఉంది. ఈ కంపెనీ విలువ రూ. 5507 కోట్లుగా ఉంది.
కష్టపడితే ఏదైనా సాధ్యమే అని,ఎన్ని అవరోధాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా ముందుకు సాగితే విజయం అదే లభిస్తుందని నిరూపించి ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నారు బిపిన్ భాయ్. సాధారణంగా గుజరాత్ వాళ్ల రక్తంలోనే వ్యాపారం దాగి ఉంటుందని అని చాలామంది చమత్కారంగా కూడా చెబుతుంటారు. ఇలాంటోళ్లను చూస్తుంటే అది నిజమేననిపిస్తుంది మరి.



Click it and Unblock the Notifications
