Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
మార్కెట్ లో అమ్మకానికి అమ్మాయిలు..ధర రూ.2 లక్షల నుంచి 10 లక్షల వరకు
మన పొరుగుదేశాలైన పాకిస్తాన్, చైనా మధ్య స్నేహం గురించి కొత్తగా ఏం చెప్పనక్కర్లేదు. ఇటీవల భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ కి చెమటలు పట్టించిన పమయంలో చైనా మిత్రుడు అందించిన నుంచి తుస్సు బాంబులు తెచ్చుకొని ప్రపంచం ముందు పరువు పొగొట్టుకుంది పాకిస్తాన్. ఈ ఉగ్రదేశాన్ని గుప్పిట్లో పెట్టుకొని భారత్ మీద కుట్రలకు చైనా ప్లాన్ చేస్తుంటదన్న విషయం అందరికీ తెలిసిందే.
చైనా చెప్పిందల్లా చేస్తే తమ అడుక్కుతినే చిప్పలో నాలుగు డబ్బులు పడతాయని పాకిస్తాన్ ఆశ. అందుకే పోర్టుల దగ్గర నుంచి వ్యూహాత్మక భూభాగాల వరకు చైనా ఏది అడిగితే అది పాకిస్తాన్ నోరెత్తకుండా ఇచ్చేస్తుంటది. అయితే ఇవి మాత్రమే కాదండోయ్..అమ్మాయిలను కూడా చైనాకి అమ్మేస్తుంటది పాకిస్తాన్.

పాకిస్తాన్ లోని వధువుల మార్కెట్
పాకిస్తాన్ లో పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాల నుండి చిన్న వయసు బాలికలను చైనా పురుషులకు వధువులుగా అమ్ముతారు. పాకిస్తాన్-చైనా సరిహద్దు గ్రామాల్లో ఈ దారుణం విచ్చలవిడిగా సాగుతోందని అనేక రిపోర్టులు చెబుతున్నాయి. పాకిస్తానీ, చైనీస్ బ్రోకర్లు ఈ గ్రామాల్లో పర్యటించి, పేద తల్లిదండ్రులకు ఆశ చూపి పాకిస్తాన్ కరెన్సీలో సుమారు 2 నుండి 10 లక్షల రూపాయలు చెల్లించి వారి కూతుళ్లను కొనుగోలు చేస్తున్నారు.
యువతి వయస్సు, అందాన్ని బట్టి ఆమె ధర నిర్ణయించబడుతుందని పలు రిపోర్ట్ లు తెలియజేశాయి. గత రెండేళ్లలో దాదాపు 600 మందికి పైగా పాకిస్తానీ అమ్మాయిలు ఈ విధంగా అమ్ముడయ్యారని నివేదికలు చెబుతున్నాయి.
పెళ్లి ముసుగులో నరకం
పెళ్లి పేరుతో జరిగేది పచ్చి మోసం. చైనాకు తీసుకెళ్లిన తర్వాత ఈ యువతుల జీవితం నరకప్రాయంగా మారుతుంది. మానవ హక్కుల సంఘాల ప్రకారం ఇది వివాహం కాదు, లైంగిక బానిసత్వం,మానవ అక్రమ రవాణా. అక్కడ వారు తమ యజమాని ఇంట్లో లైంగిక బానిసలుగా చిత్రహింసలు అనుభవిస్తున్నారు.
కన్న కూతుళ్లను ఎందుకు అమ్ముకుంటున్నారు?
కన్న కూతుళ్లను కసాయివాళ్లకు ఎవరైనా ఎందుకు అమ్ముకుంటారు అనే ప్రశ్నకు సమాధానం పాకిస్తాన్ దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి, తీవ్ర పేదరికం. 12 నుండి 18 ఏళ్ల మధ్య వయసున్న బాలికలే ఎక్కువగా బాధితులుగా మారుతున్నారు. డబ్బుతో పాటు తమ మిగతా పిల్లల భవిష్యత్తు కోసం, అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రుల వైద్యం కోసం కూడా కొందరు ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నారు.
చైనా డిమాండ్ వెనుక కారణం
ఈ అమానవీయ వ్యాపారానికి డిమాండ్ చైనా వైపు నుండే వస్తోంది. చైనాలో ఒకప్పుడు అమలు చేసిన ఒకే బిడ్డ విధానం తీవ్రమైన లింగ అసమానతకు దారితీసింది. దీని ఫలితంగా అక్కడ సుమారు 3.5 కోట్ల మంది పురుషులు అదనంగా ఉన్నారు. వారికి పెళ్లికి అమ్మాయిలు దొరకడం లేదు.
ఈ సామాజిక సంక్షోభమే పాకిస్తాన్ పేద బాలికల పాలిట శాపంగా మారింది. బ్రోకర్లు నకిలీ వీసాలు, పాస్ పోర్ట్ లు సృష్టించి ఈ అమ్మాయిలను చైనాకు అక్రమంగా తరలిస్తున్నారు.



Click it and Unblock the Notifications