Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
బంగారం ధర చూస్తే..ధనవంతులకు కూడా కళ్లు తిరిగిపోతున్నాయి,రూ.4400 పెరిగిన గోల్డ్
బంగారం ధరలు చూస్తుంటే ఏం కొనేటట్లుగా కనబడట్లేదు. రోజు రోజుకి ధర అమాంతం పెరిగిపోతుందే తప్ప కిందకి దిగడం లేదు. ధనవంతులకు కూడా కొనాలంటే కష్టంగా మారిపోయింది. ఇప్పటికే స్పాట్ మార్కెట్ లో కూడా నిపుణుల అంచనాలకు మంచి రేటు పెరిగిపోతుంది. ఇది చూస్తుంటే 2025లో సామాన్యులు బంగారం కొనడం కలగానే మిగిలిపోయే పరిస్థితి కనబడుతుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు తప్ప మిగిలిన వాళ్లు తమ కొనుగోలు ప్రణాళికలను పెరుగుతున్న ధరలతో వాయిదా వేసుకుంటున్నారు.
అయితే ఈ ధరల పెంపు ఇంకెన్ని నెలలు కొనసాగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. బంగారం ధర ఈ సంవత్సరంలోనే రూ.1 లక్ష దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరోపక్క వెండి ధరలు కూడా బంగారం దాటి పరుగులు పెడుతుంది. గత వారం స్వల్పంగా వెండి ధరలు తగ్గినప్పటికీ మళ్లీ భారీగా ర్యాలీ కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లలో ఒడిదుకులే బంగారం,వెండి ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చిత్ర విచిత్ర నిర్ణయాల కారణంగా అమెరిక ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు నడుస్తుందా అనే ఆందోళనలో పెట్టుబడిదారులందరూ తమ డబ్బులను బంగారం వంటి విలువైన మెటల్స్ వైపు తరలిస్తున్నారు. దీనికి సాక్ష్యం ఇటీవల అమెరికా మార్కెట్లు భారీగా పతనం కావడమే. ఎక్కువ మంది పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్ గా భావించే బంగారంలోకి తమ డబ్బును తరలిస్తుండటంతో డిమాండ్ పెరిగిపోయి బంగారం ధరలు ప్రపంచవ్యాప్తంగా మండిపోతున్నాయి. వాస్తవానికి ఇది భారతీయ వినియోగదారులు కోరుకునే పరిస్థితి కాదు.
హైదరాబాద్,విజయవాడలో ఇవాళ(మార్చి 19) బంగారం ధరల వివరాలు
హైదరాబాద్ లో బుధవారం 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి పోల్చితే 100 గ్రాములకు రూ.4000 పెరిగింది. దీంతో ఈరోజు 22 క్యారెట్ల తులం(10 గ్రాములు) బంగారం ధర రూ. 82900 గా ఉంది. నిన్నటి పోల్చితే తులం మీద రూ.400 పెరిగింది.
ఇవాళ హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.90,440గా ఉంది. అంటే నిన్నటితో పోల్చితే 44 రూపాయలు తగ్గింది.
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ రూ. రూ. 82900 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.90,440గా ఉంది.
వెండి ధరలు
విజయవాడలో ఇవాళ 1 కేజీ వెండి ధర రూ.1,14,000గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.1000 పెరిగింది.
హైదరాబాద్ ఇవాళ 1 కేజీ వెండి ధర రూ.రూ.1,14,000గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.1000 పెరిగింది.
వ్యాపారుల ఆందోళన
అంతర్జాతీయ రాజకీయ పరిణాలతో వివిధ దేశాలలో కొనసాగేతేన్న అనిశ్చితి, పలు చోట్ల యుద్ధ వాతావరణం ఇవన్నీ బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అధిక ధరల ప్రభావంతో సమాన్యులు బంగారపు షాపుల వైపుకి చూడకపోవడం వ్యాపారులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. రేట్లు పెరిగియాని సంతోషం ఉన్నప్పటికీ వాటిని కొనేవాళ్లు భారీగా తగ్గుముఖం పట్టడంతో షాపుల నిర్వహణ కూడా కష్టంగా మారుతోందంటూ చాలామంది వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



Click it and Unblock the Notifications