Latest Updates
-
ముంబై ఫేమస్ బాంబే ఐస్ హల్వా.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి -
జామ ఆకుల టీని రోజుకు ఒక్క కప్పు తాగితే చాలు.. ఈ 4 భయంకరమైన ఆరోగ్య సమస్యలు మాయం! -
అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్.. సొరకాయ కోఫ్తా కర్రీ ఇలా చేశారంటే కేక టేస్ట్! -
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరి జామ్..మీ ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా.. -
హెల్తీగా ఉంటాం, బరువు తగ్గొచ్చని ఓట్స్ తింటున్నారా? ఈ విషయం తెలియకుంటే డేంజర్ లో పడతారు! -
ఐరన్, విటమిన్స్ నిండిన మునగాకు గోధుమ దోసె..బరువు తగ్గాలనుకునేటోళ్లకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ -
ఫోన్ పగలగొట్టాడని తండ్రిని దారుణంగా చంపిన కూతురు! -
కాలిఫ్లవర్ తో ఇలా చేస్తే పకోడీ కూడా పనికిరాదు.. టేస్ట్ అదుర్స్! -
నడుము నొప్పితో విసిగిపోయారా? మీ వెన్నెముకను ఉక్కులా మార్చేసే చిట్కా ఇదే! -
కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పులిహోర..చాలా కమ్మని రుచిగా చేసుకోండిలా..
2027లో బంగారం ధర ఎంత ఉంటదో తెలుసా? బాబా వంగా సంచలన జోస్యం!
గత కొన్ని నెలలుగా బంగారం ధరలు ఏరకంగా పెరగుతున్నాయో చూస్తున్నాం. ఎక్కడ ఉండే బంగారం ధర ఎక్కడికో పోయింది అన్నట్లు పరిస్థితి ఉంది. సామాన్యులు అయితే ఇప్పటికే బంగారం కొనుగోలు చేసేందుకు ఆశక్తి చూపడం లేదు..దీనికి కారణం ఆకాశాన్ని తాకుతున్న దాని ధర మాత్రమే. బంగారం కొనడం కన్నా మరో రకం పెట్టుబడులపైవు చాలామంది మళ్లుతున్నారు. అయితే 2026 ముగింపుకి చేరుకున్నాం. రెండు నెలల్లో కొత్త ఏడాది 2027లోకి అడుగుపెట్టబోతున్నాం.
ఈ క్రమంలో రాబోయే ఏడాదికి సంబంధించి ప్రఖ్యాత బల్గేరియన్ అంధ ప్రవక్త బాబా వంగా చెప్పినట్లుగా ప్రచారంలో ఉన్న కొన్ని సంచలన జోస్యాలు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి. బాబా వంగా చెప్పిన చాలా జోస్యాలు గతంలో నిజమయ్యాయి. ఎన్నో చారిత్రక సంఘటనలను ముందుగానే ఊహించిన ఆమె, 2027లో ప్రపంచ ఆర్థిక ముఖచిత్రం, బంగారం ధరల గురించి భయంకరమైన అంచనాలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జోస్యాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ సమాచారం ప్రకారం.. 2027లో ప్రపంచవ్యాప్తంగా కనీవినీ ఎరుగని ఆర్థిక మాంద్యం రాబోతోంది. విపరీతమైన నగదు కొరత ఏర్పడి, ప్రజలకు చేతిలో డబ్బులు ఆడని పరిస్థితి వస్తుంది. ఈ విపత్కర పరిస్థితుల కారణంగా ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పూర్తిగా సన్నగిల్లుతుంది. ఆ సంక్షోభ సమయంలో ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తుకు భరోసాగా అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఎగబడతారు. దీనితో పసిడి డిమాండ్ అమాంతం ఆకాశాన్ని తాకి, భారతదేశంలో 2027 నాటికి పది గ్రాముల (తులం) బంగారం ధర ఏకంగా రూ.2.62 లక్షల నుంచి రూ.2.82 లక్షల వరకు చేరుకుంటుందని బాబా వంగా అంచనా వేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

అయితే కేవలం ఈ జోస్యాల వల్లే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాస్తవ ఆర్థిక పరిస్థితులు కూడా పసిడికి రెక్కలు తెస్తున్నాయి. అమెరికన్ డాలర్ విలువ అనూహ్యంగా పడిపోవడం, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో తీవ్రమైన అస్థిరత నెలకొనడం, వడ్డీ రేట్లలో వస్తున్న మార్పులు, దీనికి తోడు పలు దేశాల మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు.. ఇవన్నీ బంగారం వైపు ఇన్వెస్టర్లు చూసేలా చేస్తున్నాయి.
మరోవైపు, ఈ ధరల పెరుగుదల వాదన కేవలం బాబా వంగా అంచనాలకు మాత్రమే పరిమితం కాలేదు. యూబీఎస్, జేపీ మోర్గాన్, డాయిష్ బ్యాంక్ వంటి ప్రపంచ స్థాయి ప్రతిష్టాత్మక ఆర్థిక సంస్థల విశ్లేషకులు కూడా రాబోయే రోజుల్లో బంగారం ధరలు 25 శాతం నుంచి 40 శాతం వరకు భారీగా పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. ఈ ఆకాశాన్నంటే పసిడి ధరల గురించి బాబా వంగా నిజంగానే తన గ్రంథాల్లో లిఖించారో లేదో తెలిపే కచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ.. ఆర్థిక విశ్లేషకులు చెబుతున్న లెక్కల ప్రకారం చూసుకుంటే మాత్రం 2027లో బంగారం ధరలు మరింత పైకి దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.



Click it and Unblock the Notifications
