Latest Updates
-
ధనస్సు, మేషం, సింహ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - సోమవారం, 29 జూన్ 2026 -
ఈ వర్షాకాలంలో చూడాల్సిన 10 బెస్ట్ వాటర్ ఫాల్స్..ఒక్క రోజులో హైదరాబాద్ నుంచి వెళ్లి రావొచ్చు! -
రాత్రి అన్నం మిగిలిందా? పారేయకండి.. ఇలా కరకరలాడే కుర్కురేలు చేసుకోండి! -
భగవంతుడు విగ్రహ రూపంలోనే ఎందుకు పూజించబడుతున్నాడు? -
35 ఏళ్ల తర్వాత శృంగారంపై ఆసక్తి, స్టామినా తగ్గుతుందా? తిరిగి ఎనర్జీ పొందే సూపర్ టిప్స్! -
నిజం కన్నా ఈ 5 మాటలే మీ బంధాన్ని మరింత మధురంగా మారుస్తాయి! -
ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉండే స్వీట్ కార్న్ వడ.. రుచితో పాటు ఇమ్యూనిటీ కూడా! -
అక్కడ అడ్మిషన్ దొరికితే లైఫ్ సెటిల్ అయినట్టే.. ఇండియాలో అత్యంత ఖరీదైన టాప్ స్కూల్స్ ఇవే.. -
ఒక్కసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం నిల్వ..దేంతో తిన్నా అదిరిపోయే మహారాష్ట్ర స్పెషల్ వెల్లుల్లి కారం! -
తల నుంచి కాలి వరకు..శరీరంలో ప్రతి భాగాన్ని హెల్తీగా ఉంచే హెల్తీ ఫుడ్స్
గుడ్ ఫ్రైడే 2026..మీ బంధుమిత్రులకు పంపాల్సిన బెస్ట్ విషెస్, వాట్సాప్ స్టేటస్ లు ఇవే!
2026 సంవత్సరంలో గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 3వ తేదీన వస్తుంది. క్రైస్తవుల విశ్వాసం ప్రకారం, ఏసుక్రీస్తు మానవాళి పాపాలను తనపై వేసుకుని, వారి రక్షణ కోసం కల్వరి గిరిపై సిలువ వేయబడిన రోజును గుడ్ ఫ్రైడే గా పాటిస్తారు.
దీనిని గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటారు?
ఏసుక్రీస్తు అత్యంత దారుణమైన హింసను అనుభవించి మరణించిన ఈ రోజును గుడ్ (మంచి) అని పిలవడానికి కారణం..ఆయన చేసిన ఆ పరమ త్యాగం ద్వారానే మానవాళికి పాప క్షమాపణ, దేవునితో శాంతి,నిత్యజీవం లభించాయని క్రైస్తవులు బలంగా విశ్వసిస్తారు. అందుకే ఇది మానవాళికి అత్యంత శుభప్రదమైన దినం.

సిలువపై తీవ్రమైన బాధను అనుభవిస్తూ కూడా, తనను హింసించిన వారి కోసం తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని ప్రార్థించి క్షమాగుణానికి గొప్ప ఉదాహరణగా నిలిచాడు ఏసు.
గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి, ప్రార్థనలు చేస్తూ, తమ జీవితాలను దేవుని వాక్యం వెలుగులో సరిచేసుకుంటారు. ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే సందర్భంగా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆత్మీయులకు బెస్ట్ గుడ్ ఫ్రైడే విషెస్ ఎలా చెప్పాలో ఇక్కడ చూడండి.
ఆధ్యాత్మిక మెసేజ్ లు, విషెస్ ఇలా చెప్పండి
-మానవాళి రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించిన ఆ దేవుని త్యాగాన్ని స్మరించుకుందాం. మీకు గుడ్ ఫ్రైడే ఆశీస్సులు.
-ప్రభువైన ఏసుక్రీస్తు తన అపారమైన ప్రేమతో మీ జీవితంలో శాంతి, ఆనందం, వెలుగును నింపాలని ప్రార్థిస్తున్నాను.
-ఆయన పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత కలిగింది. ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెబుతూ..పవిత్రమైన గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
-కల్వరి సిలువలో ఏసుక్రీస్తు చిందించిన ప్రతి రక్తపు బొట్టు, మన పాపాలకు ప్రాయశ్చిత్తం. దేవుని కృప మీకు తోడుగా ఉండాలి.
-ఈ గుడ్ ఫ్రైడే మీ జీవితంలో కొత్త ఆశలను, దేవుని పట్ల అచంచలమైన విశ్వాసాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను.
-ఏసుక్రీస్తు సిలువ మరణం మనకు నేర్పిన గొప్ప పాఠం ప్రేమ,క్షమాగుణం. ఆయన అడుగుజాడల్లో నడుద్దాం.
-దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టే తన ఏకైక కుమారుడిని మన కోసం బలి చేశాడు. గుడ్ ఫ్రైడే ఆశీస్సులు.
-కష్టకాలంలో నిరాశపడకండి, సిలువను చూసిన ప్రతిసారీ దేవుని అనంతమైన ప్రేమను గుర్తుచేసుకోండి.
-మీ ప్రార్థనలన్నీ ఆ దేవుడు ఆలకించి, మీ కుటుంబంపై తన దీవెనలు కురిపించును గాక.
-ఉపవాసంతో, కన్నీటి ప్రార్థనలతో ఆయనను ఆరాధిద్దాం. పవిత్ర శుక్రవారం రోజున ఆయన ఆశీస్సులు పొందుదాం.
-ఈ ప్రపంచంలో ఎవరూ చూపించలేని అంతులేని ప్రేమను ఏసుక్రీస్తు మనకు సిలువపై చూపించాడు.
-సిలువ మరణం ముగింపు కాదు, అది ఒక దివ్యమైన రక్షణకు ప్రారంభం. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.

స్ఫూర్తిదాయకమైన బైబిల్, ఆధ్యాత్మిక కోట్స్
-త్యాగానికి నిజమైన అర్థం తెలియాలంటే కల్వరి గిరిపై ఉన్న సిలువను చూడాలి.
-షరతులు లేని ప్రేమకు, హద్దులు లేని క్షమాగుణానికి నిలువెత్తు రూపం ఏసుక్రీస్తు.
-దేవుని ప్రేమకు కొలమానం లేదు, ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడమే దానికి నిదర్శనం.
-ముళ్ల కిరీటాన్ని ధరించి, మనకు జీవ కిరీటాన్ని ప్రసాదించిన రక్షకుడు ఏసు.
-సిలువ అనేది ఒక మరణ శిక్షకు గుర్తు కాదు, అది మానవాళి పాప విముక్తికి గుర్తు.
-ఏసుక్రీస్తు మరణం ద్వారా పాపం ఓడిపోయింది, ఆయన పునరుత్థానం ద్వారా నిరీక్షణ గెలిచింది.
-నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు.
-చీకటి ఎంత దట్టమైనదైనా సరే, సిలువపై నుండి వచ్చే వెలుగు దానిని పారద్రోలుతుంది.
-నీవు ఒంటరివాడివి కాదు, నీ బాధలన్నింటినీ భరించడానికి సిలువలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు.
-మన పాపాల కోసం సిలువను మోసిన దేవుడు, మన కష్టాలను కూడా తన భుజాలపై మోస్తాడు.
వాట్సాప్, సోషల్ మీడియా స్టేటస్ లు
-మన పాపాలకై ఆయన పొందిన గాయాలే మనకు స్వస్థత. గుడ్ ఫ్రైడే ప్రార్థనా పూర్వక శుభాకాంక్షలు.
-సిలువ వైపు చూడు, నీ అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.
-ఆయన త్యాగాన్ని స్మరించుకుందాం.. ఆయన చూపిన ప్రేమను పంచుదాం.
-ఏసయ్యా..నా కోసం నీవు చిందించిన ప్రతి రక్తపు బొట్టుకు వందనాలు.
-ఈ శుక్రవారం కన్నీటి శుక్రవారం మాత్రమే కాదు, మనందరికీ రక్షణ శుక్రవారం.



Click it and Unblock the Notifications