Latest Updates
-
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.!
Good Morning Quotes : శుభోదయం.. ప్రతీ రోజును ఆస్వాదించండి..!
ప్రతీ రోజు మన జీవితం ఒక అద్భుతం. కష్టాలు కన్నీళ్లు ఎప్పుడూ ఉంటాయ్. వాటితో పాటు జీవితాన్ని రోజూ అస్వాదించండి. ప్రకృతి మనకి సూర్యోదయంతో స్వచ్చమైనా వాతావరణం తో మనకు స్వాగతం పలుకుతుంది. రోజు మొదలైందంటే బంగారు అవకాశం వచ్చినట్టే. మనసులో బలంగా ఏదైనా అనుకుంటే జరిగిపోతుందని అంటారు. మీకు ఎప్పుడూ మంచే జరుగుతుందని అనుకుంటూ ఉండండి. నిరాశకు లోనుకావద్దు. మిమ్మల్ని మీరే స్ఫూర్తిగా తీసుకోండి. ఈ సృష్టిలో అన్నీ మనషుల చేతిలో ఉండవనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి అప్పుడప్పుడూ తలచుకోవాలి. ప్రతీ రోజు సంతోషంగా గడవాలని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషులకు గుడ్ మార్నింగ్ విషెస్, గుడ్ మార్నింగ్ కోట్స్ పంపుదామనుకుంటే మీ కోసం మేము ఇక్కడ ప్రత్యేకంగా సేకరించిన గుడ్ మార్నింగ్ విషెస్ సందేశాలను మీకు అందిస్తున్నాము.
ఈ ప్రపంచంలో నాకు అత్యంత విలువైనది ఏదైనా ఉందంటే అది నీ ప్రేమే.. గుడ్ మార్నింగ్..
నీ అడుగుల్లో కలిసిపోవాలని.. నీ చేతుల్లో వాలిపోవాలని.. నీ మాటల్లో మెదులుతూ ఉండాలని.. నీ స్పర్శలో నిలిచిపోవాలని.. నీ మనసంతా నేనే నిండిపోవాలని..కోరుకుంటోంది నా మనసు.. గుడ్ మార్నింగ్..

పుట్టుకతో ఎవరూ గొప్పవారు కాలేరు.
మన ప్రవర్తన, మన చేతలే మనల్ని
గొప్పవారిగా మారుస్తాయి.శుభోదయం!
అహం వల్ల ఏర్పడే అంధకారం
కారుచీకటి కంటే భయకరంగా ఉంటుంది.
అహంకారాన్ని వీడండి.. వెలుగు దిశగా అడుగులు వేయండి.
గుడ్ మార్నింగ్..!
ఎవరికైనా జీవితకాలం అంటే జనన, మరణాల మధ్య కాలం. కానీ నాకు మాత్రం నీతో గడిపిన కాలమే నా జీవితం.. శుభోదయం..
నువ్వు చేసే పని నీకు సంతోషాన్ని ఇస్తుంటే
మరెవరి అభిప్రాయం పట్టించుకోవాల్సిన అవసరం లేదు!
శుభోదయం.
ఓటమి గురువులాంటిది.. ఏం చేయాలో.. ఏం చేయకూడదో అదే మనకు నేర్పిస్తుంది.. శుభోదయం..
చేయడానికి ఓ పని.. ప్రేమించడానికి ఓ వ్యక్తి.. జీవించడానికి ఓ ఆశ.. ఈ మూడూ ఉన్నవారు నిత్యం సంతోషంగా ఉంటారు.. గుడ్ మార్నింగ్..
కోపంగా ఉన్నప్పుడు సమాధానం చెప్పద్దు.. సంతోషంగా ఉన్నప్పుడు మాట ఇవ్వద్దు.. అలాగే బాధలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు.. గుడ్ మార్నింగ్..
ఈ ప్రపంచంలో నీలా ఉండేది.. ఉండబోయేది.. ఇకపై ఉండాల్సింది.. కేవలం నువ్వు మాత్రమే.. అందుకే ఎవ్వరినీ నువ్వు అనుకరించాల్సిన అవసరం లేదు.. గుడ్ మార్నింగ్..
స్నేహం చేయడానికి తొందరపడద్దు.. స్నేహం చేశాక ఎప్పటికీ వదలద్దు.. శుభోదయం మిత్రమా..
ఒక మంచి పుస్తకం వంద మంది మిత్రులతో సమానం.. కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం.. గుడ్ మార్నింగ్ మిత్రమా
కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే
చింతలులేని జీవితం నీ సొంతమవుతుంది..
శుభోదయం..
స్నేహం నిదానంగా వికసించేది.. నెమ్మదిగా వర్థిల్లేది.. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా విస్తరించేది.. శుభోదయం..
అమ్మను మించిన దైవం లేదు.. స్నేహాన్ని మించిన బంధం లేదు.. గుడ్ మార్నింగ్..
నువ్వు ఎవరి మనసులో ఉన్నావో నాకు తెలియదు.. కానీ నా మనసుకు చేరువైన ఒకే ఒక్క వ్యక్తివి నువ్వే.. గుడ్ మార్నింగ్..
మనం ఎదురుచూసే ప్రేమ కన్నా.. మన కోసం ఎదురుచూసే ప్రేమే చాలా గొప్పది.. గుడ్ మార్నింగ్..
మొదటి అడుగు వేసే ముందు ఒకటికి వెయ్యిసార్లు ఆలోచించు.. కానీ ఒక్కసారి ముందడుగు వేశాక వందమంది వెనక్కిలాగినా వెనుతిరిగి చూడకు.. శుభోదయం..
జీవితం ఒక యుద్ధభూమి..
ప్రయత్నిస్తే గెలిచే అవకాశం ఉంటుంది.
ఊరికే ఉంటే ఏముంటుంది!
శుభోదయం..
గెలుపు కోసం పరుగులు పెట్టకు.. విలువలతో కూడిన బంధాలను కొనసాగిస్తూ తెలివితేటలు సంపాదించుకో.. అదే నీకు విజయం సాధించి పెడుతుంది.. శుభోదయం..
ఇతరులు నీ పట్ల చూపే నిర్లక్ష్యం, అసహ్యం, డ్రామా లేదా నెగెటివిటీ.. మొదలైనవాటి ప్రభావం నీపై అస్సలు పడనీయద్దు. నువ్వు ఎప్పటికీ నీలానే ఉండు.. గుడ్ మార్నింగ్..
మనిషిలో కొత్త అవకాశపు ఆశలను చిగురింపజేస్తూ ప్రతిరోజూ తెల్లవారుతుంది.. గుడ్ మార్నింగ్..
మన శక్తి కన్నా సహనం ఎక్కువ ఫలితాన్ని అందిస్తుంది.. శుభోదయం..



Click it and Unblock the Notifications
