Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కొండ దిగుతున్న బంగారం,వెండి..వరుసగా రెండో రోజు కూడా ధరలు ఢమాల్..కొనాలనుకుంటే రైట్ టైం!
గోల్డ్ కొనుగోలు చేయాలనుకునేవారికి భారీశుభవార్త.. కొద్ది నెలలుగా ఆకాశాన్ని తాకుతూ పోయిన బంగారం ధరలు మళ్లీ కిందకి వస్తున్నాయి. ఈ వారంలో వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. ఇవాళ మనదేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ట్రంప్ ప్రతీకార సుంకాలతో ప్రపంచదేశాలపై విరుచుకుపడుతున్న వేళ పెట్టుబడిదారులు తమ డబ్బును స్టాక్ మార్కెట్ నుంచి బంగారం వైపుకి అంటే స్పాట్ మార్కెట్ వైపు తరలిస్తున్నారు. దీనికితోడు అంతర్జాతీయ రాజకీయ పరిణాలతో వివిధ దేశాలలో కొనసాగేతేన్న అనిశ్చితి, పలు చోట్ల యుద్ధ వాతావరణం ఇవన్నీ బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి.
అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలున్నాయనే ఆందోళనలు నెలకొన్న క్రమంలో పెట్టుబడిదారులు సురక్షిత మార్గమైన బంగారంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో బంగారం ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవలే ఔన్స్ బంగారం ధర రికార్డ్ గరిష్ఠ స్థాయిని తాకిన విషయం తెలిసిందే. దీంతో దేశీయ మార్కెట్లలోనూ బంగారం ధరలు పెరుగుతాయనే ఆందోళనలు నెలకొన్న సమయంలో దేశీయంగా బంగారం ధరలు వరుసగా రెండో రోజూ తగ్గడం గమనార్హం. బంగారం కొనాలనుకునే వారికి ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు. మరోవైపు,వెండి ధరల పెరుగుదలకు కూడా బ్రేక్ పడింది. ఈ వారంలో వరుసగా రెండో రోజు కూడా వెండి ధరలు తగ్గాయి.

హైదరాబాద్ లో ఇవాళ(మార్చి 18) బంగారం,వెండి ధరల వివరాలు
హైదరాబాద్ లో సోమవారం 24 క్యారెట్ల తులం బంగారం(10 గ్రాములు)ధర రూ.89560 ఉండగా..ఈ రోజు(మార్చి 18) మంగళవారం రూ.89,550గా ఉంది. అంటే నిన్నటితో పోల్చితే 10 రూపాయలు తగ్గింది.
హైదరాబాద్ లో సోమవారం 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 82100 గా ఉండగా..ఈ రోజు(మార్చి18)మంగళవారం ధర రూ.82,090 దగ్గర ఉంది. సోమవారంతో పోల్చితే మంగళవారం అంటే ఈరోజు 10 రూపాయలు తగ్గింది.
హైదరాబాద్ లో సోమవారం 1 కేజీ వెండి ధర రూ. 1,11,900 ఉండగా..ఈ రోజు రూ.1,11,800 దగ్గర ఉంది. నిన్నటితో పోల్చితే కేజీ వెండిపై రూ.100 తగ్గింది.
విజయవాడలో ఇవాళ బంగారం,వెండి ధరల వివరాలు
ఏపీలోని విజయవాడలో సోమవారం 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 89560 ఉండగా..ఈ రోజు(మార్చి 18)మంగళవారం రూ.89,550గా ఉంది. అంటే నిన్నటి పోల్చితే 10 రూపాయలు తగ్గింది.
విజయవాడలో సోమవారం 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. రూ. 82100 గా ఉండగా..ఇవాళ(మార్చి 18)మంగళవారం రూ. 82,090గా ఉంది. అంటే నిన్నటి పోల్చితే 10 రూపాయలు తగ్గింది.
విజయవాడలో సోమవారం కేజీ వెండి ధర రూ. 1,11,900గా ఉండగా..ఇవాళ(మార్చి 18)రూ. 100 తగ్గి రూ. 1,11,800 దగ్గర ఉంది. నిన్నటి పోల్చితే 100 రూపాయలు తగ్గింది.
వెండిపై అంచనా ఇలా
ఈ ఏడాది బంగారం ధరలు పెరిగినా లేకున్నా వెండి ధరలు మాత్రం భారీగానే పెరిగే ఛాన్స్ ఉన్నట్లు మార్కెట్ నిపుణులు తెలియజేస్తున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోలార్ వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వాలను సబ్సీడీల పేరుతో ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండి వినియోగం పెరుగుతన్న వేళ దీని ధరలు కూడా ఆకాశాన్ని తాకుతూ వెళ్తున్నాయి.ఈ క్రమంలో 2025 చివరినాటికి వెండి ధరలు మరింత భారీగా పెరిగే అవకాశముందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.



Click it and Unblock the Notifications