Latest Updates
-
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.!
పెళ్లిళ్ల సీజన్ వేళ సామాన్యులకు భారీ శుభవార్త..దిగొచ్చిన బంగారం,వెండి ధరలు!
సామాన్య ప్రజలకు శుభవార్త. కొద్దిరోజులుగా మనదేశంలో బంగారం ధరలు భారీగా పెరుగతుూ పోతున్న విషయం తెలిసిందే. బంగారం ధరల పెరుగుదలకు వివిధ కారణాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రతీకార సుంకాలతో ప్రపంచదేశాలపై విరుచుకుపడుతున్న వేళ పెట్టుబడిదారులు తమ డబ్బును స్టాక్ మార్కెట్ నుంచి బంగారం వైపుకి అంటే స్పాట్ మార్కెట్ వైపు తరలిస్తున్నారు. దీనికితోడు అంతర్జాతీయ రాజకీయ పరిణాలతో వివిధ దేశాలలో కొనసాగేతేన్న అనిశ్చితి, పలు చోట్ల యుద్ధ వాతావరణం ఇవన్నీ బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి.
అధిక ధరల ప్రభావంతో సమాన్యులు బంగారపు షాపుల వైపుకి చూడకపోవడం వ్యాపారులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. రేట్లు పెరిగియాని సంతోషం ఉన్నప్పటికీ వాటిని కొనేవాళ్లు భారీగా తగ్గుముఖం పట్టడంతో షాపుల నిర్వహణ కూడా కష్టంగా మారుతోందంటూ చాలామంది వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ తరుణంలో నేడు బంగారం ధరలు కొంచెం తగ్గుముఖం పట్టడం అందరికీ ఉపశమనం కలిగించింది. కొద్ది నెలలుగా ఊహించని విధంగా పైకి ఎగబాతుతున్న బంగారం ధరలు ఇవాళ(మార్చి 17,2025) కిందకి దిగాయి.

ఈ రోజు బంగారం ధరల వివరాలు ఇవాళ
దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 24 క్యారెట్ల తులం బంగారం(10 గ్రాములు) ధర రూ. 89,710 ఉండగా..22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 82,250గా ఉంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఇవాళ 24 క్యారెట్ల తులం బంగారం(10 గ్రాములు) ధర రూ.89,560 ఉండగా..22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.82,100గా ఉంది.
హైదరాబాద్ ఇవాళ 24 క్యారెట్ల తులం బంగారం(10 గ్రాములు) ధర రూ. 89560 ఉండగా....22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 82100 గా ఉంది.
ఏపీలోని విజయవాడలో 24 క్యారెట్ల తులం బంగారం(10 గ్రాములు) ధర రూ. 89560 ఉండగా..22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 82100 గా ఉంది.
వెండి ధరలు ఇవాళ ఇలా ఉన్నాయి
-కొంతకాలంగా రాకెట్ మాదిరి దూసుకుపోతున్న వెండి ధరలు ఇవాళ కిందకి దిగాయి. ఇవాళ కేజీకి రూ.100 వరకు వెండి ధర తగ్గింది. హైదరాబాద్ లో ఇవాళ వెండి ధర 1 కేజీ రూ. 1,11,900 ఉండగా..విజయవాడలో ఈరోజు 1కేజీ వెండి ధర రూ. 1,11,900గా ఉంది. ఆదివారం(మార్చి 16)తో పోల్చితే వెండి కేజీకి రూ.100 తగ్గింది.
దేశ రాజధాని ఢిల్లీ 1 కేజీ వెండి ధర ఇవాళ రూ. 1,02900 ఉండగా..దేశ వాణిజ్య రాజధానిలో ఇవాళ 1 కేజీ వెండి ధర రూ. 1,02900గా ఉంది.
మరింత పైకి
అయితే 2025లో వెండి ధరలు భారీగా పెరిగే అవకాశముందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోలార్ వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వాలను సబ్సీడీల పేరుతో ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండి వినియోగం పెరుగుతన్న వేళ దీని ధరలు కూడా ఆకాశాన్ని తాకుతూ వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది చివరినాటికి వెండి ధరలు మరింత భారీగా పెరిగే అవకాశముందని నిపుణలు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications
