Latest Updates
-
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.!
మహిళలకు ఇది గొప్ప వరం.. మార్కెట్‌లో రెడీ మేడ్ చీరలు, ఎక్కడ దొరుకుతాయంటే?
రోజులు చాలా వేగంగా గడిచిపోతున్నాయి. రోజులు ఎంత వేగంగా గడిచిపోతున్నాయి అంతే వేగంగా ప్రపంచంలో కొత్త కొత్త ట్రెండ్స్, టెక్నాలజి పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే AI ప్రపంచాన్ని చుట్టుముట్టేయగా.. సరికొత్త ఆవిష్కరణలు సైతం ప్రజలను ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. తాజాగా మరో కొత్త ఆవిష్కరణ చాలా మంది మహిళలను ఇంప్రెస్స్ చేసింది. ఆ ఆవిష్కరణ చూస్తున్న మహిళలు ఎగిరి గంతేస్తున్నారు. ఇది తమకు ఒక వరమని, దీనిని కనుగొన్న వ్యక్తులను దండాలు పెడుతున్నారు.
సాధారణంగా మహిళలకు ఎక్కడికైనా రెడీ అయినప్పుడు అత్యంత కష్టమైన పని చీర కట్టడం. ఈ మధ్య కాలంలో చాలా మంది మహిళలకు చీర ఎలా కట్టుకోవాలి కూడా తెలియదు. అందుకే ఎక్కువగా వెస్ట్రన్, పంజాబీ డ్రెస్సులను వేసుకుంటున్నారు. అలాంటి మహిళలకు ఒక వరం ఈ ఆవిష్కరణ. అదే రెడీ మేడ్ చీర. ఈ చీరను ఓ మహిళ వేసుకుంటూ చూపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. అందుకే ఈ స్టోరీలో ఈ చీరను ఎలా తయారు చేశారు, మహిళలకు ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది? దీనిపై మహిళలు ఏమంటున్నారు? అనేది వివరించాము. పూర్తిగా చదివి తెలుసుకోండి.

ఆ చీరను ఎలా డిజైన్ చేశారంటే..
ఈ చీరను చాలా కొత్తగా డిజైన్ చేశారు. ఇదొక సూట్ మాదిరిగా ఉంటుంది. దీనిని ధరించడం కూడా ఒక సూట్‌ను ధరించినట్లుగా ధరించవచ్చు. చీరను వెనుక సైడ్ మొత్తం కవర్ చేసి.. ముందుగా రెండు భాగాలుగా చేశారు. ఈ రెండు భాగాలను కలిపేందుకు మధ్యలో హుక్స్ ఇవ్వడంతో పాటు, దారాన్ని కూడా జోడించారు. ఈ చీరలో పైన వేసుకునే జాకెట్ కూడా అంతర్లీనమై ఉంటుంది. ఆ హుక్స్ మరియు దారాలను కట్టుకున్నప్పుడు చీర నిండుతనం ఏర్పడుతుంది. దీంట్లో కుచ్చులను కూడా ముందుగానే డిజైన్ చేసి ఉంచారు. కొంగును పైన వేసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా కుచ్చులు కూడా అందంగా అమర్చబడతాయి. ఈ చీరకు సంబంధించిన హుక్స్, దారాలను కట్టుకుంటే చీర అందంగా సిద్ధమైపోతుంది. ఇది మహిళలకు ఒక వరమని చెప్పుకోవచ్చు. కేవలం క్షణాల్లోనే దీనిని కట్టుకొని ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు.
మహిళలకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది?
ఇది మహిళలకు ఇది ఒక వరం. ఎందుకంటే చీర కట్టడం ఎలానో తెలియని వ్యక్తులు ఈ చీర ద్వారా సులభంగా చీరను కట్టుకోవచ్చు. ఈ చీర వల్ల సమయం వృధా కాకుండా ఉంటుంది. అలాగే ఎక్కడికి వెళ్లాలనుకున్నా క్షణాల్లోనే సిద్ధమై వెళ్లిపోవచ్చు. మగాళ్లు కూడా రెండు రెండు విధాలుగా స్టిచ్చింగ్ ఖర్చులను భరించకుండా ఉంటుంది. అలాగే మనకు కావాల్సిన విధంగా స్టైల్ చేసుకోవచ్చు.
దీనిపై నెటిజన్స్ ఏమంటున్నారంటే?
దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు పాజిటివ్‌గా స్పందిస్తుంటే మరికొందరు మాత్రం కొంచెం వెటకారంగా స్పందిస్తున్నారు. ఇది ఎక్కడ దొరుకుతుందో చెప్పండి, మా ఆవిడకు ఒక నాలుగు కొనిచ్చి పెడతా అని ఒకరు అంటే.. ఇప్పుడేం ఉంది ఉతికినప్పుడు ఉంటుంది అని కొందరు అంటున్నారు. అలాగే ఇంకొందరు ఇది మహిళలకు గొప్ప వరం అని అంటుంటే.. మరికొందరు మాత్రం రెయిన్ కోట్ మాదిరిగా ఉంటుంది అని చెబుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి.



Click it and Unblock the Notifications
