Latest Updates
-
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా! -
లిప్‌స్టిక్‌తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.! -
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.? -
వాహనం ఏ రంగులో ఉన్నా.. టైరు మాత్రం నల్లగానే ఎందుకుంటుందో తెలుసా? -
ఈ రాశి వారు శుక్రవారం ఈ పూజ చేస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువుదీరడం పక్కా.!
హెచ్5ఎన్1 వైరస్.. కరోనా కన్నా యమ డేంజర్..
కరోనాకన్నా భయానకమైన పరిస్థితి రాబోతోందని వైద్యనిపుణులు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచాన్ని కరోనా అతలాకుతలం చేసింది. ఇప్పుడు ఆ పరిస్థితి కన్నా 100 రెట్లు హోరంగా ఉండబోతోందంటూ కోవిడ్ ప్యాండమిక్ రిపోర్టులు చెబుతున్నాయ్.

ఇటీవల హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ సోకి కొంతమంది ఆసుపత్రుల పాలయ్యారు. ఇప్పుడదే వైరస్ మరింత ప్రమాదకరంగామారి కరోనాకు మించిపోనుందని పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. పిట్స్‌బర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు డాక్టర్ సురేష్ కూచిపూడి మాట్లాడుతూ.. "ఒక్కసారి గనక ఈ వైరస్ వ్యాప్తి చెందితే మనము అత్యంత ప్రమాదస్థితిలో ఉన్నట్టేనని సామాన్యులు అభిప్రయాపడుతున్నారు.ఇప్పటికే చాలా ఆలస్యమైందని ఈ వైరస్ వల్ల చాలా జంతువుల ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదని ఎప్పటికైనా ఇది పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదమన్నారు.
మరణాల రేటు
ప్రపంచ ఆరోగ్యం సంస్థ అధికారిక లెక్కల ప్రకారం 2003 నుంచి ఇప్పటి వరకు 100 మందికి హెచ్5ఎన్1 వైరస్ సోకితే అందులో 52 మంది మృతి చెందారు. తొలిసారిగా ఈ వైరస్‌ను 1996లో చైనాలో గుర్తించారు. ఆ సమయంలో హాంకాంగ్‌లో 18 మందికి వైరస్ సోకితే అందులో ఆరుగురు మరణించారు. అంటే మరణం రేటు 50 శాతం కన్నా ఎక్కువే ఉందని తెలుస్తోంది. కరోనా మరణం రేటు కన్నా ఈ ప్రాణాంతక బర్డ్‌ఫ్లూ రేటు చాలా ఎక్కువగా ఉంది.
హెచ్5ఎన్1 వైరస్ అంటే ఏంటి
హెచ్5ఎన్1 వైరస్‌కు బర్డ్‌ఫ్లూ లేదంటే ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా అనే పేరు కూడా ఉంది. ఇది ముందుగా పక్షులకు సోకి వాటి నుంచి జంతువులకు, మనుషులకు వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ ప్రధమంగా కోళ్ల ఫారమ్ నుంచి వ్యాపిస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ కోళ్లు, పక్షులతో నేరుగా కాంటాక్ట్ అయితే సులభంగా ఈ వైరస్ సోకుతుంది. ఈ వ్యాధి సోకినవారికి జ్వరం, దగ్గు, గొంతు బొంగురపోవడం, నుమోనియా లక్షణాలతో పాటు ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారుతుంది.
డైరీఫామ్‌లో వ్యాప్తి
అమెరికాలోని టెక్సాస్‌లో ఓ వ్యక్తికి డైరీ ఫామ్ నుంచి హెచ్5ఎన్1 వైరస్ సోకింది. విషయం తెలియగానే యురోపియన్ యూనియన్ ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీ ఆ వైరస్ వ్యప్తి చెందే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసి మొత్తం యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. విచారణ చేస్తే కాన్సాస్, న్యూమెక్సికో మిషిగన్, టెక్సాస్, ఓహియో, ఇడాహోలోని పాడి పశువులకు బర్డ్‌ఫ్లూ సోకినట్టు గుర్తించారు. ఇక్కడి ఆవులకు కూడా పక్షల ద్వారానే వైరస్ సోకినట్లు విచారణలో తేలింది.



Click it and Unblock the Notifications
