Latest Updates
-
కూరలో నూనె ఎక్కువైందా? రుచి మారకుండా ఇలా ఈజీగా తీసేయండి! -
ఒక్క ముద్దలో లెక్కలేనన్ని ప్రయోజనాలు.. వయసు మళ్లినవారు తప్పనిసరిగా తినాల్సిన హెల్తీ కుర్మా.! -
చర్మ అలెర్జీలకు గుడ్ బై!.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ న్యాచురల్ రెమెడీస్ ఇవే! -
పైసా లేదని పెళ్లిళ్లు చేసుకోరు, కానీ పిల్లల్ని కంటారు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా.? -
తమిళుల ఆరోగ్య రహస్యం.. ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే తంజావూర్ అడై.. ఒక్కటి తిన్నా చాలు.! -
లాభ దృష్టి యోగం: సెప్టెంబర్ 15 తర్వాత ఈ నాలుగు రాశుల ఇళ్లలో ధనలక్ష్మి తిష్ట! -
కొవిడ్ ఇచ్చిన కిక్.. డిగ్రీ పట్టా లేదు, వ్యాపారం కాదు.. కానీ 20 ఏళ్లకే నెలకు రూ. లక్షల్లో ఆదాయం.! -
పచ్చిమిర్చి ఊరగాయ ఇలా చేస్తే..ఒక్క ముద్ద తినేవాళ్లు నాలుగు ముద్దలు లాగించేస్తారు! -
కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా.? -
చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి!
జులై 29న ‘గురు పౌర్ణమి’.. మీ గురువులను పూజించడమే కాదు.. వీటిని దానం చేస్తే ఎనలేని పుణ్యం.!
ఈ ఏడాది గురు పౌర్ణమి జులై 29న జరుపుకోనున్నారు. గురు పౌర్ణమి రోజున విద్యాబుద్ధులు నేర్పిన గురువులను, ఆధ్యాత్మిక మార్గదర్శకులను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. వారికి కృతజ్ఞతలు తెలుపుకునే పవిత్రమైన పండుగగా హిందూ సంప్రదాయంలో గురు పౌర్ణమికి విశిష్టత ఉంది. ప్రతి ఏడాది ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున ఈ పండుగను నిర్వహిస్తారు. మరి ఆ రోజు పూజా విధానాలు ఏంటి.? ఏం దానం చేయాలి, నియమాలు ఏంటి.. ఇక్కడ చూద్దాం..

తెలుగు క్యాలెండర్ ప్రకారం ఆషాఢ పౌర్ణమి జులై 28న సాయంత్రం 6.18 గంటలకు ప్రారంభమై, జులై 29న రాత్రి 8.05 గంటలకు ముగుస్తుంది. హిందూ సంప్రదాయం ప్రకారం ఉదయ తిథికి ప్రాముఖ్యత ఉన్న కారణంగా 29వ తేదీన పౌర్ణమి తిథి వస్తుంది. దీనినే గుర పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా పిలుస్తారు. జులై 29న సాయంత్రం 7:21 గంటలకు చంద్రోదయం మొదలవుతుంది. ఆ రోజు ఉదయం 4:17 గంటలకు బ్రహ్మ ముహూర్తం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2:43 గంటల వరకు విజయ ముహూర్తం ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో స్నానాధికాలు పూర్తి చేసుకుని దైవారాధన చేసుకుంటే శరీరం, మనసు ప్రశాంతంగా ఉంటుంది.
గురు పౌర్ణమి రోజున విద్యాలయాల్లో పూజలు నిర్వహిస్తారు. ఉపాధ్యాయులకు గౌరవం వందనం చేస్తారు. అంతేకాకుండా శ్రీకృష్ణుడు, దక్షిణామూర్తి, షిరిడి సాయిబాబా, దత్తాత్రేయుడిని గురువుగా భావించి ప్రత్యేకంగా ఆరాధిస్తారు. గురు పౌర్ణమి రోజున దేవాలయాల్లో విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. చంద్రుడికి నైవేద్యాలు సమర్పిస్తారు. ఆ రోజున ముఖ్యంగా విద్యార్థులు కొన్ని ప్రత్యేకమైన దానాలు చేయడం ద్వారా జీవితంలో ఆనందం, శాంతి చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు. దైవ ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు.
పూజా విధానం
గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. మీ ఆధ్యాత్మిక గురువులు లేదా ఉపాధ్యాయుల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి. గురు గీత, భగవద్గీత, గురు స్తోత్రాలను ఇలా వేటినైనా పఠించడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు.

వస్త్ర దానం
గురు పౌర్ణమి రోజున తెల్లని వస్తువులను దానం చేయడం ద్వారా మీ జాతకంలో చంద్రుడి బలం పెరిగి మానసిక ఒత్తిడి తగ్గుతుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున పేదలకు కొత్త వస్త్రాలు లేదా శుభ్రమైన బట్టలు దానం చేయడం ద్వారా అదృష్టంతో పాటు సమాజంలో గౌరవం, సానుకూల శక్తి అందుకుంటారు.
విద్యాదానం
విద్యార్థులు.. లేని వారికి పుస్తకాలు, పెన్సిళ్లు లేదా చదువుకి సంబంధించి ఇతర సామగ్రిని దానం చేయడం ద్వారా ఫలప్రదంగా భావిస్తారు. ఇది మీలో జ్ఞానం, వివేకాన్ని అందిస్తుంది. పేద పిల్లలకు అవసరమైన లేదా నచ్చిన వస్తువులను దానం చేయడం ద్వారా మీ జీవితంలోకి ఆనందం, సానుకూల శక్తి పొందుతారు.
ఆహార దానం
ఆషాఢ పౌర్ణమి రోజున ఆకలితో ఉన్న వారికి అన్న దానం లేదా ఆహార పదార్థాలను దానం చేయడం చాలా శుభప్రదం. అన్నపూర్ణాదేవి ఆశీస్సులు లభించి జీవితంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సును పొందుతారు.



Click it and Unblock the Notifications
