Latest Updates
-
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా! -
లిప్స్టిక్తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.! -
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.? -
వాహనం ఏ రంగులో ఉన్నా.. టైరు మాత్రం నల్లగానే ఎందుకుంటుందో తెలుసా? -
ఈ రాశి వారు శుక్రవారం ఈ పూజ చేస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువుదీరడం పక్కా.!
ఇలా చేస్తే చైన్ స్మోకర్లు కూడా జన్మలో సిగరెట్ ముట్టుకోరు!
పొగ తాడగం ఆరోగ్యానికి హానికరం అని సిగరెట్ పెట్టెల మీద ఎంత పెద్ద అక్షరాలతో రాసినప్పటికీ దానికి బానిసైన వారు ఆ అలవాటును అంత సులభంగా వదులుకోలేరు. అయితే స్మోకింగ్ అలవాటును ఈజీగా మానుకోవాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూడండి.

ఒక తేదీని లాక్ చేసుకోండి
ఏదో ఒక రోజు మానేస్తాను అనుకుంటే ఆ రోజు ఎప్పటికీ రాదు. అందుకే సిగరెట్ లేదా పొగాకు తాడం మానేయడానికి కచ్చితమైన ఒక తేదీని క్యాలెండర్ లో రాసుకోండి. ఆ క్షణం నుంచి సిగరెట్ ను ముట్టనని మీకు మీరే గట్టిగా వాగ్దానం చేసుకోండి. ఈ నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ కి చెప్పండి. మీరు వెనకడుగు వేసినప్పుడు వారి ప్రోత్సాహం మీకు కొండంత అండగా నిలుస్తుంది.
ట్రిగ్గర్స్ ను గుర్తించి దూరంగా ఉండండి
ఉదయం టీ తాగేటప్పుడు, ఆఫీసులో ఒత్తిడి పెరిగినప్పుడు లేదా స్నేహితులతో సరదాగా మాట్లాడుతున్నప్పుడు సిగరెట్ తాగాలనే కోరిక విపరీతంగా కలుగుతుంది. ముందుగా ఈ ట్రిగ్గర్స్ ను గుర్తించండి. కోరిక కలిగిన వెంటనే ఒక గ్లాసు నీళ్లు తాగడం, చూయింగ్ గమ్ నమలడం లేదా అక్కడి నుంచి లేచి కాసేపు నడవడం లాంటివి చేసి మీ దృష్టిని మరల్చుకోండి.
వ్యాయామం చేయండి, బిజీగా గడపండి
ఖాళీగా ఉన్నప్పుడే చెడు అలవాట్లు ఎక్కువగా మనసును లాగుతుంటాయి. అందుకే ప్రతిరోజూ ఉదయం యోగా, వాకింగ్ లేదా తేలికపాటి వ్యాయామాలు చేయండి. ఇది శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఒత్తిడిని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. మంచి పుస్తకాలు చదవడం, ఇష్టమైన సంగీతం వినడం లేదా కొత్త హాబీలు నేర్చుకోవడం ద్వారా మనసును బిజీగా ఉంచండి.
డాక్టర్ల సాయం
మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా విఫలమవుతుంటే వెంటనే డాక్టర్లను లేదా డీ అడిక్షన్ (పొగాకు విరమణ) నిపుణులను సంప్రదించండి. వాళ్లు మీ పరిస్థితిని బట్టి నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (NRT) లేదా కౌన్సెలింగ్ సూచిస్తారు. డాక్టర్ సలహా లేకుండా సొంత వైద్యం మాత్రం చేయవద్దు.
కోరికను చంపే బ్రహ్మాస్త్రం..4-D ఫార్ములా
మీకు సిగరెట్ తాగాలని తీవ్రంగా అనిపించినప్పుడు లొంగిపోకుండా వెంటనే ఈ 4-D సూత్రాన్ని ప్రయోగించండి.
ఆలస్యం చేయండి(Delay)
కోరిక కలగగానే వెంటనే సిగరెట్ ముట్టకండి. కనీసం 10 నిమిషాలు ఆపుకోండి. ఆ గ్యాప్ లో కోరిక తీవ్రత దానంతట అదే తగ్గిపోతుంది.
దీర్ఘ శ్వాస(Deep Breath)
కళ్లు మూసుకుని నెమ్మదిగా, లోతుగా గాలి పీల్చుకుని వదలండి. ఇది మీ మనసును, నరాలను ప్రశాంతపరుస్తుంది.
నీళ్లు తాగండి(Drink Water)
సిప్ చేస్తూ మెల్లగా ఒక గ్లాసు నీళ్లు తాగండి. ఇది కోరికను చల్లబరుస్తుంది.
దృష్టి మరల్చండి(Distract)
ఆ ఆలోచన నుంచి బయటపడటానికి వెంటనే ఏదైనా వేరే పని చేయండి. ఫ్రెండ్ కి ఫోన్ చేయడం, ఇష్టమైన పాట వినడం లేదా కొద్దిసేపు నడవడం చేయండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
