Latest Updates
-
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.? -
వాహనం ఏ రంగులో ఉన్నా.. టైరు మాత్రం నల్లగానే ఎందుకుంటుందో తెలుసా? -
ఈ రాశి వారు శుక్రవారం ఈ పూజ చేస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువుదీరడం పక్కా.! -
గుంటూరు స్పెషల్ టిఫిన్స్ అల్లం పచ్చడి..ఒక్కసారి చేసుకుంటే నెల రోజులు నిల్వ! -
పులియబెట్టాల్సిన పనిలేదు.. దోశ పిండి లేకపోతే ఇన్‌స్టంట్‌గా ఈజీగా చేసుకునేలా.! -
గణేష్ పూజ తర్వాత అరుదైన లక్ష్మీ నారాయణ యోగం..వాళ్లకి స్వర్ణ యుగమే! -
కూరలో నూనె ఎక్కువైందా? రుచి మారకుండా ఇలా ఈజీగా తీసేయండి! -
ఒక్క ముద్దలో లెక్కలేనన్ని ప్రయోజనాలు.. వయసు మళ్లినవారు తప్పనిసరిగా తినాల్సిన హెల్తీ కుర్మా.!
ఆఫీసులో గంటల తరబడి అలాగే కూర్చుంటున్నారా.. స్లిప్ డిస్క్‌తో వెన్నెముకకి ముప్పు తప్పదు.!
ఆధునిక జీవనశైలిలో ఆఫీసులో అయినా వర్క్ ఫ్రమ్ హోం అయినా గంటల తరబడి కూర్చొని పనిచేయడం సర్వసాధారణం. అది ఇలా ఏకధాటిగా కూర్చొని పనిచేయడం ఊహించని ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని.. గుండె ఆరోగ్యానికి, జీవక్రియకు, నరాలపై ప్రభావం చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఇలాంటి వారిలో నడుము నొప్పి సమస్య కూడా వేగంగా పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు.

ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడమే కాదు, బరువులను తప్పుగా ఎత్తడం, ఒబెసిటీ, శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల స్లిప్ డిస్క్ సమస్య పెరుగుతుందని న్యూరో నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా 30 ఏళ్ల లోపే నడుము నొప్పి సమస్యలతో ఆస్పత్రులకు చేరుతున్నారు. ఈ సమస్య ఎక్కువగా ఉదయం నిద్ర లేవగానే కనిపిస్తుందని అంటున్నారు. మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. నిపుణుల సలహాలు చూద్దాం..
ఉదయం నిద్ర లేవగానే నడుము భాగంలో నొప్పి ఫలితంగా నిటారుగా నిలబడలేకపోవడం, కుర్చీలో నుంచి లేచేటప్పుడు కుదుపులుగా అనిపించడం, వంగేటప్పుడు, బరువులు ఎత్తేటప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవ్వడం లాంటి సమస్యలు స్లిప్ డిస్క్ సమస్య వల్ల వస్తుంది. దీని వల్ల రోజువారీ పనులపై ప్రభావం పడుతుంది. అసలు ఈ స్లిప్ డిస్క్ సమస్య అంటే ఇంటి ఇక్కడ తెలుసుకుందాం..
స్లిప్ డిస్క్
వెన్నెముకలోని రెండు ఎముకల మధ్య ఉండే డిస్క్‌కు కలిగే నష్టమే స్లిప్డ్ డిస్క్ లేదా ప్రోలాప్స్డ్ డిస్క్. వెన్నెముక ఎముకల మధ్య కుషన్ లాంటి డిస్క్ దాని స్థానం నుంచి జారిపోయినా లేదా పగిలిపోయినా, సమీపంలోని నరాలపై ఒత్తిడి పడుతుంది. దీంతో నరాలపై ఒత్తిడి పెరిగి, తీవ్రమైన నొప్పి, ఇతర నాడీ సంబంధిత సమస్యలకు కారణం కావచ్చని న్యూరో నిపుణులు అంటున్నారు.

స్లిప్ డిస్క్ సమస్యకి సాధారణ కారణం డిస్క్ అరుగుదల కావచ్చు. వీటితో పాటు సరైన పొజిషిన్‌లో కూర్చోకపోవడం, సడెన్‌గా బరువులు ఎత్తడం, ఎక్కువసేపు వంగి ఉండటం కూడా డిస్క్ జారడానికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒబెసిటీ ఉన్నవారిలో, ధూమపానం అలవాటు ఉన్న వారిలో, శారీరక శ్రమ తక్కువగా చేసేవారిలో స్లిప్ డిస్క్ సమస్య ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వెన్నెముకపై పదేపదే పడే ఒత్తిడి డిస్క్‌లను బలహీనపరుస్తుందని నిపుణులు అంటున్నారు. ఆటలు, రోడ్డు ప్రమాదాల్లో గాయాల్లో కూడా డిస్క్ జారిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
స్లిప్ డిస్క్ వల్ల తీవ్రమైన నడుము నొప్పి రావడంతో పాటు పిరుదులు, తొడలు, కాళ్లకు కూడా ఈ సమస్య వస్తుందని నిపుణులు అంటున్నారు. స్లిప్ డిస్క్ కారణంగా చాలా మంది తమ కాళ్లలో జలదరింపు, తిమ్మిరి లేదా కండరాల బలహీనతతో బాధపడవచ్చు. అంతేకాకుండా ఎక్కువసేపు కూర్చున్నప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఈ నొప్పి మరింత పెరగవచ్చని చెబుతున్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
స్లిప్ డిస్క్ సమస్యను ప్రారంభంలోనే గుర్తించడం ద్వారా మందులు, థెరపీతో సమస్యను పరిష్కరించుకోవచ్చని ఫిజియోథెరపిస్టులు సూచిస్తున్నారు. డాక్టర్ సలహా మేరకు నొప్పి, వాపును తగ్గించడానికి మందులు వాడవచ్చు. ఫిజియోథెరపీ, స్ట్రెచింగ్, కండరాలను బలపరిచే వ్యాయామాలతో ప్రయోజనకరం ఉంటుంది. సరైన భంగిమలో కూర్చోవడం, బరువులు ఎత్తేటప్పుడు జాగ్రత్తగా ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పనిచేస్తున్నప్పు మధ్యలో చిన్న వాటి నడక ద్వారా స్లిప్ డిస్క్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని న్యూరో నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
