Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
Happy Ganesh Chaturthi 2025: ఓం గణేశాయ నమః..ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు వినాయకచవితి విషెస్ ఇలా చెప్పండి
హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా భాద్రపద మాసం, శుక్ల పక్షం, చతుర్థి తిథి నాడు వినాయక చవితిని జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 27న వినాయకచవితిని జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు మాత్రమే కాకుండా అనేక ఇతర మతాల వ్యక్తులు కూడా వినాయకచవితి పండుగను సెలబ్రేగ్ చేసుకుంటారు. చతుర్థి తిథి ఆగస్టు 26 మధ్యాహ్నం 1:54 నుంచి ప్రారంభమగా..ఆగస్టు 27 మధ్యాహ్నం 3:44 గంటలకు ముగుస్తుంది. ః
పూజకు శుభ ముహూర్తం ఆగస్టు 27, 2025న ఉదయం 11:06 నుండి మధ్యాహ్నం 1:40 వరకు. లోకమాన్య బాలగంగాధర తిలక్ ఈ పండుగను బ్రిటిష్ పాలనలో ప్రజలను ఏకం చేయడానికి ఒక సామాజిక ఉత్సవంగా మార్చారు. అప్పటి నుండి ఈ పండుగ ఒక పెద్ద పబ్లిక్ ఈవెంట్ గా మారింది. బుధవారం వినాయకచవితి సందర్భంగా మీ కుటుంబసభ్యులకు,ఫ్రెండ్స్, బంధువులకు శుభాకాంక్షలను అందంగా ఎలా చెప్పాలో ఇక్కడ చూడండి.

విషెస్ ఇలా చెప్పండి
-వినాయక చవితి శుభాకాంక్షలు. గణపతి మీ జీవితంలో ఆనందాన్ని, సంపదను నింపాలని కోరుకుంటున్నాను.
-విఘ్ననాయకుడి ఆశీస్సులతో మీ కలలన్నీ సాకారం కావాలని ఆశిస్తున్నాను. గణేశ్ చతుర్థి 2025 శుభాకాంక్షలు.
-వినాయకుడి కృపతో మీ కుటుంబం సుఖసంతోషాలతో, శాంతితో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.
-ఆ మోదక ప్రియుడు మీ కష్టాలన్నీ తొలగించి, జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటున్నాను.
-ఈ గణేష్ చతుర్థి పర్వదినం మీ జీవితంలో కొత్త ఆరంభాలను తీసుకురావాలని ఆశిస్తున్నాను.
-గణపతి బప్పా మోరియా..ఈ పండుగ మీ ఇంట్లో సంతోషాన్ని, శ్రేయస్సును తీసుకురావాలని కోరుకుంటున్నాను.
-అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పండుగ రోజున గణపతి మీ కోరికలన్నీ నెరవేర్చాలని ఆశిస్తున్నాను.
-జ్ఞానాన్ని ప్రసాదించే గణపతి మీ మార్గంలో అడ్డంకులు తొలగించాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు.
-పండుగ వాతావరణం, మోదకాల సువాసన.. ఈ పండుగను ఆస్వాదించండి. వినాయక చవితి శుభాకాంక్షలు.
-గజాననుడి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ.. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.
-బొజ్జ గణపయ్య మీ ఇంటికి వచ్చి మీరు పెట్టిన కుడుములు,ఉండ్రాల్లతో పాటు మీకున్న ఇబ్బందులను కూడా తీసుకెళ్లాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
-విఘ్నేశ్వరుడు మీ విఘ్నాలను తొలగించి, మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ.. హ్యాపీ వినాయక చవితి 2025.
-వినాయకుడు అంటే అడ్డంకులను తొలగించేవాడు. మన జీవితంలో వచ్చే అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలి.
-శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం..ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే..మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
-వినాయకుడిని స్మరించుకుంటే చాలు, మీ పనులన్నీ విజయవంతం అవుతాయి.
-సమస్యల నుండి భయపడకు.. వినాయకుడిని స్మరించుకో.. దారి దానంతట అదే కనిపిస్తుంది.
వినాయకుడి ఏకదంతం త్యాగాన్ని సూచిస్తుంది. మనం కూడా ఇతరుల కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి.
-గణపతిని జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. జ్ఞానం ఉంటే ఏ అడ్డంకి అయినా సులువుగా అధిగమించవచ్చు.
-వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ..నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా..మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి 2025 శుభాకాంక్షలు.
-మనసులో అంతులేని శాంతి, జీవితంలో అపారమైన సంతోషం ఉండాలంటే గణపతి ఆశీస్సులు కావాలి.
-ఓం గణేశాయ నమః! ప్రతి శుభకార్యానికి ముందు ఆయనే దైవం.
-గణపతి పూజ మనలో కొత్త శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.

-ప్రతి గణేష్ చతుర్థి మనకు కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలను గుర్తు చేస్తుంది.
-నా ప్రియమైన మిత్రులకు, వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పండుగ మన స్నేహ బంధాన్ని మరింత దృఢం చేయాలని కోరుకుంటున్నాను.
-నా కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరం కలిసి ఆనందంగా ఈ పండుగను జరుపుకుందాం.
-ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్..లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్..మీకు మీ కుటుంబ సభ్యులకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
-ఈ గణేష్ చతుర్థి పండుగ మన జీవితాలను మోదకాలంత మధురంగా మార్చాలని ఆశిస్తున్నాను.
-మీ ఇంటిని ఆనందం, శ్రేయస్సుతో నింపడానికి వినాయకుడు వస్తున్నాడు. సిద్ధంగా ఉండండి.
-ఈ పండుగలో పాలుపంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.
-ఈ ప్రత్యేకమైన రోజున మీ ఇల్లు ఆనందం, నవ్వులతో నిండిపోవాలని కోరుకుంటున్నాను.
-వినాయకుడి ఆశీస్సులతో మన కలలన్నీ నిజం కావాలి. అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.
-ఈ పవిత్రమైన పండుగ రోజున మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ..
-నా ప్రియమైన వారికి గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. మీ జీవితంలో కొత్త మార్పులు రావాలని ఆశిస్తున్నాను.
-గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు. మనందరికీ ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను.
-అగజానన పద్మార్కం గజాననమ్ అహర్నిశం..అనేక దంతం భక్తానాం ఏకదంతమ్ ఉపాస్మహే..మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి 2025 శుభాకాంక్షలు.
-సర్వ విఘ్న నివారణాయ నమః.. వినాయక చవితి 2025 శుభాకాంక్షలు.
-ఓం శ్రీ గణేశాయ నమః.. వినాయక చవితి 2025 శుభాకాంక్షలు.
.
గణపతి బప్పా మోరియా. వినాయక చవితి 2025 శుభాకాంక్షలు
మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. గణపతి అనుగ్రహంతో మీ జీవితం సుఖసంతోషాలతో నిండిపోవాలని కోరుకుంటున్నాను.
గణపతి మీ జీవితంలో శ్రేయస్సు, సంపద, సంతోషాన్ని తీసుకురావాలని ఆశిస్తున్నాను.
వినాయకుడి ప్రతిమ మనకు వివేకం, జ్ఞానాన్ని గుర్తు చేస్తుంది. వినాయక చవితి శుభాకాంక్షలు.
ఆ గణనాథుని ఆశీస్సులతో మనందరి జీవితాలు ఆనందమయం కావాలని ఆశిస్తున్నాను.
వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ లంబోదరుడు మీ కోరికలన్నీ తీర్చాలని ఆకాంక్షిస్తున్నాను.
గణపతి పూజ అంటే కష్టాలను దాటే శక్తిని కోరుకోవడం.
ఈ శుభ దినాన, మీ జీవితం కొత్త ఆశలతో నిండిపోవాలని కోరుకుంటున్నాను.
మీ జీవితంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.
వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు ఎంచుకున్న మార్గంలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
ఆ గజముఖుడు మీ జీవితంలోకి జ్ఞానాన్ని, ప్రేమను తీసుకురావాలి.
-ఈ గణేశ్ చతుర్థి పండుగ మన అందరిలో ఐక్యతను పెంచాలని ఆశిస్తున్నాను.
-సంతోషంతో, భక్తితో ఈ గణపతి పండుగను ఆస్వాదించండి.
-వినాయకుడిని పూజించడం అంటే ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోరుకోవడం.
-గణపతి అనుగ్రహం మీ ప్రతి అడుగులోనూ ఉండాలి.
-ఈ గణేష్ చతుర్థి మనకు కొత్త ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాను.
-గణపతి ఆశీస్సులతో మీ జీవితం సంతోషంతో, సంపదతో నిండిపోవాలని కోరుకుంటున్నాను.
-ప్రతి అడ్డంకిని దాటడానికి గణపతి మనకు మార్గాన్ని చూపిస్తాడు. గణపతి పూజతో మన హృదయాలు పరిశుద్ధం కావాలని ఆశిస్తున్నాను.



Click it and Unblock the Notifications