Latest Updates
-
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.! -
సాయంత్రం వేళ ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించాలి?అష్టైశ్వర్యాలు తెచ్చే అద్భుతమైన మార్గం.. -
చేతి గోళ్లు ఇలా ఉంటే కిడ్నీల ఆరోగ్యానికి వార్నింగ్.. మీకూ ఇలా ఉందా.? -
ఈ పద్ధతిలో అల్లం చట్నీ చేస్తే.. ఎవరైనా సరే నాలుగు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి సొరకాయ దోశ..అప్పటికప్పుడు ఈజీగా చేసుకోండిలా.. -
మంచి భర్త కోసం ఉపవాసం చేస్తున్నారా.. కానీ శివారాధనలో అమ్మాయిలు చేసే పొరపాట్లు ఇవే.! -
కుజ- చంద్రుల కలయికతో మహాలక్ష్మి రాజయోగం.. ఎనలేని సంపద సిద్ధించే ఈ రాశుల్లో మీరు ఉన్నారా.! -
చపాతీలో ఫేవరెట్ పనీర్ మెంతి కర్రీ.. రెస్టారెంట్ స్టైల్లో ఇలా అదరగొట్టేయండి.! -
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.!
Happy Guru Purnima 2025: గురువే దైవం,గురువే మార్గం..గురుపూర్ణిమ శుభాకాంక్షలను ఇలా చెప్పండి
గురువులకు, ఉపాధ్యాయులకు, పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారిని గౌరవిస్తూ జరుపుకునే ఒక పవిత్రమైన పండుగ గురు పూర్ణిమ. హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున దీనిని జరుపుకుంటారు. ఈ రోజునే మహాభారత గ్రంథకర్త, వేదాలను విభజించిన వేద వ్యాస మహర్షి జన్మించారని నమ్ముతారు. అందుకే గురుపూర్ణిమను వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. వ్యాస మహర్షి మానవజాతికి జ్ఞానాన్ని అందించిన గొప్ప గురువుగా భావిస్తారు. ఆషాఢ పౌర్ణమి రోజునే శివుడు సప్తర్షులకు జ్ఞానబోధ చేశాడని పురాణాలు చెబుతున్నాయి.
హిందూ ధర్మంలో తల్లిదండ్రుల తర్వాత గురువుకే అత్యంత ఉన్నత స్థానం ఉంది. గురువులు అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదిస్తారు. ఈ రోజున గురువులను పూజించడం ద్వారా త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. గురు పూర్ణిమ నాడు భక్తులు సాయిబాబా, దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి వంటి గురువుల ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఏడాది జులై 10న గురుపూర్ణిమ జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం గురువారం నాడు గురుపూర్ణిమ రావడంతో దీనికి మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఎందుకంటే గురువారం దేవతల గురువు బృహస్పతికి అంకితం చేయబడిన రోజు. ఇవాళ గురు పూర్ణిమ సందర్భంగా మీ గురువులకు,బంధుమిత్రులకు,కుటుంబ సభ్యులకు పంపగలిగే శుభాకాంక్షల సందేశాలను ఇక్కడ చూడండి.

గురుపూర్ణిమ శుభాకాంక్షల సందేశాలు ఇలా చెప్పండి
-గురువు లేని విద్య గుడ్డిది. గురుపూర్ణిమ శుభాకాంక్షలు.
-గురువుల పాదాలకు నమస్కరిస్తూ గురుపూర్ణిమ శుభాకాంక్షలు.
-జ్ఞానజ్యోతిని వెలిగించిన గురువులకు వందనం. గురుపూర్ణిమ శుభాకాంక్షలు.
-గురువు అనుగ్రహం ఉంటేనే జీవితంలో విజయం. గురుపూర్ణిమ శుభాకాంక్షలు.
-గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః.. గురు సాక్షాత్తు పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః..గురుపూర్ణిమ శుభాకాంక్షలు.
-గురువు అంటే మాట్లాడకుండానే అజ్ఞానమనే చీకటిని పారద్రోలే దీపం. ఈ గురు పూర్ణిమ నాడు ఆయనకు హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను
-నన్ను నేను తెలుసుకోవడానికి సహాయం చేసిన నా గురువుకు ధన్యవాదాలు.
-మార్గదర్శకులు, స్ఫూర్తి ప్రదాతలు అయిన గురువులకు ప్రత్యేక శుభాకాంక్షలు.
-భావి తరాలను తీర్చిదిద్దుతున్న గురువులంటే ఎవరో కాదు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులే.
-గురువు ఆశీస్సులు జీవితానికి అతి పెద్ద ఆస్తి. ఈ గురు పూర్ణిమ నాడు మీ గురువును స్మరించుకోండి, ఆయన పాదాల దగ్గర నిజమైన భక్తిని అర్పించండి.
-గురువు అనే అక్షరం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపం. గురుపూర్ణిమ శుభాకాంక్షలు.
-మీ బోధనలు నా జీవితానికి మార్గదర్శకాలు. ధన్యవాదాలు గురువుగారు.
-ఈ పవిత్ర దినాన నా గురువులకు శతకోటి వందనాలు.
-ఆధ్యాత్మిక గురువుగా, భగవంతునిగా భక్తుల గుండెలలో కొలువైఉన్న షిరిడీ సాయిబాబా గురు పూర్ణిమ మహాత్యాన్ని తెలియజెప్పిన గొప్ప గురువు.
-అజ్ఞాన తిమిరాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులకు నమస్కారం.

-మీరు నా జీవితంలో నింపిన వెలుగుకు కృతజ్ఞతలు. గురుపూర్ణిమ శుభాకాంక్షలు.
-గురువు అంటే కేవలం బోధించే వ్యక్తి కాదు, జీవితాన్ని తీర్చిదిద్దే శిల్పి.
-మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను.
-గురువే దైవం, గురువే మార్గం. గురుపూర్ణిమ శుభాకాంక్షలు.
-మీరు లేకపోతే ఈ జ్ఞానం లేదు. ధన్యవాదాలు గురువుగారు.
-గురుబోధలు అజరామరం. గురుపూర్ణిమ శుభాకాంక్షలు.
-మీ ప్రతి మాటా నా జీవితానికి ఒక పాఠం. గురుపూర్ణిమ శుభాకాంక్షలు.
-గురువు అనే పదానికి సరికొత్త అర్థం మీరు. గురుపూర్ణిమ శుభాకాంక్షలు.



Click it and Unblock the Notifications