Latest Updates
-
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు!
Happy Independence Day: భారత్ మాతా కీ జై..స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను ఇలా అందంగా చెప్పుకోండి
ప్రతి సంవత్సరం ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది. ఈ రోజు 1947లో మన దేశానికి స్వేచ్ఛ లభించిన సందర్భాన్ని గుర్తు చేస్తుంది. భారతదేశం..బ్రిటిష్ పాలన నుండి, వారి బానిసత్వం, నియంతృత్వం నుండి స్వేచ్ఛ పొంది 78 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. శుక్రవారం(ఆగస్టు 15,2025) 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకను భారత్ జరుపుకుంటుంది. ఇది దేశంలోని ప్రతి పౌరుడికి గర్వం, వేడుక, ఆనందమైన రోజు. ప్రజలు పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, సమాజాలు, వీధులు, పొరుగు ప్రాంతాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్ర్యం వచ్చినందుకు ఒకరినొకరు అభినందించుకుంటారు.
ఈ శుభ సందర్భంగా ప్రజలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో వివిధ రకాల స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షల సందేశాలను కూడా పంచుకుంటారు. మీరు మీ స్నేహితులు, బంధువులు, కార్యాలయ సహోద్యోగులు, కుటుంబ సభ్యులకు పంపగలిగిన కొన్ని అన్ని అద్భుతమైన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షల సందేశాలను ఇక్కడ చూడండి.

ఇండిపెండెన్స్ డే విషెస్ ఇలా చెప్పుకోండి
-భారత మాతకు జై..మీకు, మీ కుటుంబ సభ్యులకు 2025 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
-ఈ రోజు మన దేశం స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్న రోజు. మన దేశం సాధించిన ప్రగతిని చూసి మనం గర్వపడాలి. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
-నా భారతదేశం, నా ప్రేమ. నీ కోసం నా జీవితం అంకితం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
-స్వేచ్ఛను ఆస్వాదిస్తూ, మన దేశ పురోగతి కోసం కృషి చేద్దాం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
-స్వాతంత్ర్యం అనేది ఒక బహుమతి. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. జై హింద్.
-ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని..నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని. అందరికీ హ్యాపీ ఇండి పెండెన్స్ డే.
-ఈ స్వాతంత్ర్య దినోత్సవం మనందరికీ ఆనందం, శ్రేయస్సు, శాంతిని తీసుకురావాలని ఆశిస్తున్నాను.
-వేల మంది వీరుల రక్తం, కన్నీళ్ల ఫలితం మన స్వాతంత్ర్యం. దాన్ని గౌరవిద్దాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే 2025.
-ప్రతి భారతీయుడి గుండెలోనూ దేశభక్తి జ్వాల రగులుతూనే ఉండాలి. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
-తల్లీ భారతి వందనం.. నీ ఇల్లే నందనం.. మేమంతా మీ పిల్లలం.. నీ చల్లని ఒడిలో మల్లెలం. అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు..
-మన జాతీయ గీతంలో ఉన్న ప్రతి పదం, మన త్రివర్ణ పతాకంలో ఉన్న ప్రతి రంగు మన దేశ గొప్పతనాన్ని సూచిస్తాయి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే 2025.
-మనం ఏ మతానికి, ఏ భాషకు చెందినవారమైనా, మనందరినీ కలిపి ఉంచేది భారతీయత మాత్రమే. మన దేశాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుదాం. జై హింద్.

-మతం పేరుతో జీవించవద్దు, మతం పేరుతో చనిపోవద్దు. దేశ మతం మానవత్వం.. దేశం పేరుతో జీవించండి. భారత్ మాతా కీ జై. 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
-దేశభక్తి అనేది ఈ ఒక్క రోజుతో ఆగిపోకూడదు, అది నిరంతరంగా కొనసాగాలి. జై భారత్.
-ప్రతి హృదయంలో దేశభక్తి ఉండాలి, ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం పట్ల గౌరవం ఉండాలి. దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి కలిసి ప్రతిజ్ఞ చేద్దాం. జై హింద్.
-మన హృదయాల్లో దేశభక్తి దీపాన్ని వెలిగిద్దాం, కలిసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుందాం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
-దేశభక్తి గుండెల్లో ఉండాలి.. చేతినిండా జెండాలతో కాదు.. నేలపై పడ్డ జెండా కింద పడి నలగకుండా గుండెలకు హత్తుకోవడంలో ఉంటుందని నిజమైన దేశభక్తి.
-స్వేచ్ఛా భారతావనిలో జన్మించినందుకు గర్వంగా ఉంది. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
-మన దేశాన్ని బ్రిటిష్ పాలన నుండి విడిపించడానికి ప్రాణాలను త్యాగం చేసిన వీరులను మనం ఎప్పటికీ మరచిపోకూడదు. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
-మేము దేశం కోసం జీవిస్తాము, దేశం కోసం మరణిస్తాము, త్రివర్ణ పతాకానికి గౌరవంగా ఎల్లప్పుడూ తలలు వంచి నమస్కరిస్తాము. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

-స్వేచ్ఛను జరుపుకోండి, త్రివర్ణ పతాకాన్ని ఊపండి, వీరుల త్యాగాలను గుర్తుంచుకోండి. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు .
-దేశ నేలపై ప్రేమ ఉన్నంత వరకు, స్వేచ్ఛ అమరత్వం. జై హింద్.
-భిన్నత్వంలో ఏకత్వం మన భారత దేశం ప్రత్యేకత. దాన్ని కాపాడుకుందాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.
-శత్రువులు కూడా సెల్యూట్ చేసే త్రివర్ణ పతాకం ప్రతి భారతీయుడికి గర్వకారణం. జై హింద్, జై భారత్.
-త్రివర్ణ పతాకం కేవలం జెండా కాదు, అది మన గుర్తింపు,మన ఆత్మ.
-అమరవీరుల త్యాగం వృధా కాకూడదు, ఇది ప్రతి భారతీయుడి ప్రతిజ్ఞ కావాలి. దేశం ముందు ముఖ్యం, మిగతావన్నీ తర్వాతే. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
-అంకితభావం, కష్టపడి పని చేయడమే మన దేశానికి మనం ఇచ్చే నిజమైన గౌరవం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
-భారతదేశం యొక్క గొప్ప చరిత్ర, సంస్కృతికి మనం వారసులు. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

స్వాతంత్ర్య సమరయోధుల కోట్స్
-ప్రపంచంలో మీరు చూడాలనుకునే మార్పుగా మారండి- మహాత్మా గాంధీ.
-నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను- సుభాష్ చంద్రబోస్.
-నేను ఆజాద్‌నే, నేను ఆజాద్‌గానే ఉంటాను- చంద్రశేఖర్ ఆజాద్.
-స్వరాజ్యం నా జన్మహక్కు, నేను దానిని సాధిస్తానుబాల గంగాధర్ తిలక్.
-నా ఏకైక కోరిక భారతదేశం స్వేచ్ఛగా, మన జెండా యొక్క కీర్తిని పునరుద్ధరించడాన్ని చూడటం- అష్ఫాకుల్లా ఖాన్.
-వారు నన్ను చంపవచ్చు, కానీ వారు నా ఆలోచనలను చంపలేరు - భగత్ సింగ్.
-దేశ సేవలో పౌరసత్వం ఉంటుంది- జవహర్‌లాల్ నెహ్రూ.
-నేను నా ఝాన్సీని వదులుకోను-రాణి లక్ష్మీబాయి.
-భారతదేశంలోని ప్రతి వ్యక్తి తాను భారతీయుడని,ఈ దేశంలో తనకు కొన్ని విధులతో అన్ని హక్కులు ఉన్నాయని గుర్తుంచుకోవాలి - సర్దార్ వల్లభాయ్ పటేల్.



Click it and Unblock the Notifications











