Latest Updates
-
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.?
ఓరి భగవంతుడా: భార్య సబ్బు వాడినందుకు భర్తకు ఇన్ని కష్టాలా..
ఈ మధ్యకాలంలో ఎందుకు విడాకులు తీసుకుంటున్నారో,ఎందుకు బ్రేకప్స్ అవుతున్నాయో ఎవరికీ అర్థం కావట్లేదు. చిన్న చిన్న కారణాలకే పెద్ద పెద్ద గొడవలు పెట్టుకుంటున్నారు. సర్థుకుపోయే స్వభావం తగ్గిపోవడంతో చాలా కాపురాలు కూలిపోతున్నాయి. తాజాగా ఓ మహిళ తన భర్తపై పోలీసులకు చేసిన కంప్లైంట్ గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఈ ఘటన వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్ లోని ఖురాసీ ప్రాంతంలో నివసించే ప్రవీణ్ కుమార్(39)తన భార్య వాడే సబ్బునే వాడుతుండేవాడు. అయితే నా సబ్బు వాడొద్దు వేరే సబ్బు వాడాలని భర్తకు సూచించింది భార్య. అయినా వినని ప్రవీణ్ కుమార్ గత శుక్రవారం కూడా భర్యా రుద్దుకునే సబ్బుతోనే స్నానం చేసి బాత్ రూమ్ లో నుంచి బయటకు రాగానే ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకుండా నా సబ్బు ఎందుకు రుద్దుకుంటున్నావ్ అని భార్య అడగ్గా..నాకు సంబంధించిన అనేక వస్తువులు నువ్వు కూడా వాడుకుంటున్నావ్ కదా,నేనెప్పుడు దీని గురించి ఫిర్యాదు చేయలేదు కదా అని ఆమెతో భర్త చెప్పాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో వెంటనే భార్య పోలీసులకు ఫోన్ చేసి తన భర్త తనను వేధిస్తున్నాడంటూ కంప్లెయింట్ చేసింది. దీంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకోగానే అసలు విషయం బయటపడటంతో పోలీసులు అవాక్కయ్యారు.

తర్వాత పోలీసులు ప్రవీణ్ కుమార్ ని పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అయితే మా మధ్య జరిగిన ఓ చిన్న గొడవకే పోలీసులు స్టేషన్ లో తనను కొట్టారని ప్రవీణ్ కుమార్ ఆరోపించాడు. దీనిపై ఖురాసీ SHO నరేంద్ర శర్మ స్పందిస్తూ..భార్యపై ప్రవీణ్ దాడి చేసినట్లు మాకు కంప్లైయింట్ వచ్చింది. అతడిని పోలీస్ స్టైషన్ కి తీసుకొచ్చి శాంతికి భంగం కలిగించిన కేసు పెట్టాం. కేసు దర్యాప్తు కొనసాగుతోందని.. దంపతులిద్దరికీ చిన్న చిన్న గాయాలవడంతో వారిని మెడికల్ ఎగ్జామినేషన్ కోసం పంపాం" అని చెప్పారు. ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చిన ప్రవీణ్ తన భార్య చీటికి మాటికి తనతో గొడవపడుతూ పోలీసులకు ఫోన్ చేస్తుంటదని చెప్పారు. కాగా,ప్రవీణ్ కు పెళ్లి జరిగి 13 ఏళ్లు అవ్వగా వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ఈ వ్యవహారంపై స్థానిక డీఎస్సీ మాట్లాడుతూ..ప్రవీణ్ గృహహింస వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఆయన భార్య పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. ప్రవీణ్ ఆరోపిస్తున్నట్లు స్టేషన్ లో ఆయనపై ఎలాంటి దాడి జరగలేని,పోలీసులతోనే అతను అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తమ దగ్గర ఓ వీడియో కూడా ఉందని స్థానిక డీఎస్సీ తెలిపారు.
ఇక, ఈ ఘటనకు సంబంధించిన వ్యవహారం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యి నెటిజన్లు దీనికి రకరకాల ఫన్నీ కామెంట్స్, మీమ్స్ చేస్తున్నారు. ఇదంతా కేవలం ఈగో మాత్రమే అని కొందరు..మోడ్రన్ మ్యారేజెస్ లో కమ్యూనికేషన్ లోపం వల్లనే ఇదంతా అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వ్యక్తిగత శుభ్రతకు సంబంధించిన చిన్న ఇష్యూ సీరియస్ లీగల్ వ్యవహారంగా మారిందని కామెంట్ చేశారు. ఇది కేవలం సబ్బు గురించి కాదని..ఇది ఎవరి హద్దుల్లో వాళ్లు ఉండటాన్ని తెలియజేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు



Click it and Unblock the Notifications