Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఐ లవ్ యూ అమ్మా,తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో.. యూట్యూబర్ కోమలి ఆత్మహత్య వెనుక గుండెల్ని పిండేసే విషాదం!
హైదరాబాద్ నగరంలో మరో యువతి ప్రేమకు బలయ్యింది. కళ్లనిండా ఎన్నో అందమైన కలలు, సినీ రంగంలో అడుగుపెట్టి హీరోయిన్ గా ఎదగాలనే ఆశయం.. కానీ ప్రేమించిన వాడి చేతిలో మోసపోయి ఉరికొయ్యకు వేలాడింది. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అమ్మా.. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో అంటూ కువైట్ లో ఉన్న కన్నతల్లికి పంపిన కడపటి సందేశం అందరి హృదయాలను కలచివేస్తోంది.
అసలేం జరిగిందంటే..
విశాఖపట్నానికి చెందిన బోను కోమలి (21) హైదరాబాద్ లోని మణికొండ చిత్రపురి కాలనీలో బంధువుల దగ్గర ఉంటూ బీఎస్సీ చదువుతోంది. చదువుకుంటూనే సోషల్ మీడియాలో యూట్యూబర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే అదే విశాఖపట్నానికి చెందిన అఖిల్ రెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తో కోమలి రిలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేమ పేరుతో దగ్గరైన అతడు ఆమెను మానసికంగా, ఆర్థికంగా వాడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

తీరా పెళ్లి చేసుకుందాం అనేసరికి అఖిల్ ముఖం చాటేయడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తనను దూరం పెడుతుండటంతో మనస్తాపానికి గురైన కోమలి ఆరు నెలల క్రితం కూడా ఆత్మహత్యకు యత్నించగా బంధువులు, తల్లి సర్దిచెప్పారు. అతడిని వదిలేసి, కెరీర్ పై దృష్టి పెడతానని, హీరోయిన్ అవుతానని అప్పట్లో కోమలి తన తల్లికి మాటిచ్చింది.
చివరి రోజుల్లోం జరిగిందంటే..
పోలీసుల దర్యాప్తు, సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. శనివారం రాత్రి అఖిల్ రెడ్డి కోమలి ఉంటున్న గదికి వచ్చినట్లు సమాచారం. ఆ సమయంలో పెళ్లి విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తీవ్ర మానసిక క్షోభకు గురైన కోమలి సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకుంది. మధ్యాహ్నాం 3 గంటల సమయంలో పదే పదే తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో రాయదుర్గం ఇన్ స్పెక్టర్ వెంకన్న ఆధ్వర్యంలో పోలీసులు గొళ్లెం పగలగొట్టి చూడగా ఆమె విగతజీవిగా కనిపించింది.
కన్నీరుమున్నీరుగా తల్లి ఆవేదన..
కూతురి మరణవార్త తెలుసుకుని కువైట్ నుంచి హుటాహుటిన నగరానికి చేరుకున్న తల్లి సత్య వరలక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపించారు.
అందంగా ఉండే నా కూతుర్ని ఇలా విగతజీవిగా చూడలేకపోతున్నా. పెళ్లి పీటలు ఎక్కాల్సిన నా బిడ్డను అఖిల్ రెడ్డి పాడెక్కించాడు. ప్రేమ పేరుతో నా బిడ్డను వాడుకున్నాడు, ఆమె డబ్బులు కూడా కాజేశాడు. డబ్బు పోయినా పర్వాలేదు, కానీ వాడి కారణంగా నా కూతురే దక్కకుండా పోయింది. పైగా అఖిల్ వాళ్ల అక్క ఫోన్ చేసి, తన తమ్ముడు ఎక్కడ చనిపోతాడో అంటూ మమ్మల్నే బెదిరించింది. నా బిడ్డ చావుకు కారణమైన వాడిని కఠినంగా శిక్షించి మాకు న్యాయం చేయాలి అంటూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.
కోమలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో కోమలి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఈ కథనం ఇవ్వబడింది. దీనిని బోల్డ్ స్కై తెలుగు ధృవీకరించలేదు.



Click it and Unblock the Notifications