Latest Updates
-
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా?
భారతదేశాన్ని దశాబ్దాల పాటు ఆక్రమించుకొని మన సంపదను దొంగలించడంతో పాట మన ప్రజలను బానిసలుగా మార్చకొని అరాచకాలు కొనసాగించిన బ్రిటీషర్లను తరిమికొట్టి మనం స్వాతంత్ర్యం సంపాదించకున్న రోజు ఆగస్టు 15.
ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాలతో ఇవాళ మనం స్వేఛ్చా వాయువులు పీల్చుకుంటున్నాం. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం రాగా..ఇవాళ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.

స్వాతంత్ర్య దినోత్సవం అనగానే ప్రతి భారతీయుడి గుండె దేశభక్తితో ఉప్పొంగుతుంది. ఇవాళ ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై మన జాతీయ జెండా గర్వంగా రెపరెపలాడుతుంటే ఆ అద్భుత దృశ్యాన్ని చూసి ప్రతి కన్నూ ఆనందభాష్పాలు రాలుస్తుంది. అయితే అడుగడుగునా ఎన్నో అద్భుత కట్టడాలు ఉన్న మన విశాల భారతదేశంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు, ప్రధాని ప్రసంగానికి ఎర్రకోటనే ఎందుకు వేదికగా ఎంచుకున్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన ఈ ఎర్రకోట ఒకప్పుడు అధికారానికి, వైభవానికి కేంద్ర బిందువు. దాదాపు ఇరవై ఐదు అడుగుల ఎత్తైన ఎర్రటి ఇసుకరాయి గోడలతో నిర్మితమైన ఈ అభేద్యమైన కోట, భారతదేశ పరిపాలనా పరాక్రమానికి, రాజసానికి, అంతులేని సంపదకు ప్రతీకగా నిలిచింది. ఎర్రకోట ఎవరి చేతిలో ఉంటే, యావత్ భారతదేశం వారి గుప్పిట్లో ఉన్నట్లే అనే బలమైన నానుడి గతంలో ఉండేది.
కానీ కాలచక్రంలో మొఘలుల ప్రాభవం క్షీణించడం మొదలైంది. అదే సమయంలో దేశంలోకి అడుగుపెట్టిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నెమ్మదిగా అధికారాన్ని ఆక్రమించింది. ఒకప్పటి మహారాజుల భవనాన్ని, 19వ శతాబ్దంలో బ్రిటిష్ ప్రభుత్వం పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని తమ సైనిక శిబిరంగా మార్చేసుకుంది.

స్వాతంత్ర్య పోరాటానికి కూడా ఒక సజీవ సాక్షి
1857లో జరిగిన తొలి స్వాతంత్ర్య సంగ్రామానికి ఈ కోటే కేంద్ర బిందువు. బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చేసిన వీర సైనికులు, యోధులు చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ ను తమ నాయకుడిగా ప్రకటించి, ఇక్కడి నుంచే తొలి సమర శంఖం పూరించారు. ఆ తర్వాత బ్రిటిష్ వారు క్రూరంగా ఈ తిరుగుబాటును అణచివేసినా, భారతీయుల గుండెల్లో రగిలిన స్వాతంత్ర్య జ్వాలలను మాత్రం ఆర్పలేకపోయారు.
ఆ తర్వాత కాలంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) వీరులపై బ్రిటిష్ వారు ఎర్రకోటలోనే విచారణ జరిపారు. ఆ విచారణలు యావత్ భారతదేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించి, బ్రిటిష్ వ్యతిరేక నిరసనలను మరింత ఉధృతం చేశాయి.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi hoists the National Flag at Red Fort on the 80th Independence Day.
— ANI (@ANI) August 15, 2026
The hoisting of the National Flag was synchronised with the 21-Gun Salute by the gunners of the 1721 Field Battery (Ceremonial). The ceremonial battery, utilising the… pic.twitter.com/rbaiIKQpPU
దశాబ్దాల సుదీర్ఘ పోరాటం, ఎంతోమంది త్యాగధనుల బలిదానాల తర్వాత 1947 ఆగస్టు 15న భారతదేశం దాస్యశృంఖలాలను తెంచుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది.
స్వాతంత్యానికి ముందు రోజు అర్ధరాత్రి పార్లమెంట్లో ట్రైస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం చేసిన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, దేశ స్వాతంత్ర్యాన్ని అధికారికంగా ప్రపంచానికి సగర్వంగా చాటిచెప్పేందుకు ఒక వేదిక కోసం అన్వేషించారు. భారతీయుల అణచివేతకు, స్వేచ్ఛా పోరాటానికి సాక్షిగా నిలిచిన ఎర్రకోట కంటే గొప్ప వేదిక మరొకటి లేదని ఆయన భావించారు.
ఆ విధంగా విదేశీ ఆధిపత్యానికి ప్రతీకగా ఉన్న బ్రిటిష్ జెండాను దించి, ఎర్రకోట లాహోరీ గేటుపై మొట్టమొదటిసారిగా మన మువ్వన్నెల జెండాను ఎగురవేశారు నెహ్రూ. ఆ చారిత్రక ఘట్టం స్వతంత్ర భారతదేశ చరిత్రలో చెరగని ముద్ర వేసింది. ఆనాడు నెహ్రూ వేసిన ఆ అడుగు, నేడు ఒక గొప్ప సంప్రదాయంగా మారింది. 1947 నాటి ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ, నాటి నుండి నేటి వరకు ప్రతి ఏడాదీ భారత ప్రధానమంత్రి అక్కడి నుంచే జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్నారు.



Click it and Unblock the Notifications