Latest Updates
-
World Heart Day: మీ ‘గుండె’ పదిలమేనా.. ఈ 8 సూత్రాలు అమలు చేస్తే నిండు జీవితం సొంతం.! -
లొట్టలేసుకుంటూ తినేలా చేసే హైదరాబాద్ ఖట్టీ దాల్.. సాంబార్ కంటే రెట్టింపు రుచి.! -
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.!
నోరూరించే వెల్లుల్లి పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ ఉంటది..
వెల్లుల్లి నిల్వ పచ్చడి తెలుగు వారి వంటింట్లో ఎంతో విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్న ఒక సాంప్రదాయ వంటకం. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నా, లేదా ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి టిఫిన్లలో నంచుకుని తిన్నా ఇది అద్భుతమైన రుచిని ఇస్తుంది.
ఈ పచ్చడి ఊరిన కొద్దీ వెల్లుల్లి రెబ్బలు మెత్తబడి రుచి మరింత పెరుగుతుంది. వెల్లుల్లి నిల్వ పచ్చడి ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

వెల్లుల్లి నిల్వ పచ్చడి తయారీకి కావాల్సినవి
-అర కేజీ పొట్టు తీసిన వెల్లుల్లి
-200 గ్రాముల కారం
-150 గ్రాముల ఉప్పు
-25 గ్రాముల ఆవ పిండి
-10 గ్రాముల వేయించిన మెంతుల పొడి
-నువ్వుల నూనె
-1 టీస్పూన్ పసుపు
-1 టీస్పూన్ ఇంగువ
-1 టీస్పూన్ జీలకర్ర
-10 ఎండుమిరపకాయలు
-2 రెమ్మల కరివేపాకు
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా..
వెల్లుల్లి నిల్వ పచ్చడి తయారీ విధానం
-ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. అందులో అర కప్పు నువ్వుల నూనె వేసి వేడి చెయ్యాలి.
-నూనె వేడెక్కాక అందులో పొట్టు తీసిన అరకేజీ వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. లైట్ గా వేపుకుంటే చాలు మరీ ఎర్రగా వేగనక్కర్లేదు. లైట్ గా వేగాకా వీటిని ఓ ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న కడాయిలోనే మరో 1 కప్పు(250 ml) నూనె వేసి వేడి అయ్యాక అందులో 1 టీస్పూన్ ఆవాలు వేసి అవి చిటపటమనేటప్పుడు అర టీస్పూన్ మెంతులు, 1 టీస్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా వేగిన తర్వాత అందులో రెండు రెమ్మల కరివేపాకు, 10 ఎండుమిరపకాయలు, 1 టీస్పూన్ ఇంగువ వేసి స్టవ్ ఆపేసి కలపండి. ఆయిల్ వేడికే అవన్నీ వేగిపోతాయి. స్టవ్ మీద నుంచి కడాయిని దించి తాలింపుని చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకోండి. అందులో 200 గ్రాముల కారం, 150 గ్రాముల ఉప్పు, 25 గ్రాముల ఆవ పిండి, 10 గ్రాముల వేయించిన మెంతుల పొడి, 1 టీస్పూన్ పసుపు వేసి మెత్తం ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోనే 1కప్పు(250 ml)నిమ్మరసం వేసి కలుపుకోండి.
-ఇప్పుడు అందులోనే పూర్తిగా చల్లారిన తాలింపుని వేసుకొని కలుపుకోండి. తర్వాత వేయించిన వెల్లుల్లి రెబ్బలను వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. తర్వాత దీన్ని గాజు సీసాలో పెట్టుకుంటే ఏడాది వరకు నిల్వ ఉంటది. దీనిని 3 రోజుల పాటు ఊరనివ్వండి. తర్వాత నుంచి దీన్ని వేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
