తెల్ల జుట్టుకి చెక్‌ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.!

రోజూ ఒక్క ఉసిరికాయ తింటే మన ఆరోగ్యానికి అందే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే ఉసిరిని ఆరోగ్య సిరి అంటారు. ఆయుర్వేద వైద్యంలో కీలక పాత్ర పోషించే ఉసిరిని నేరుగా తీసుకుంటాం. లేదా వివిధ రూపాలుగా ఆహారంలో చేర్చుకుంటాం. అలాంటిదే ఆమ్లా మురబ్బా. ఈ ఆమ్లా మురబ్బాను ఒక్కసారి ఈ పద్ధతిలో చేశారంటే ఏడాది పాటు నిల్వ ఉంటుంది.

Amla murabba for white hair solution and glowing skin naturally know easy process

ఈ ఉసిరి ముఖ్యంగా చర్మ, ఆరోగ్య సంరక్షణకి దోహదపడుతుంది. తెల్ల జుట్టు సమస్య ఉన్నవారు ఇలా ఆమ్లా మురబ్బాను చేసుకుని తిన్నారంటే ఆ సమస్యను నివారిస్తుంది. విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్‌, ఫైబర్‌ పుష్కలంగా ఉండే ఉసిరి.. స్త్రీ, పురుషుల్లో హార్మోన్ల సమతుల్యతను కాపాడి వారిలో యవ్వన శక్తిని మరింత పెంచుతుంది. అలాంటి ఆరోగ్యకరమైన ఆమ్లా మురబ్బాను ఎలా తయారూచేయాలో చూద్దాం..

ఆమ్లా మురబ్బా తయారీకి కావాల్సిన పదార్థాలు

ఉసిరికాయలు- అర కేజీ
అల్లం- చిన్న ముక్క
బెల్లం- అరకేజీ
మిరియాల పొడి- పావు టీస్పూన్‌
నల్ల ఉప్పు- పావు టీస్పూన్‌
జీలకర్ర పొడి- పావు టీస్పూన్‌
గరం మసాలా- పావు టీస్పూన్‌
కారం- పావు టీస్పూన్‌
ఏలకుల పొడి- అర టీస్పూన్‌
పుచ్చకాయ గింజలు- రెండు టేబుల్‌ స్పూన్లు

ఆమ్లా మురబ్బా తయారీ విధానం

నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా..

ముందుగా అరకేజీ తాజా ఉసిరికాయలను తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి. గింజలు తీసివేసి ముక్కలుగా కట్‌ చేసి చిన్న అల్లం ముక్క వేసి మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.

బెల్లం తీసుకుని తురిమి పెట్టుకోవాలి. స్టవ్‌పైన నాన్‌స్టిక్‌ లేదా స్టీల్ పాన్‌ పెట్టుకుని వేడయ్యాక అందులో ఉసిరి, బెల్లం మిశ్రమం వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.

Amla murabba for white hair solution and glowing skin naturally know easy process

ఉసిరి, బెల్లంలో నీరంతా ఉడుకుతూ మిశ్రమం చిక్కబడుతూ ఉంటుంది. అప్పుడు మిరియాల పొడి, నల్ల ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. ఈ లోపు మరో పాన్‌లో పుచ్చకాయ గింజలను దోరగా వేయించాలి.

ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు

ఈ మిశ్రమం అంతా చిక్కబడి చేత్తో తీసుకున్నప్పుడు జిగుటు పాకం మాదిరిగా అవుతుంది. అడుగంటకుండా కలపాలి. చివర్లో ఏలకుల పొడి, పుచ్చకాయ గింజలు వేసి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి.

చల్లారిన తర్వాత గాజు డబ్బాలో స్టోర్‌ చేసి మూత పెట్టుకోవాలి. ఎంతో ఈజీగా హెల్తీ ఆమ్లా మురబ్బా రెడీ.

[ of 5 - Users]
Story first published: Tuesday, September 29, 2026, 7:18 [IST]
Desktop Bottom Promotion