Latest Updates
-
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా
క్రియేటివ్ కింగ్, సీటులేదని రైలులో సొంత ఉయ్యాల, హ్యాట్సాఫ్ ! వీడియో వైరల్
భారతదేశంలోని సాధారణంగా రైళ్ల సందడిగా ఉండే కంపార్ట్‌మెంట్లలో, ప్రతి అంగుళం స్థలం ఎంతో విలువైనదిగా ప్రయాణికులు భావిస్తారు. రైలు జనరల్ కంపార్ట్ మెంట్ లో నిలబడటానికి కూడా చోటు ఉండదు. కానీ ఒక యువకుడు తను పడుకోవడానికి తన ప్రదేశాన్ని తానే సృష్టించుకున్నాడు. ఈ రైలు ప్రయాణంలో ఆ వ్యక్తి చేసిన పనికి కొన్ని మిలియన్ల మంది మనస్సును ఆకర్షించాడు. ఒక సాధారణ బెడ్‌షీట్‌ను తాత్కాలిక ఊయలగా మార్చాడు, తద్వారా రద్దీగా ఉండే గందరగోళం మధ్య తన కోసం హాయిగా నిద్రించేందుకు ఊయలను ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడప్పుడు ఇలాంటి క్రియేటివ్ ఐడియాలు మన భారతీయుల్లో స్ఫూర్తినిచ్చేవిధంగా ఉంటాయి. కొన్ని క్లిష్టపరిస్థితుల్లో వారిలోని ట్యాలెంట్ ఇలా బయటపడుతుంటుంది. అయితే దీన్ని చూసిన తర్వాత భారతదేశంలోని జనరల్ బోగీలలో ప్రయాణికులు ఎదుర్కొనే ప్రత్యేక సవాళ్లను గుర్తు చేస్తుంది.
ఏదైతేనేం అతను చేసిన పనికి ప్రసంశలు అందుకుంటున్నాడు. ఈ విడియో కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నిలబడటానికి కూడా స్థలం లేనటువంటి రద్దీ ప్రదేశంలో కూడా అతనికి వచ్చిన ఓ ఐడియాతో తను హాయిగా నిద్రపోవడానికి ఓ ఊయలను సృష్టించుకున్న విధానం అద్భుతంగా ఉందని సోషియల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

స్లీపర్ కోచ్ లో నిల్చోవడానికి కూడా స్థలం లేని ప్రదేశంలో రెండు వైపుల సీట్లలో నలుగురుఐదుగురు కూర్చొన్నారు. పై బెర్త్ లో పడుకున్నారు. నిల్చుకోవడానికి కూడా స్థలం లేకుండటంతో ఆ వ్యక్తి తెలివిగా ఒక ఉపాయం కనుగొన్నాడు. అతను పైన రెండు బెర్త్ లకు మద్యలో ఒక బెడ్ షీట్ ను ఊయలగా కట్టి, అందులో హాయిగా పడుకుని, నిద్రించడం ఈ వీడియోలో మనం చూడవచ్చు.
ఈ వీడియో ఇరవై వేల మంది ఫాలోవర్స్ ఉన్న పాయల్ ('చల్బే-) అనే నెటిజన్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. అంతే కాదు, ఈ పోస్ట్ కు ఒక క్యాప్షన్ కూడా పెట్టాడు భారత దేశంలో ప్రతిభకు లోటు లేదు. ఇక్కడి ప్రజలు అద్భుతంగా ఉన్నారు. దాంతో ఈ పోస్ట్ వైరల్ అవుతూ అద్భుతమైన కామెంట్స్ పెడుతున్నారు. ఒక వినియోగదారుడు మన దేశంలో ప్రజల్లో ఎంతో ప్రతిభ దాగింది కేవలం ప్రదిర్శించాలని కామెంట్ పెట్టాడు. మరో నెటిజన్ స్పందిస్తూ స్కిల్స్ అండ్ క్రియేటివిటి ఉన్న వ్యక్తులు ప్రతి చోటా ఉన్నారంటూ మరొక నెటిజన్ కామెంట్ చేశారు. ఇలాంటి ఐడియాస్ మన ఇండియన్స్ కే వస్తాయంటూ మరో నెటిజన్ స్పందించడ ఆశ్చర్యం కలిగిస్తోంది.



Click it and Unblock the Notifications