Latest Updates
-
బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకునేలా క్రిస్పీ సొరకాయ బజ్జీలు.. టీ, కాఫీలోకి ఆ మజానే వేరు.! -
రిలేషన్షిప్లో ఉన్నారా.. మీపై ఉన్నది ప్రేమా లేక వ్యామోహమా.. ఎలా తెలుసుకోవాలంటే.! -
టేస్టీ మంచూరియానే కాదు, కరకరలాడే అప్పాలు సైతం రెడీ.. క్యాబేజ్‌తో ఇలా ఈజీగా చేసేయండి.! -
ఈ సారి రెండు తేదీల్లో వరలక్ష్మీ వ్రతం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వ్రత ప్రాముఖ్యత.! -
ప్రెగ్నెన్సీలో వీటి లోపంతోనే విపరీతమైన క్రేవింగ్స్.. వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే.! -
కుబేర మొక్క.. మనీ ప్లాంట్ అనుకుంటే పొరపాటే.. ఇది మీ ఇంట్లో ఉంటే కనకవర్షమే.! -
పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా.. పొరలు పొరలుగా వచ్చే బెల్లం ఖాజా మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
కరకరలాడే చికెన్ ముక్కలు, ఘాటైన మసాలా.. చెట్టినాడ్ చికెన్ పాప్‌కార్న్‌తో ఈవెనింగ్ సూపర్! -
పోషకాల గని ఈ బీట్ రూట్ ఉప్మా..మజ్జిగతో కలిపి ఇలా చేస్తే టేస్ట్ కేక! -
చుండ్రు వల్ల జుట్టు రాలిపోతోందా? అయితే మీరు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు
International Tea Day: అలసిన శరీరానికి కప్పు ‘టీ’తో ఎనలేని ఉత్సాహం.. ‘చాయ్’ స్పెషల్ స్టోరీ.!
International Tea Day: ఒక కప్ 'టీ’.. మనిషి జీవితంలో విడదీయలేని బంధం. ప్రతి రోజూ ఉదయం టీ రుచి ఆస్వాదించనిదే డే స్టార్ట్ కాదు. ఇంటికి చుట్టాలొచ్చినా, ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్లినా, స్టార్ హోటల్స్ మీటింగ్స్ అయినా, రాజకీయ భేటీలున్నా.. చర్చలు 'తేనీటి’తోనే ఆరంభమవుతాయి. అలసటను, ఒత్తిడిని దూరం చేసే టీ అంటే దూరం పెట్టని వారుండరు. అంత విలువైనది కాబట్టే.. ఐక్యరాజ్యసమితి 'టీ’కి ఒక ప్రత్యేక రోజును గుర్తించింది.

ప్రతి సంవత్సవం మే 21 అంతర్జాతీయ టీ దినోత్సవం’గా ఐక్యరాజ్యసమితి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ పరిగణించింది. ప్రపంచవ్యాప్తంగా టీ ఉత్పత్తి, వినియోగంపై అవగాహన పెంచడం, ఈ పరిశ్రమపై ఆధారపడిన కార్మికుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు 2019లో సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
FAO చొరవతో
ఆరంభంలో తేయాకు ఉత్పత్తి అధికంగా ఉండే భారత్, శ్రీలంక, ఇండోనేషియా, నేపాల్, వియత్నాం, బంగ్లాదేశ్, కెన్యా, మలావి, మలేషియా, ఉగాండా, టాంజానియా వంటి దేశాలు డిసెంబర్ 15న టీ దినోత్సవంగా నిర్వహించేవి. అయితే 2015లో, భారత ప్రభుత్వం FAO ఇంటర్ గవర్నమెంటల్ గ్రూప్ ఆన్ టీ (IGG ఆన్ టీ) ద్వారా అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని పాటించడాన్ని విస్తరించాలని ప్రతిపాదన తీసుకువచ్చింది. ప్రపంచ టీ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చే ఆలోచనలో భాగంగా అదే ఏడాది.. ఇటలీలోని మిలన్‌లో జరిగిన ఒక సమావేశంలో తమ ఆలోచనను FAO పంచుకుంది.
దీంతో టీ దినోత్సవాన్ని అంతర్జాతీయంగా నిర్వహించాలనే ప్రతిపాదనను డిసెంబర్ 2019లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. అలా 2020 నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 21న అంతర్జాతీయ టీ దినోత్సవంగా జరుపుకొంటున్నాం. FAO నేతృత్వంలో అవగాహన ప్రచారాలు, వర్క్‌షాప్‌లు, చర్చలు, సోషల్ మీడియా ప్రచారాలతో టీ ప్రాముఖ్యతను తెలియజేస్తారు.
2026 అంతర్జాతీయ టీ దినోత్సవం థీమ్ ఇదే..
భారతదేశపు రోజువారీ చాయ్ నుంచి ప్రపంచవ్యాప్త టీ సంప్రదాయాల వరకు.. వివిధ దేశాలలో 'టీ’ సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక ప్రాముఖ్యతను గుర్తించడమే ఈ ఏడాది థీమ్. ప్రపంచవ్యాప్తంగా తేయాకు రైతులకు జీవనోపాధిని మెరుగుపరచడంపై దృష్టి సారించడం, వారికి న్యాయమైన ఆదాయం, అవకాశాలను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది.

'టీ’ తయారీలో యువత
యువతను టీ రంగంలో చేరడానికి ప్రోత్సహించడంతో పాటు, ఆవిష్కరణ, ఆధునిక పద్ధతులను తీసుకురావడం, పర్యావరణ అనుకూల వ్యవసాయంతో పాటు దీర్ఘకాలికంగా టీ ఉత్పత్తిని నిర్ధారించేందుకు చర్యలు చేపట్టనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ పరిశ్రమను బలోపేతం చేసేందుకు ముఖ్యంగా గ్రామీణ, ఆర్థిక వ్యవస్థలకు మద్దతు ఇవ్వనుంది. టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదని.. వ్యాపార, వాణిజ్య రంగంలో దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పడమే 'అంతర్జాతీయ టీ దినోత్సవం’ ఉద్దేశం.
అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా కొందరు తమ సంతోషాలను వివిధ రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఇష్టమైన టీని తయారుచేసుకోవడం, టీ రుచి చూసే సెషన్‌లను నిర్వహించడం, టీ పార్టీలు, ఆన్‌లైన్‌లో టీ క్షణాలను షేర్ చేసుకోవడం, చాయ్ చరిత్ర గురించి తెలుసుకోవడం వంటివి నిర్వహిస్తుంటారు.
అయితే 'టీ’లలో చాలా రకాలుంటాయి. పాలు, టీ పౌడర్, పంచదార కలయికను సాంప్రదాయబద్ధమైన తేనీటిగా పరిగణిస్తాం. ఇప్పుడు హెర్బల్ టీలు మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. కొందరి ఆరోగ్యం, డైట్, అభిరుచుల కారణంగా వారికి నచ్చిన దానిని దినచర్యలో భాగంగా ఉంటుంది. మరికెందుకు ఆలస్యం ఈ ఏడాది 'అంతర్జాతీయ టీ దినోత్సవా’న్ని మీదైన శైలిలో సెలబ్రేట్ చేసుకుంటూ ఆనందపు ప్రతి 'టీ’ చుక్కను ఆస్వాదించండి.



Click it and Unblock the Notifications