Latest Updates
-
నోరూరించే గోంగూర బోటీ.. ఇలా వండితే రుచి అదుర్స్! -
హనుమాన్ చాలీసా ఎలా చదవాలి? మీ కోరికలు తీరాలంటే ఈ 4 నియమాలు పాటించాల్సిందే! -
హనుమాన్ జయంతి స్పెషల్..స్వామికి ఇష్టమైన తీపి బూందీ ఇంట్లోనే ఇలా సులభంగా చేయండి! -
మధుమేహానికి బ్రహ్మాస్త్రం, వడదెబ్బకు చెక్..వేసవిలో కాకరకాయ చేసే అద్భుతాలు ఇవే.. -
ఏప్రిల్ 2026 రాశి ఫలాలు..ఈ రాశుల వారి జీవితాల్లో గోల్డెన్ టైమ్ స్టార్ట్! -
ప్రోటీన్ పవర్ హౌస్..జస్ట్ 2 నిమిషాల్లో బీహారీ స్టైల్ చనా చాట్..బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్! -
కన్య, వృషభం, మకర రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - బుధవారం, 01 ఏప్రిల్ 2026 -
నూనె చుక్క లేకుండా ఘుమఘుమలాడే వెజ్ పులావ్..టేస్ట్ సూపరో సూపర్..బరువు తగ్గాలనుకునేవాళ్లకి పర్ఫెక్ట్! -
మంగళవారం నాడు ఈ రాశుల వారికి అద్భుతమైన విజయాలు! -
రెస్టారెంట్ రుచిని తలపించే లెమన్ చికెన్ టిక్కా.. ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా!
జై భజరంగ్ బలి..మీ బంధుమిత్రులకు హనుమాన్ జయంతి విషెస్ ఇలా అందంగా చెప్పండి!
హిందూ సాంప్రదాయంలో హనుమాన్ జయంతి అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన పండుగ. శ్రీరామ భక్తుడైన ఆంజనేయ స్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. అంజనా దేవి, కేసరిల తపస్సుకు మెచ్చి, వాయుదేవుని అనుగ్రహంతో పరమశివుడే 11వ రుద్రావతారంగా హనుమంతుని రూపంలో జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి.
హనుమంతుడిని స్మరిస్తే భయాలు, కష్టాలు, రోగాలు దరిచేరవని భక్తుల నమ్మకం. అందుకే ఆయనను సంకటమోచనుడుఅని పిలుస్తారు. శని దేవుడు కూడా హనుమంతుని భక్తులను ఏమీ చేయనని మాట ఇచ్చాడని పురాణ కథ. కాబట్టి హనుమాన్ జయంతి రోజున స్వామిని పూజిస్తే ఏల్నాటి శని, అష్టమ శని దోషాలు తొలిగిపోతాయని నమ్మకం.

భక్తి, శ్రద్ధ, విధేయత అనగానే మనకు మొదట గుర్తుకొచ్చేది హనుమంతుడే. గురువారం(ఏప్రిల్ 2,2026) దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి జరుపుకుంటున్న సందర్భంగా మీ బంధుమిత్రులకు హనుమాన్ జయంతి శుభాకాంక్ష్లలను తెలుగులో ఎలా అందంగా చెప్పాలో ఇక్కడ చూడండి.
వాట్సాప్, సోషల్ మీడియా స్టేటస్ లు
-జై శ్రీరామ్. మీకు, మీ కుటుంబ సభ్యులకు 2026 హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
-ధైర్యం, బలం, భక్తి.. ఆంజనేయుడికి మారుపేరు. జై బజరంగ్ బలి.
-శ్రీరామ భక్తుడిగా పుట్టడం నా అదృష్టం. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
-ఆంజనేయ స్వామియే నా బలం, నా ధైర్యం. జై శ్రీరామ్.
-హనుమాన్ చాలీసా పఠిద్దాం, ప్రశాంతతను పొందుదాం. జై ఆంజనేయ.
-ఆ సంకటమోచనుడు మీ కష్టాలన్నీ తీర్చాలని ప్రార్థిస్తూ... హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
-జై శ్రీరామ్ అని స్మరిస్తే చాలు, మారుతి పరుగెత్తుకొస్తాడు. శుభమస్తు.
-ఆంజనేయుడి కృప ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
-మన పురాణాల్లోని అసలైన సూపర్ హీరో శ్రీ ఆంజనేయ స్వామికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు.
-నా గుండెల్లో సీతారాములు, నా ధైర్యంలో ఆంజనేయుడు. అందరికీ 2026 హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
స్ఫూర్తిదాయకమైన కోట్స్
-భక్తికి బలం తోడైతే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన వాడు హనుమంతుడు. ఆయన స్ఫూర్తితో ముందుకెళ్దాం.
-ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే గుణానికి ఆంజనేయుడే నిదర్శనం. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
-లక్ష్యం పట్ల ఏకాగ్రత, గురువు పట్ల విధేయత..ఇవే హనుమంతుని నుండి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠాలు.
-భయం అనేది నీ దరిదాపుల్లోకి రాకూడదంటే, అనునిత్యం ఓం ఆంజనేయాయ నమః అని జపించు.
-కష్టాలు వస్తే భయపడకు, ఆ కష్టాలను తీర్చే 'సంకట మోచనుడు' ఉన్నాడని నమ్ము. జై హనుమాన్.
-బ్రహ్మచర్యం, క్రమశిక్షణతో కొండంత బలాన్ని సొంతం చేసుకున్న మహా వీరుడు హనుమంతుడు. ఆయన మార్గమే మనకు ఆదర్శం.
-సముద్రాన్ని లంఘించిన హనుమంతుని స్ఫూర్తితో, మీరు కూడా జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలి.
-అంకితభావం అంటే హనుమంతుడు.. ఆదర్శం అంటే రాముడు. వీరిద్దరి కృప మీకు ఎల్లప్పుడూ ఉండాలి.
-అవసరమైతే సంజీవని పర్వతాన్నే ఎత్తినవాడు.. నీ కష్టాలను ఎత్తలేడా? ధైర్యంగా అడుగు ముందుకు వేయి.
-ఓటమి ఎరుగని వీరుడు మన హనుమంతుడు. ఆయన స్ఫూర్తితో ప్రతి అడుగులో విజయం సాధించండి.

భక్తిపూర్వక మెసేజ్ లు
-మనోజవం మారుత తుల్యవేగం.. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలి.
-యత్ర యత్ర రఘునాధ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం..రాముడు ఉన్న చోట హనుమ ఉంటాడు. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
-తమలపాకుల ఆకుపూజ, సింధూర సమర్పణతో ఆ స్వామిని కొలుద్దాం. అఖండ విజయాలను పొందుదాం.
-ఈ పవిత్రమైన రోజున సుందరకాండ పారాయణం చేద్దాం, స్వామి కృపకు పాత్రులవుదాం.
-వాయుపుత్రుడు, అంజనీసుతుడు అయిన ఆ మారుతికి నమస్కారాలు. మీకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
-గుండె చీల్చి అందులో సీతారాములను చూపించిన పరమ భక్తుడు ఆంజనేయుడు. అలాంటి స్వచ్ఛమైన భక్తి మనందరికీ కలగాలి.
-ప్రతి ఉదయం హనుమాన్ చాలీసా పఠించండి, మీ రోజంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. జై శ్రీరామ్.
-మంగళకరుడు, శని దోష నివారకుడు అయిన శ్రీ హనుమంతుని జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.
-ఎరుపు రంగు సింధూరం ధరించిన ఆ బజరంగ్ బలి మీ కష్టాల చీకట్లను పారద్రోలాలి.
-ఈ పవిత్ర దినాన ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి ఆయన దర్శనం చేసుకోండి, మీ పాపాలు తొలగిపోతాయి. జై ఆంజనేయ.

హృదయపూర్వక శుభాకాంక్షలు
-వాయుదేవుని పుత్రుడైన ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం వెల్లివిరియాలని కోరుకుంటూ.. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
-కష్టకాలంలో కొండంత అండగా నిలిచే ఆపద్బాంధవుడు ఆ హనుమంతుడు. ఆయన చల్లని చూపు మీపై ఎల్లప్పుడూ ఉండాలి.
-బుద్ధి, బలం, యశో, ధైర్యం...ఈ హనుమాన్ జయంతి రోజున ఆ స్వామి మీకు ఇవన్నీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
-నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపం హనుమంతుడు. ఆయన దయతో మీ ఇంట సిరుల పంటలు పండాలి. శుభాకాంక్షలు.
-లంకను దహించినట్లుగానే, ఆ ఆంజనేయుడు మీలోని ప్రతికూల ఆలోచనలను దహించివేయాలి. జై శ్రీరామ్.
-ఈ 2026 హనుమాన్ జయంతి మీ జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నాను.
-రామ భక్త హనుమాన్ మీ ఇంటిని, మనసును ప్రశాంతతతో నింపాలని కోరుకుంటున్నాను.
-మీ వృత్తి, వ్యాపారాల్లో ఎదురయ్యే ఆటంకాలను ఆ ఆంజనేయుడు తొలగించాలని కోరుకుంటూ..శుభాకాంక్షలు.
-సంజీవనితో ప్రాణాలు నిలిపిన స్వామి, మీ ఆరోగ్యపరమైన సమస్యలన్నింటినీ దూరం చేసి దీర్ఘాయుష్షును ప్రసాదించాలి.
-ఈ 2026వ సంవత్సరం ఆంజనేయుని కృపతో మీ కలలన్నీ నెరవేరే సువర్ణ సంవత్సరంగా మారాలి.
ఫ్యామిలీ,ఫ్రెండ్స్ కోసం
-ఈ 2026 హనుమాన్ జయంతి మీ ఇంట్లో సిరిసంపదలు, సుఖసంతోషాలు నింపాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
-మిత్రమా ఆ మారుతి బలం, ధైర్యం నీకు ఎప్పుడూ తోడుగా ఉండాలి. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
-రామలక్ష్మణులకు అండగా నిలిచిన హనుమంతునిలా, మన స్నేహం మరియు బంధం కలకాలం నిలవాలి. జై భజరంగ్ బలి.
-శ్రీరామ నామం ఉన్నచోట, హనుమంతుడు ఉంటాడు. హనుమంతుడు ఉన్నచోట మీ కుటుంబానికి రక్ష ఉంటుంది.
-మీ ఇల్లు ఎల్లప్పుడూ రామ నామ స్మరణతో, ఆంజనేయుని కరుణతో విలసిల్లాలి. హ్యాపీ హనుమాన్ జయంతి 2026.



Click it and Unblock the Notifications











