Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
హనుమాన్ జయంతి స్పెషల్..స్వామికి ఇష్టమైన తీపి బూందీ ఇంట్లోనే ఇలా సులభంగా చేయండి!
చైత్ర మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన పండుగ హనుమాన్ జయంతి ఈ ఏడాది ఏప్రిల్ 2 న జరుపుకుంటారు. హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ఎన్నో పూజలు చేస్తుంటారు. అయితే బజరంగబలికి అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యం తీపి బూందీ అని మీకు తెలుసా?
మంగళవారం లేదా శనివారం నాడు స్వామివారికి బూందీని నైవేద్యంగా సమర్పిస్తే జీవితంలోని సకల దోషాలు, కష్టాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 2026 హనుమాన్ జయంతికి మీ చేతులతో మీరే స్వయంగా, ఎంతో స్వచ్ఛంగా, రసవంతమైన బూందీని ఇంట్లోనే తయారు చేసి స్వామికి నైవేద్యంగా సమర్పించండి. కేవలం 15 నుండి 20 నిమిషాల్లో తీపి బూందీని ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తీపి బూందీ తయారీకి కావలసిన పదార్థాలు
శనగపిండి: 1 కప్పు
బేకింగ్ సోడా: పావు టీస్పూన్
ఫుడ్ కలర్ (కుంకుమపువ్వు రంగు): పావు టీస్పూన్
నెయ్యి: వేయించడానికి తగినంత
నీళ్లు: తగినన్ని
చక్కెర: ఒకటిన్నర కప్పులు
యాలకులు: 2

తీపి బూందీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి బాండీలో ఒకటిన్నర కప్పుల పంచదార, ఒకటింపావు కప్పుల నీళ్లు పోయాలి. మంచి సువాసన కోసం దంచిన యాలకులు వేయాలి. పంచదార కరిగేలా గరిటెతో తిప్పుతూ ఉండాలి. పంచదార కరిగాక, పాకం చేతికి కొద్దిగా జిగురుగా (తేనెలా) తగిలే వరకు సుమారు 5 నిమిషాల పాటు మరిగించాలి. చివరగా కొద్దిగా ఫుడ్ కలర్ వేసి కలిపి, స్టవ్ ఆపేయాలి. పాకం చల్లారిపోకుండా వెచ్చగా ఉండేలా చూసుకోవాలి.
-ఒక వెడల్పాటి గిన్నెలో జల్లించిన శనగపిండి, కుంకుమపువ్వు రంగు వేయాలి. ఉండలు కట్టకుండా కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తని పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో బేకింగ్ సోడా వేసి, ఐదు నిమిషాల పాటు బాగా గిలకొట్టాలి. గరిటెతో పైకి ఎత్తి పోస్తే పిండి ఒకే ధారగా కిందకు పడేలా ఉండాలి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ప్రసాదం కోసం నెయ్యిని వేడి చేయాలి. నెయ్యి బాగా కాగాక చిల్లుల గరిటెను బాండీకి కొద్దిగా పైన పట్టుకోవాలి. కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఆ గరిటెపై పోయాలి. పిండి వాటంతట అవే చిన్న చిన్న బిందువుల్లా నెయ్యిలో పడి గుండ్రటి బూందీలా మారతాయి. ఇవి లేత బంగారు రంగులోకి వచ్చి, కరకరలాడే వరకు మీడియం మంటపై వేయించాలి.
-నెయ్యిలో వేయించిన కరకరలాడే బూందీని తీసి, నేరుగా గోరువెచ్చగా ఉన్న చక్కెర పాకంలో వేయాలి. బూందీ అంతా పాకంలో మునిగేలా బాగా కలిపి, కనీసం ఒక గంట పాటు మూతపెట్టి పక్కన పెట్టాలి. ఇలా చేయడం వల్ల బూందీ పాకాన్ని లోపలి వరకు పీల్చుకుని, ఎంతో మృదువుగా, రసవంతంగా మారుతుంది.
-ఒక గంట తర్వాత, అదనంగా ఉన్న పాకాన్ని జల్లెడ ద్వారా వడకట్టండి. అంతే నోరూరించే, స్వచ్ఛమైన హనుమాన్ జయంతి ప్రత్యేక తీపి బూందీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
