లాక్మే ఫ్యాషన్ వీక్ లో అంజు మోడి -బ్యూటిఫుల్ కలెక్షన్స్

లాక్మే ఫ్యాషన్ వీక్ రోజు రోజుకీ ఉత్కంఠభరితంగా జరుగుతోంది. మొదటి రోజుకంటే రెండవ రోజు మరింత గ్రాండ్ గా ప్రారంభం అయింది. లైట్స్ డిమ్ గా మారాయి, మోడల్స్ ఒకరి తర్వాత ఒకరు క్యాట్ వాక్ చేస్తూ ర్యాంప్ మీద తళుక్కుమని కనబడగానే అద్భుతంగా అనిపించింది. లాక్మే ఫ్యాషన్ వీక్ డే 2న సెలబ్రెటీలు ప్రదర్శించిన కలెక్షన్స్ ఒక్కటి కూడా మిస్ కాకుండా చూసే విధంగా కనులకు కనువిందు చేశాయి. లాక్మేఫ్యాషన్ వీక్ డే 2 ప్రముఖ డిజైనర్ కలెక్షన్స్ చూడటానికి చాలా మంది చాలా ఎక్సైటెడ్ గా మరియు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు.

ఆ సమయం రావనే వచ్చింది. ప్రిస్టేజియస్ ఈవెంట్ లాక్మే ఫ్యాషన్ వీక్ 2014, సంవత్సరం మొత్తం మీద మనం ఎంతో ఆత్రుతగా ఎదురు చూసే కార్యక్రమం ఇది, ఈ ఈవెంట్ లో కొన్ని మిలియన్స్ లో కొత్త కలెక్షన్స్ తో మనల్ని అట్రాక్ట్ చేస్తుంటాయి. అనేక మంది ప్రము డిజైనర్లలో అంజుమోడి కూడా ఒక స్టార్ డిజైనర్, అంజు మోడి యొక్క మనికర్నిక కలెక్షన్స్ చాలా అద్భుతంగా గడిచిన శతాబ్దాలను గుర్తు చేసే విధంగా ఉన్నాయి. ఆమె కలెక్షన్స్ తో, జాక్వెలైన్ షో స్టాపర్ గా నిలిచి కళ్ళకు మరో పండుగ వాతవరణంను కల్పించారు.

ప్రముఖ డిజైనర్ అంజుమోడి డిజైన్ లో వివిధ రకాల కాంబినేషన్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మరియు స్ట్రక్చర్ తో చాలా అద్భుతంగా డిజౌన్ చేయబడినాయి. తన కలెక్షన్స్ తో ర్యాంప్ వాక్ చేసిన మోడల్స్ ర్యాంప్ మీద మరింత ప్రకాశవంతంగా కనిపించారు. ప్రతి ఒక్క మోడల్ యొక్క అవుట్ పిట్ చాలా అద్భుతంగా కొత్తరంగా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఒక్కో అవుట్ ఫిట్ కు ఒక్కో ప్రత్యేకత ఉంది. మరి ఆ ప్రత్యేకతలేంటో ఈ క్రింది స్లైడ్ ద్వారా చూడండి..

వెల్వెట్ షర్ట్ అండ్ దోతి స్టైల్:

వెల్వెట్ షర్ట్ అండ్ దోతి స్టైల్:

పెళ్ళిళ్లు మరియు ఇతర శుభకార్యాలకు వేసుకొనే విధంగా ఒక స్పెషల్ షర్ట్ అండ్ దోతి చాలా బ్యూటిఫుల్ గా ఉంది.

బ్యూటిఫుల్ ఐవరీ ఎంబ్రాయిడరీ:

బ్యూటిఫుల్ ఐవరీ ఎంబ్రాయిడరీ:

చాలా అందంగా డిజైన్ చేసిన ఐవరీ ఎంబ్రాయిడరీతో లెహంగా మొత్తం చాలా అద్భుతంగా డిజైన్ చేయడం మంచి కళగా ఉంది.

ఆక్సీ బ్లడ్ కలర్స్:

ఆక్సీ బ్లడ్ కలర్స్:

లాక్మే ష్యాషన్ వీక్ డే2 ర్యాంప్ వాక్ లో వివిధ రకాల రెడ్ కలర్ మోడల్ అవుట్ ఫిట్స్ ను గమనించవచ్చు. జర్దోసి డిజైన్స్ తో మోడల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది.

పురుషుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లూ షేడ్స్:

పురుషుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లూ షేడ్స్:

లాక్మే ఫ్యాషన్ వీక్ ర్యాంప్ వాక్ లో పురుషులకోసం ప్రత్యేకంగా బ్లూకలర్ షేడ్స్ తో ఫర్ ఫెక్ట్ కాంబినేషన్ తో, హై కాలర్ నెక్ తో ఫ్యాసినేటింగ్ గా ఉంది.

బికిని క్లాడ్ అవుట్ ఫిట్:

బికిని క్లాడ్ అవుట్ ఫిట్:

ర్యాంప్ మీద ఈ బికిని క్లాడ్ అవుట్ ఫిట్ లో మోడల్ ను చూడగానే థ్రిల్లింగ్ గా అనిపించింది. డిజైనర్ అంజుమోడి డీప్ ప్లగ్గింగ్ నెక్ లైన్, గ్రే చోలీ, ఆరెంజ్ ఫ్లవర్డ్ డబుల్ లేయర్ లెహంగా చూడటానికి చాలా విలువైనదిగా కనిపించింది.

మెహింది ప్రింట్స్:

మెహింది ప్రింట్స్:

కొన్ని అద్భుతమైన డిజైన్లలో ఇది ఒక డిజన్ . ర్యాంప్ వాక్ లో మోడల్ ధరించిన మెహిందీ కలర్డ్ డిజైన్స్ చాలా బ్యూటిఫుల్ గా ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది.

షీర్ శారీ:

షీర్ శారీ:

షీర్ శారీలో లేకుండా ఫ్యాషన్ లేదు. ఈ దానిమ్మపండు కలర్ షీర్ శారీ మ్యాచింగ్ బ్లాక్ లాంగ్ స్లీవ్ చోలీ ర్యాంప్ మీద చాలా గ్రేట్ గా అనిపించింది.

పురుషుల కోసం ప్రత్యేకంగా స్టైలిష్ గా:

పురుషుల కోసం ప్రత్యేకంగా స్టైలిష్ గా:

లాక్మే ఫ్యాషన్ వీక్ లో పురుషులు కూడా ఇంప్రెస్ చేసే విధంగా ఫ్యాషనబుల్ డ్రెస్సులను ధరించారు . గోల్డెన్ క్రీమ్ దోతి గోల్డ్ బార్డర్ ఒక మంచి ఎంపిక. బంద్ గాలా హైకాలర్ గ్రే సూట్ బ్యూటిఫుల్ గా ఉంది.

ఎంబ్రాయిడరీ:

ఎంబ్రాయిడరీ:

అంజుమోడి డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ లో మనికర్ణిక ఎబ్రాయిడరీ వర్క్ చాలా అద్భుతంగా ఉండి . బ్లా వైట్ లెహంగా మీద బారీ ఎంబ్రాయిడరీ వర్క్ ఆకట్టుకొనే విధంగా ఉంది.

రెడ్ గోల్డ్ బ్రైడల్ అవుట్ ఫిట్:

రెడ్ గోల్డ్ బ్రైడల్ అవుట్ ఫిట్:

ఒక స్పెషల్ డే కొరకు ఇటువంటి రెడ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అవుట్ ఫిట్స్ ను ఎంపిక చేసుకోవచ్చు. కుర్తా మీద గోల్డ్ వర్క్ చాలా ఎక్కువగా మరియు స్టన్నింగ్ గా ఉంది.

Story first published: Thursday, August 21, 2014, 13:43 [IST]
Desktop Bottom Promotion