Latest Updates
-
కొవిడ్ ఇచ్చిన కిక్.. డిగ్రీ పట్టా లేదు, వ్యాపారం కాదు.. కానీ 20 ఏళ్లకే నెలకు రూ. లక్షల్లో ఆదాయం.! -
పచ్చిమిర్చి ఊరగాయ ఇలా చేస్తే..ఒక్క ముద్ద తినేవాళ్లు నాలుగు ముద్దలు లాగించేస్తారు! -
కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా.? -
చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి! -
డా. మంతెన ఆరోగ్య చిట్కాలు.. అన్ని విటమిన్లనూ ఒకే కప్పులో అందించే ప్రకృతి రహస్యం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలితే ఇలా ఊతప్పం చేయండి.. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుని తింటారు! -
చీర ఎత్తితే చీరేస్తారు: పంక్షన్లలోనే కాదు.. రైళ్లలోనూ హిజ్రాల బీభత్సం! -
ఉదయాన్నే ఒక కప్పు చాలు.. ఒంటి నొప్పులను తగ్గించి, పుష్టిగా బలాన్ని ఇచ్చే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.! -
బెంగాలీ స్పెషల్ రాధాభల్లవి పూరీ..ప్లేట్ లోనే స్వర్గం కనిపించేస్తది! -
మరో పది రోజుల్లో మంగళ గోచారం.. వీరికి దీనికి మించిన మంచి సమయం ఉండదు.!
మీకు తెలియకుండా తప్పుగా పలికే ఇంగ్లీష్ పదాలు
ఇంగ్లీషు పదాలని ఒకొక్కరు ఒక్కోలాగ పలుకుతారు. ఒక ప్రాంతానికీ మరొక ప్రాంతానికీ కూడా ఉఛ్ఛారణ మారుతూ ఉంటుంది. ఒక పదాన్ని పలికేటప్పుడు నాలుకని తిప్పడం, మడతెయ్యడం వల్లే పలికే ప్రతీ మాట యొక్క శబ్దం బయటకి వస్తుంది. కానీ ఒక్కో పదాన్నీ పలికేటప్పుడు ఆ పదాన్ని ఎలా పలకాలో నియమాలుంటాయి.
ఇంగ్లీష్ లో ఇండియన్ ఇంగ్లీషు, యూకే ఇంగ్లీషు, యూఎస్ ఇంగ్లీషు వంటి రకాలు ఉండటం వల్ల ఎక్కువగా ఇంగ్లీషు పదాలనే తప్పుగా పలుకుతుంటారు. మీకు తెలియకుండానే కొన్ని పదాలని మీరు తప్పుగా పలుకుతుండవచ్చు. ఒక్కోసారి మీరు తప్పుగా పలికారు అని చెప్పి మిమ్మల్ని సరిదిద్దేవారు కూడా ఆ పదాన్ని తప్పుగా పలికే అవకాశం ఉంది.
మీ పేరులో ఏ అక్షరం ఎక్కువసార్లు ఉంటే అదృష్టం ?
మనమందరం కొన్ని పదాలని తప్పుగా ఉఛ్ఛరిస్తున్నాము అని తెలిస్తే నవ్వొస్తుంది కదా. ఈ రోజు ఈ ఆర్టికిల్‌ల్లో సాధారణం గా తప్పుగా ఉఛ్ఛరించే కొన్ని ఆంగ్ల పదాలు, వాటి సరి అయిన ఉఛ్ఛారణ ఎలా ఉంటుందో చూద్దాం.
కొన్ని పదాలని మీరు ఇప్పటివరకూ తప్పుగానే ఉఛ్ఛరిస్తూ వచ్చారు అని తెలిస్తే మీకు ఆశ్చర్యం కలుగకమానదు. మీ ఉఛ్ఛారణని సరి దిద్దుకోవాల్సిన సమయం ఆసన్నమైంది కదా. ఇక ఈ ఆర్టికిల్ చదివి సాధారణంగా మనమందరమూ తప్పుగా ఉఛ్ఛరించే ఇంగ్లీష్ పదాలేంటో, వాటిని అసలు ఎలా పలకాలో నేర్చుకుందాము.

బ్రేక్‌ఫాస్ట్:
సాధారణంగా ఈ పదాన్ని చాలా మంది తప్పుగా ఉఛ్ఛరిస్తుంటారు."బ్రేక్ ఫాస్ట్" అని కాకుండా "బ్రెక్ ఫస్ట్" అని ఉచ్ఛరించాలి.

ఎనీవే:
చాలామంది ఈ పదానికి చివర ఎస్ ని తగిలిస్తారు. కానీ దీని సరి అయిన ఉఛ్ఛారణ "ఎనీ వే" మాత్రమే.

యాక్సెసరీ:
దీనిని "యాసెసరీ" అని కాకుండా "యాక్సెసరీ" అని పలకాలి.

మిస్‌ఛీవస్:
దీనిని "మిస్ ఛీ వీ యస్" అని కాకుండా "మిస్ ఛివ్ అస్" అని పలకాలి.

ఎస్ప్రెస్సో:
దీనిని "ఎక్స్ప్రెస్సో" అని కాకుండా "ఎస్ప్రెస్సో" అని పలకాలి.

క్లోత్స్:
"క్లోజ్" అని కాకుండా ఈ పదాన్ని "క్లోత్జ్" అని ఉఛ్ఛరించాలి.

ఫిబ్రవరి:
దీనిని "ఫెబ్యూఅరీ" అని కాకుండా "ఫెబ్ రూ అ రీ" అని పలకాలి.

డిజర్ట్:
దీనిని "డిజర్ట్" అని పలకాలి."డెజర్ట్" అని ఎడారిని సూచించే పదాన్నే(Desert) పలుకుతారు.

పిజ్జా:
దీని సరి అయిన ఉఛ్ఛారణ "పిట్జా" కానీ "పిజ్జా" కాదు.

పోం(Poem):
దీనిని "పోయం" అని కాకుండా "పోం" అని ఉఛ్ఛరించాలి.

బోల్:
దీనిని "బౌల్" అని కాకుండా "బోల్" అని ఉఛ్ఛరించాలి.



Click it and Unblock the Notifications
