Latest Updates
-
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం -
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు!
సినిమాల్లోకి రాక ముందు సెలబ్రెటీలు ఏం చేసేవారు...?
ప్రతి వ్యక్తి జీవితంలోనూ బయటి ప్రపంచానికి తెలియని కొన్ని నిజాలు, ఆసక్తికర విషయాలు ఉంటాయి. సినీ తారల జీవితాల్లో కూడా ఇలాంటి ఆసక్తికరమైనవి ఉండటం సహజమే. మరి మనం పలువురు బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్ల గురించి ఆసక్తికర అలవాట్లు...విషయాలు తెలుసుకుందామా...


ఐశ్వర్యరాయ్
విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ సినిమాల్లో ఫేమస్ కాకముందు ఓ టీవీ సీరియల్‌లో డబ్బింగ్ జాబ్ కోసం వెళ్లిందట. అయితే ఆమెను రిజెక్ట్ చేసారట నిర్వాహకులు. మరి ఇప్పుడు ఐశ్వర్యరాయ్ పొజిషన్ ఏమిటో కొత్తగా చెప్పక్కర్లేదు.

అమితాబ్ బచ్చన్ :
బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ సినిమాల్లోకి రాకముందు కోల్‌కతాలో షిప్పింగ్ కంపెనీలో పని చేసేవారు. అప్పుడు సెకండ్ హ్యాండ్ ఫియట్ కారును తొలిసారిగా కొనుగోలు చేసారట అమితాబ్.

శిల్పా శెట్టి:
హీరోయిన్ శిల్పాశెట్టికి కారు నడపాలంటే మహా భయం. అందుకే ఆమె ఎక్కడికి వెళ్లినా డ్రైవర్‌ను తీసుకుని వెళుతుందట. అసలు ఆమెకు ఇప్పటి వరకు కారు ఎలా నడపాలో తెలియదట.

షారుక్ ఖాన్ :
షారుక్ ఖాన్ తొలి సంపాదన ఎంతో తెలుసా? కేవలం రూ. 50 మాత్రమే. ఢిల్లీలో జరిగిన పంకజ్ ఉదాస్ కచేరికి గేట్ కీపర్‌గా ఉన్నందుకు ఆయనకు ఈ మొత్తం ఇచ్చారట. ఆ డబ్బుతో షారుక్ ట్రైన్‌లో ఆగ్రా వెళ్లి తాజ్‌మహల్ చూసొచ్చాడట.

ప్రీతి జింతా
బాలీవుడ్ నటి ప్రీతి జింతాకు కేవలం నటన మాత్రమే వచ్చనుకుంటే పొరపాటే. బిబిసి న్యూస్ ఆన్ లైన్ సౌత్ ఏసియాకు ఆమె వరుస కాలమ్స్ కూడా రాసేదట.

అక్షయ్ కుమార్ :
అక్షయ్ కుమార్ పేరు ఫిల్మ్ ఫేర్ అవార్డులకు ఏడు సార్లు నామినేట్ అయింది. అయితే ఆయనకు రెండు సార్లు మాత్రమే అవార్డు దక్కాయి. గరమ్ మసాలా చిత్రానికి బెస్ట్ యాక్టర్ ఇన్ కామిక్ విభాగంలో, అజ్‌నభీ చిత్రంలో నెగెటివ్ రోల్ చిత్రానికి అవార్డు దక్కింది.

కరీనాకపూర్ :
కరీనా కపూర్ తల్లి ఆమె గర్భంలో ఉన్నప్పుడు అన్నా కరెనినా అనే పుస్తకం చదవిందట. ఆ పుస్తకం నుండే ఆమెకు కరీనా అనే పేరును సెలెక్ట్ చేసారట. కానీ ఆమె ఫ్యామిలీ, క్లోజ్ ఫ్రెండ్స్ ఆమెను బెబో అని పిలుస్తారు.

సైఫ్ అలీఖాన్ :
ఓంకారా చిత్రంలో ఓ షాడో సీన్ చిత్రీకరించేటపుడు ఆ చిత్ర దర్శకుడు విశాల్ భరద్వాజ్... సైఫ్ అలీ ఖాన్‌ను చూసి `నువ్వు నగ్నంగా ఉంటే కళాత్మకంగా, బ్యూటిఫుల్‌గా ఉంటావని సూచించాడట.

కత్రినా కైఫ్:
తన సినిమాల విడుదలకు ముందు కత్రినా కైఫ్ సిద్ధి వినాయక టెంపుల్, మౌండ్ మేరీ చర్చ్, అజ్మీర్ షరీఫ్ దర్గాను తప్పకుండా దర్శించి ప్రార్థిస్తుందట.

హృతిక్ రోషన్ :
హృతిక్ రోషన్‌కు చిన్నతనంలో సరిగా మాట్లాడటం వచ్చేది కాదట. నత్తి నత్తిగా మాట్లాడేవాడట. ఆ తర్వాత అందకు చికిత్స చేసుకున్నాడట. ఇప్పుడు హృతిక్ బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు.

ప్రియాంక చోప్రా :
అమెరికాలో స్టేట్ లెవల్‌లో నిర్వహించిన ఓ చారిటీ కార్యక్రమానికి ఎంపికయిన తొలి ఇండియన్ ప్రియాంక చోప్రా.

రణబీర్ కపూర్ :
ఇప్పటికీ రణబీర్ కపూర్ ప్రతి వారం తన తల్లి నుంచి రూ. 1500 పాకెట్ మనీ తీసుకుంటాడట.

దీపిక పదుకొనె:
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనె 2003లో జస్ట్ సెవెన్ టీన్ మేగజైన్ కోసం ఫస్ట్ రన్ వే అప్పియరెన్స్ ఇచ్చిందట.

ఇమ్రాన్ ఖాన్:
ఇమ్రాన్ ఖాన్ అమీర్ ఖాన్ మేనల్లుడు, బాలీవుడ్ యంగ్ హీరో ఇమ్రాన్ ఖాన్ వాస్తవానికి ఇండియన్ సిటీజెన్ కాదు, అతను అమెరికా పౌరుడు.

పరిణీత చోప్రా:
ప్రియాంకాచోప్రా బంధువైన పరిణీతి చోప్రా తన 12వ తరగతి ఎగ్జామ్స్ లో ఆలిండియా ఫస్ట్ వచ్చింది. భారత రాష్టప్రతి నుంచి రివార్డు కూడా దక్కించుకుంది.

అమీర్ ఖాన్ :
అమీర్ ఖాన్ సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టడానికి కారణం ఆయన నటించిన లగాన్ చిత్రం ఆస్కార్ నామినేషన్లలో రిజెక్ట్ కావడమేనట.

మాధురి దీక్షిత్:
మాధురి దీక్షిత్ నటించిన హమ్ ఆప్‌కె హై కౌన్ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ చిత్రం ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ పలు రికార్డులు బద్దలు కొట్టింది. ఈ చిత్రం యూకెలో 1 మిలియన్ పౌండ్లు కలెక్ట్ చేసింది.

షాహిద్ కపూర్ :
మ్యూజిక్ వీడియోలు, వ్యాపార ప్రకటనలతో కెరీర్ ప్రారంభించిన బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, సుభాష్ గై దర్శకత్వంలో వచ్చిన తాల్ చిత్రంలో బ్యాగ్రౌండ్ డ్యాన్సర్‌గా చేసాడు. ఇష్క్ విష్క్ చిత్రం ద్వారా హీరోగా తెరంగ్రేటం చేసాడు. తొలి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కించుకున్నాడు.

సుస్మితా సేన్ :
మాజీ బ్యూటీ క్వీన్, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ కొండ చిలువను పెంపుడు జంతువులా పెంచుకుంటుంది.

హృతిక్ రోషన్ :
హృతిక్ రోషన్‌కు చిన్నతనంలో సరిగా మాట్లాడటం వచ్చేది కాదట. నత్తి నత్తిగా మాట్లాడేవాడట. ఆ తర్వాత అందకు చికిత్స చేసుకున్నాడట. ఇప్పుడు హృతిక్ బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు.



Click it and Unblock the Notifications
