నాతో ఒక్కసారి సెక్స్ లో పాల్గొను, ఒక్కరోజు రూమ్ కు వస్తావా నేను హెల్ప్ చేస్తాను #mystory269

By
Subscribe to Boldsky

మీటూ ఇప్పుడు చాలా మంది మీడియా ముందుకు వస్తున్నారు. నిజంగా వాళ్లంతా ధైర్యవంతులే. అయితే అలా మీటూ అనలేని వాళ్లు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఈ ప్రపంచంలోని తొంభైతొమ్మిది శాతం మంది అమ్మాయులు కచ్చితంగా లైంగిక వేధింపులకు గురై ఉంటారు.

ఇప్పుడు మీడియా ముందుకు వస్తున్న వారంతా సెలబ్రెటీలు కాబట్టి వారి గురించి మాట్లాడుకుంటున్నాం గానీ మారుమూల గ్రామాల్లో, తండాల్లో, పొట్ట కూటి కోసం పని చోసే చోట్ల కూడా అమ్మాయిలు రోజూ లైంగిక వేధింపులకు గురవుతున్నారు. నేను ఒక సాధారణ అమ్మాయిని.

అందంగా ఉంటాను

అందంగా ఉంటాను

మాది చాలా పేద కుటుంబం. కానీ నేను చాలా అందంగా ఉంటాను. నువ్వు బాగా రెడీ అయ్యావంటే ఏ జమిందారు కూతురో అని ఆశ్చర్యపోతారే అంటూ మా వాళ్లు నన్ను చిన్నప్పుడు ఆటపట్టించేవారు. చిన్నప్పుడు మా గ్రామంలో పనులకు వెళ్లి చదువుకున్నాను. సెలవులు ఉన్నప్పుడల్లా నేను ఏదో ఒక పని చేయడానికి వెళ్లేదాన్ని.

ఏదో రకంగా ఇబ్బందిపెట్టారు

ఏదో రకంగా ఇబ్బందిపెట్టారు

అయితే నన్ను ప్రతి చోట కూడా మగవారు ఏదో రకంగా ఇబ్బందిపెట్టారు. వయస్సులో మా నాన్న కంటే పెద్దవాళ్లు కూడా నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించేవారు. నేను వాళ్ల దగ్గర పని చేయడానికి వెళ్తున్నాని నాతో చాలా నీచంగా ప్రవర్తించేవారు.

మీ కూతుర్లతో కూడా ఎవడైనా

మీ కూతుర్లతో కూడా ఎవడైనా

నాకు అనిపించేది మీ కూతుర్లతో కూడా ఎవడైనా ఇలాగే ప్రవర్తిస్తే మీకు ఎలా మండుతుందో నాకు అంతకన్నా ఎక్కువగానే మండుతుందనేకునేదాన్ని. అయినా ధైర్యంగా ముఖం మీదే ఈ మాటలు చెప్పలేక మనస్సులో పెట్టుకునేదాన్ని.

Most Read :అక్క ప్రియుడిని రూమ్ కు పిలిపించుకుని ఎంజాయ్ చేసేదాన్ని, మందులోకి ఆమ్లెట్, తర్వాత సెక్స్

పెళ్లయి పిల్లలున్నా కూడా

పెళ్లయి పిల్లలున్నా కూడా

ఎలాగోలా కష్టపడి ఎంబీఏ దాకా చదివాను. తర్వాత మా ఊరికి దూరంగా సిటీకి వెళ్లిపోయాను. ఒక పెద్ద ఆఫీస్ లో జాబ్ వచ్చింది. ఆఫీస్ లో అందరూ సారోళ్లు టై కట్టుకుని కోర్ట్ వేసుకుని చాలా హుందాగా ఉండేవాళ్లు. కానీ చాలా మంది బుద్ధి బాగుండేది కాదు. పెళ్లయి పిల్లలున్నా కూడా వక్రబుద్ధితో ప్రవర్తించేవాళ్లు.

గట్టిగా హత్తుకునేవాడు

గట్టిగా హత్తుకునేవాడు

నా ఈడు అబ్బాయిలతో ఫ్రెండ్లీగా మాట్లాడితే ఓర్వలేకపోయేవారు కొందరు సీనియర్స్. కానీ వాళ్లు మాత్రం నాతో మాట్లాడేందుకు నా డెస్క్ దగ్గరకు వచ్చి ఏవేవో వేషాలు పడేవారు. ఒకడేమో నువ్వు వర్క్ బాగా చేశావు అంటూ కంగ్రాట్స్ చెబుతూనే చెయ్యిని గట్టిగా నొక్కేవాడు.. ఇంకొకడు నన్ను అభినందించే క్రమంలో గట్టిగా హత్తుకునేవాడు.

నాతో ఒక్కసారి సెక్స్ లో పాల్గొను

నాతో ఒక్కసారి సెక్స్ లో పాల్గొను

మరొకడు చూసిచూడనట్లుగా నన్ను టచ్ చేసేవాడు. ఏదో పొరపాటున వాడి చెయ్యి నాకు తగిలిందన్నట్లుగా బిల్డప్ ఇచ్చేవాడు. ఇలా ప్రతి ఒక్కడూ ఏదో వంకతో టచ్ చేసేవారు. నన్ను మరీ బలవంతం చేసినవాళ్లు చాలా మందే ఉన్నారు. నాకు ఇష్టం లేదూ అంటే కూడా నాతో ఒక్కసారి సెక్స్ లో పాల్గొను అని వేధించినవాళ్లు ప్రతి అమ్మాయి జీవితంలో ఒక్కరైనా ఉంటారు. అలాగే నా జీవితంలోనూ ఉన్నారు.

Most Read :లెక్కల మాష్టార్ నా నడుమును ఒత్తేవాడు, వక్షోజాలను తాకేవాడు, తొడను గిల్లేవాడు

ప్రిన్సిపల్ కు చెబితే

ప్రిన్సిపల్ కు చెబితే

నన్ను కూడా కాలేజీ రోజుల్లో ఒక సీనియర్ అలాగే టార్చర్ చేశాడు. వాడి బాధ నుంచి తప్పించుకోవడానికి కాలేజీలో ప్రిన్సిపల్ కు కంప్లైట్ ఇచ్చాను. కానీ ప్రిన్సిపల్ మాత్రం.. ఆ అబ్బాయి అలాంటి వాడు కాదమ్మా.. అయినా అతను మన కరస్పాండెంట్ కు బంధువు.. నువ్వే కాస్త దూరంగా ఉండు సలహా ఇచ్చాడు.

ఒక్కరోజు రూమ్ కు వస్తావా

ఒక్కరోజు రూమ్ కు వస్తావా

ఇక ఆఫీస్ లో ఒక సీనియర్ తో కాస్త క్లోజ్ గా ఉండేదాన్ని. కాస్త అమౌంట్ టైట్ గా ఉందని నా సమస్యను అతనితో నేను చెబితే.. అతను మాత్రం ఏకంగా ఒక్కరోజు రూమ్ కు వస్తావా నేను హెల్ప్ చేస్తాను అన్నాడు. ఇలాంటి విషయాలన్నీ బయటకు చెప్పలేం. నాలా ప్రతి సాధారణ అమ్మాయి రోజూ ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటుంది. వీటన్నింటినీ ప్రతి అమ్మాయి మీడియా ముందుకు వచ్చి చెప్పలేదు.

ప్రతి ఒక్కడితో పడుకోవాలని...

ప్రతి ఒక్కడితో పడుకోవాలని...

కానీ నాకు మాత్రం ఇలాంటి ఇబ్బందులన్నింటనీ గట్టిగా అరిచి అందరికీ చెప్పాలనిపిస్తూ ఉంటుంది. నేను ఇష్టపడి నేను పెళ్లి చేసుకునే వ్యక్తితో మాత్రమే నేను గడపాలనుకుంటానుగానీ ప్రతి ఒక్కడితో పడుకోవాలని నేను ఎందుకు అనుకుంటాను. ప్రతి అమ్మాయి కూడా ఇలాగే ఆలోచిస్తుంది.

MostRead :చలికాలంలో పురుషాంగం ముడుచుకుపోతుంది, సైజ్ బాగా తగ్గిపోతుంది, అది చేయాలని ఉన్నా చెయ్యలేరు, గట్టి పడదు

సెక్స్ కోరికలతో ఇచ్చే హగ్

సెక్స్ కోరికలతో ఇచ్చే హగ్

కొందరు కసిగా కంటి చూపులతోనే ఒళ్లంతా స్కాన్ చేసేస్తుంటారు. ఫ్రెండ్లీగా ఉంటే ఏ అమ్మాయి కూడా ఏ అబ్బాయి విషయంలో బాధపడదు. ఫ్రెండ్లీగా ఇచ్చే హగ్ కు, సెక్స్ కోరికలతో రగిలిపోతూ ఇచ్చే హగ్ కు తేడాను ప్రతి అమ్మాయి గుర్తు పట్టగలదు. నాలాగే చాలా మంది కామన్ గర్ల్స్ రోజూ ఏదో రకంగా లైంగిక వేధింపులకు గురవుతూనే ఉంటారు. కానీ ఎవ్వరికీ చెప్పుకోలేక నలిగిపోతుంటారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    my me too story i am a common girl, i faced so many times sexual harassment

    my me too story i am a common girl, i faced so many times sexual harassment
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more