Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
ఆ ఇంట్లోకి వెళ్తే మాత్రం నరకమే, ఇళ్లంతా రక్తసిక్తం, చిత్రవధలకు గురయ్యే మనుషులను చూస్తారు
ఎలుకలు, జర్రీలు, సాలెపురుగులు వంటి వాటితో ఇంట్లోకి వెళ్లిన వారిని భయపిస్తూ ఉంటారు. వాటన్నింటిని ఎక్కడంటే అక్కడ వదులుతారు. అలాగే కొందరు యాక్టర్స్ కూడా ఇంట్లో ఉంటారు. ఇళ్లు మొత్తం కూడా రక్తపాతంలా ఉంటుంద
మనం చాలా భయంకరమైన ఇళ్ల గురించి వినే ఉంటాం. చదివి ఉంటాం. చూసి ఉంటాం. ఆ ఇంట్లోకి వె
ళ్తే తిరిగి రాలేరని అంటూ ఉంటారు. నిజంగా అలాంటి ఇళ్లు ఉన్నాయా చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. అయితే అలాంటి ఇళ్లు కూడా ఇప్పటికీ ప్రపంచంలో చాలానే ఉన్నాయి.
అలాంటి భయంకరమైన ఒక ఇంటి గురించి తెలుసుకోండి మరి. అంత భయంకరంగా ఉండే ఇంట్లోకి వెళ్లేందుకు జనాలు క్యూ కడుతున్నారు. సుమారు 24000 మంది ఆ ఇంట్లోకి వెళ్లేందుకు క్యూ లో ఉన్నారు.

మాకు ధైర్యం ఉందంటే...
కాలిఫోర్నియాలో ఆ భయంకరమైన ఇళ్లు ఉంది. మక్ కమీ మోనార్ అనేది ప్రపంచంలోనే అతి భయంకరమైన ఇళ్లు. రుస్ మక్ కమీ అనే వ్యక్తి కాలిఫోర్నియాలో శాన్ డియాగోలో దీన్ని నిర్వహిస్తున్నారు. ఎవరైనా సరే మాకు ధైర్యం ఉంది.. మేము ఆ ఇంట్లోకి వెళ్లి రాగలం అనేవాళ్లను ఆ ఇంట్లోకి ఆహ్వానిస్తారు. వెళ్లిన వాళ్లకు మాత్రం నరకం చూపిస్తారు.
ఎందుకొచ్చామురా ఈ ఇంట్లోకి అని అల్లాడిపోతారు. ఇంట్లోకి వెళ్లిన వారిని రకరకాలుగా భయపించడం నిర్వాహకుల పని.

సంతకాలు చెయ్యాలి
ఈ ఇంట్లోకి వెళ్లే వారు మొదట కొన్ని పత్రాలపై సంతకాలు చెయ్యాల్సి ఉంటుంది. అంతేకాదు ఆ ఇంటి యజమాని మక్ కమీ తమ ఇంటికొచ్చే వారి మానసిక పరిస్థితి కూడా ప్రత్యేకంగా తెలుసుకుంటాడు. వారికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మెంటల్లీ, ఫిజికల్లీ ఎలాంటి బాధలు లేని వారినే ఇంట్లోకి అనుమతిస్తారు.

భయపెట్టేందుకు ప్రయత్నిస్తారు
ఇంట్లోకి వెళ్లిన వారిని భయపెట్టేందుకు అక్కడుండే వారు చాలా రకాలుగా ప్రయత్నిస్తారు. లోనికి వెళ్లిన వారిని భయపెట్టేందుకుగాను కొన్ని రకాల స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా ఇంట్లో ఉంటాయి. ఇంట్లో యానిమేట్రానిక్స్ కూడా ఉంటాయి. అంతేకాదు కొన్ని రకాల జంతువులు, క్రిమి కీటకాలు కూడా ఇంట్లో ఉంటాయి.

రక్తపాతంలా ఉంటుంది
ఎలుకలు, జర్రీలు, సాలెపురుగులు వంటి వాటితో ఇంట్లోకి వెళ్లిన వారిని భయపిస్తూ ఉంటారు. వాటన్నింటిని ఎక్కడంటే అక్కడ వదులుతారు. అలాగే కొందరు యాక్టర్స్ కూడా ఇంట్లో ఉంటారు. ఇళ్లు మొత్తం కూడా రక్తపాతంలా ఉంటుంది. నరకంలో ఎలాగైతే చిత్రహింసలు పెట్టి చిత్రవధ చేస్తుంటారో అలాంటి సీన్స్ మొత్తం కూడా ఆ ఇంట్లో చూడొచ్చు. అలాగే ఇంట్లో చిత్రవధలకు గురయ్యే మనుషులను చూస్తారు. దీంతో ఇంట్లోకి వెళ్లిన జనం ఏడుపులతో అల్లాడిపోతారు.

ఒక మినీ మూవీ తీస్తాం
ఇంట్లోకి వెళ్లిన ప్రతి వ్యక్తిపై ఒక వీడియోను చిత్రీకరిస్తారు ఇంటి ఓనర్ మెక్ కమే. "ఇంట్లోకి వెళ్లి వలంటీర్స్ ను భయపెట్టి వారి ప్రతి రియాక్షన్ కూడా మేము చిత్రీకరిస్తాం. మొత్తానికి ప్రతి వలంటీర్ పై ఒక మినీ మూవీ తీస్తాం. ఆ వీడియోలన్నింటినీ కూడా నా యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తా. ఇలా పోస్ట్ చేసిన వీడియోల్లో 39 మిలియన్స్ పైగా వ్యూస్ వచ్చిన వీడియోలు కూడా ఉన్నాయి."

కచ్చితంగా భయపడతారు
ఇక ఇంట్లోకి వెళ్లేటప్పుడు చాలా మంది ధైర్యంగా ఉంటారు. అయితే వెళ్లిన తర్వాత మాత్రం కచ్చితంగా భయపడతారు. ఎందుకంటే ఇళ్లు మొత్తం కూడా రక్తం మరకలతో నిండి ఉంటుంది. అయితే అది నిజమైన బ్లడ్ మాత్రం కాదు. కానీ ఆ రక్తాన్ని చూసి భయంతో గజగజలాడిపోయి వెనక్కి వచ్చే వాళ్లు చాలా మందే ఉంటారు.

కుక్కలకు తినడానికి
ఆ ఇంట్లోకి వెళ్లడానికి గెస్ట్స్ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మొత్తం ఫ్రీగానే ఉంటుంది. మక్ కామే కు కుక్కలంటే బాగా ఇష్టం. కేవలం తన కుక్కలకు తినడానికి ఏదైనా ఇచ్చిపోతే సరిపోతుందనుకుంటాడు. అయినా అంతలా భయపడేందుకు ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్లాలి అనుకుంటున్నారా.. ఎవరి థ్రిల్ వారిది. అయితే ఆ ఇంట్లో చేసేవన్నీ కూడా ఉత్త డ్రామాలే. జనాల్ని భయపించడానికే అలా చేస్తారు.



Click it and Unblock the Notifications
