Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
ఈ రాశులకు చెందిన పురుషులు ఏ రకమైన ఫ్లర్టింగ్ కు పడిపోతారో మీకు తెలుసా?
స్నేహపూర్వకమైన హావభావాలు, అందమైన చిరునవ్వు, సహాయాన్ని అందించడం వంటివి క్రష్ ని ఇంప్రెస్ చేయడానికి వాడే కొన్ని చిన్ని చిన్ని ప్రేమపూర్వక ఉపకరణాలు. అయితే, పురుషులకు కొన్ని రకాల ఫ్లర్టింగ్ అంటే ఇష్టమని మీకు తెలుసా?
అవును, జోడియాక్ సైన్ ప్రకారం ఫ్లర్టింగ్ లో కొన్ని రకాలను కొందరు పురుషులు ఇష్టపడతారు. వారి జోడియాక్ సైన్ పై వారి ఫ్లర్టింగ్ టేస్ట్ ఆధారపడి ఉంటుంది.
ఈ విషయాలు మీకు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా. ఇక్కడ ఏ రాశికి చెందిన పురుషులు ఏ రకమైన ఫ్లర్టింగ్ ను ఇష్టపడతారో మనం తెలుసుకుందాం.
ఈ ఆర్టికల్ లో వివిధ జోడియాక్ సైన్స్ కి చెందిన పురుషులు ఏ రకమైన ఫ్లర్టింగ్ ను ఇష్టపడతారో మీకు వివరించాము. పరిశీలించండి మరి.

మేషరాశి: మార్చ్ 21 - ఏప్రిల్ 19
ఈ రాశికి చెందిన వారు మీలో ప్యాషన్ ని ఇష్టపడతారు. మీరు అతనిపై దృష్టి కేంద్రీకరించారన్న విషయాన్ని అతనికి తెలపడమే మీరు చేయవలసింది. అయితే, ఈ విషయాన్ని మీరు సులభంగా చెప్పలేరు.తొందరపడటం అనేది మంచిది కూడా కాదు. కొన్ని చిరునవ్వులు అందించండి. యాక్సిడెంటల్ స్కిన్ టచెస్ ద్వారా ఈ విషయాన్ని తెలపండి.

వృషభరాశి: ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశికి చెందిన వారు సాధారణ ఫ్లర్టింగ్ ను ఇష్టపడతారు. వీకెండ్ లో డిన్నర్ డేట్ కి సంబంధించిన మెసేజ్ ను అందించడం లేదా స్వీట్ నోట్ ను అందించడం ద్వారా వారిని ఫ్లర్ట్ చేయవచ్చు. చిన్న చిట్కా, మరుసటి రోజే డేట్ కి రమ్మని వారిని అడిగితే వారు ఇబ్బందికి గురయ్యే ప్రమాదం ఉంది.

మిథునరాశి: మే 21 - జూన్ 20
ఈ రాశికి చెందిన వారిని మీ తెలివితేటలతో ఫ్లర్ట్ చేయవచ్చు. ఈ రాశికి చెందిన వారు అమ్మాయిల తెలివితేటలకు ఆకర్షితులవుతారు. మీ కాన్వర్సేషనల్ స్కిల్స్ ను పాలిష్ చేసుకుని వారిని ఎంగేజ్ చేస్తూ ఉండాలి. త్వరలోనే, మీ ప్రేమలో పడటం ఖాయం.

కర్కాటకరాశి: జూన్ 21 - జులై 22
ఈ సైన్ కి చెందిన పురుషులు ఎంతో తెలివైన వారు. ఫేక్ నుఇట్టే కనిపెట్టేస్తారు. వీరిని ఫ్లర్ట్ చేయాలనుకుంటే అది జెన్యూన్ గా జరగాలి. ఈ రాశికి చెందిన వ్యక్తికి మీ లోని ఫ్లర్టీ సైడ్ ను వెంటనే చూపించకండి. కొన్ని గెస్చర్స్ తో ఈ రాశికి చెందిన వారు ఇంప్రెస్ కాలేరు. మీకు క్లోజ్ అవలేరు. కాబట్టి, మీరు జెన్యూన్ గా వారినిష్టపడితే వారంతట వారే మీకు అట్రాక్ట్ అవుతారు.

సింహరాశి: జులై 23 - ఆగస్ట్ 23
ఈ రాశికి చెందిన పురుషుడిని ఇంప్రెస్ చేయాలంటే మీరొక చిన్న ట్రిక్ ను ప్లే చేయాలి. వారికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వాలి. ప్రపంచంలోని అందరికంటే వారికే ప్రాముఖ్యతను ఇస్తున్న విషయాన్ని వారికి తెలియచేయాలి. వారిని బుజ్జగించాలి. అప్పుడే, వారికి ఫ్లర్టింగ్ లోని కిక్ అర్థమవుతుంది. మీ జీవితం వారికోసమేనన్న విషయం వారికర్థమయ్యేలా జాగ్రత్తపడండి. వారికి మీ అటెన్షన్ ఎల్లప్పుడూ అవసరం.

కన్యారాశి: ఆగస్టు 24 - సెప్టెంబర్ 23
ఈ రాశికి చెందిన పురుషుడిని మీరు ఫ్లర్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు మీ అపియరెన్స్ పై మీరు దృష్టి పెట్టాలి. మీరు వీలైనంత అందంగా కనిపించాలి. మీ లుక్స్ కే ఈ రాశికి చెందిన వ్యక్తి ప్రాధాన్యమిస్తాడు. మంచి పెర్ఫ్యూమ్ ను వాడితే మ్యాజిక్ క్రియేట్ అవుతుంది.

తులారాశి: సెప్టెంబర్ 24 - అక్టోబర్ 23
ఈ రాశికి చెందిన పురుషుడితో ఫ్రెండ్లీ డిస్కషన్స్ ను పెంచుకుని అభిప్రాయాలను పంచుకోవచ్చు. చీప్ ఫ్లర్టింగ్ గెస్చర్స్ కు దూరంగా ఉండండి. ఇవి వారిని మీ నుంచి దూరం చేస్తాయి. మీ క్లాసీనెస్ తో పాటు ఇంటెలిజెన్స్ ను వారి ముందుంచండి. మ్యాజిక్ ను మీరే గమనిస్తారు.

వృశ్చికరాశి: అక్టోబర్ 24 - నవంబర్ 22
ఈ రాశికి చెందిన వారు నిజాయితీకి అట్రాక్ట్ అవుతారు. వారి దగ్గర ఏ విషయాన్నీ దాచి ఉంచవద్దు. వీరు రిలేషన్ షిప్ లోకి సులభంగా ప్రవేశించరు. వీరితో రిలేషన్ షిప్ ను మీరు సీరియస్ గా తీసుకోవాలని అనుకుంటే మీరు ఎంతో తెలివిగా వ్యవహరించాలి.

ధనుస్సురాశి: నవంబర్ 23 - డిసెంబర్ 22
ఈ రాశికి చెందిన పురుషులు ఫ్రీ బర్డ్స్ వంటి వారు. వీరిని బంధించాలని మీరు ప్రయత్నించకూడదు. వీరు ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉంటారు. ఫ్లర్టింగ్ కి సంబంధించి వీరితో కాస్త కష్టపడితే చాలు. అయితే, వేగంగా ఈ రాశికి చెందిన పురుషుడు మీ పట్ల ఆకర్షితుడవుతాడని మీరు ఆశించవద్దు. కాబట్టి, లిమిట్స్ లో ఉండండి. కొన్ని సార్లు వీరు వెనకడుగు వేసే ప్రమాదం కూడా ఉంది.

మకరరాశి: డిసెంబర్ 23 - జనవరి 20
ఈ రాశికి చెందిన పురుషుడిని ఫ్లర్ట్ చేయడానికి మీకు ఎంతో పేషన్స్ అవసరం. ఎందుకంటే, వీరు ఇతర విషయాలపై ఫోకస్ ను పెడతారు. మీరు వీరి దృష్టిలో పడడానికి ఎంతో శ్రమపడాలి. మీ మెచ్యూరిటీను ప్రదర్శించాలి. మీ లైఫ్ పై అలాగే ఫ్యూచర్ ప్లాన్స్ పై మీకు క్లారిటీ ఉండాలి. అతనితో మీరెంత స్టేబుల్ గా ఉండగలరో అతనికి మీరు తెలియచేయాలి. వీరు ఫ్లర్టింగ్ ను సీరియస్ గా తీసుకునే వ్యక్తులు.

కుంభరాశి: జనవరి 21 - ఫిబ్రవరి 18
ఈ సైన్ కి చెందిన పురుషులు అంచనాలకు అందరు. మీ సహజ స్వభావాన్ని వీరు త్వరగా అర్థం చేసుకుంటారు. మీరు మీలా ఉండటం ద్వారానే వారిని మీరు ఇంప్రెస్ చేయగలుగుతారు. మీ లుక్స్ కు లేదా తెలివితేటలకు వీరు ఇంప్రెస్ కారు. కొన్ని చమత్కారాలతో వీరిని ఆకట్టుకోవచ్చు.

మీనరాశి: ఫిబ్రవరి 19 - మార్చ్ 20
ఈ రాశికి చెందిన పురుషుడిని ఇంప్రెస్ చేయడానికి మీరు మీలోని రొమాంటిక్ సైడ్ ను ప్రదర్శించవలసి వస్తుంది. మోస్ట్ రొమాంటిక్ వే లో వారిని ఫ్లర్ట్ చేయాలి. కళ్ళలోకి చూడడం, చేతిని చేతిలోకి తీసుకోవడంతో పాటు ఊహించని హగ్ ఇవ్వడం వంటివి వీరిని ఇంప్రెస్ చేస్తాయి. ఇవన్నీ, వీరు మీ వెంట పడేందుకు దోహదపడతాయి.
ఎటువంటి ఫ్లర్టింగ్ ను వుమెన్ ఇష్టపడతారో మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, స్టే ట్యూన్డ్.



Click it and Unblock the Notifications