Latest Updates
-
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ హై ప్రొటీన్ జొన్న గుగ్గిళ్లు తినాల్సిందే..ఈజీగా చేసుకోండిలా.. -
స్మోకింగ్ చేసినా కొందరికి క్యాన్సర్ ఎందుకు రాదు? సీక్రెట్ ఇదే! -
వీకెండ్ అయినా, గెస్ట్స్ వచ్చినా..ఎగ్ పులావ్ ఇలా చేస్తే కిచెన్ లోనే ఉండిపోతారు! -
ఆగస్టు నెల రాశి ఫలాలు: ఈ 5 రాశుల వారికి తిరుగులేని విజయం..మీ రాశి ఉందో లేదో చూసుకోండి! -
ఎందుకు నాన్నలకు కూతుళ్లంటే అంత ప్రాణం? -
రీసెర్చ్ ప్రకారం ఒక పురుషుడు ఎంతసేపు శృంగారం చేయగలడు? శీఘ్రస్కలనం గురించి ముఖ్య నిజాలు.. -
ఇంట్లో ఈ ఒక్కటి వాడకపోతే ఇన్ని తిప్పలా.. అరికాళ్ల నొప్పులకి ప్రధాన కారణమిదే.! -
ఆ భయంతో భార్యను దూరం పెడుతున్నారా.. పురుషులను ఇబ్బందికి గురిచేసే శృంగార సందేహాలివే.! -
చపాతీ, అన్నంలోకి అదిరిపోయే రుచితో పెరుగు బెండకాయ గ్రేవీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షం పడేటప్పుడు వేడివేడిగా హెల్తీగా తినాలంటే.. ఐదే నిమిషాల్లో లెమన్ గార్లిక్ సోయా చంక్స్ రెడీ.!
దిన ఫలాలు: 12 జనవరి 2018
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి.
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.
ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..
ఓం శ్రీ గురుభ్యోనమః
అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.
ది. 12-1-2018 తారీఖు, శుక్రవారం నాటి దిన ఫలాలను ఒకసారి పరిశీలిద్దాం. హేమలంబి నామ సంవత్సరం, దక్షియాణనం, హేమంత రుతువు, శీతాకాలం, పుష్య మాసం, బహుళ ఏకాదశి, రాత్రి 10 గంటల 52 నిమిషాల వరకూ ఉంటుంది. విశాఖా నక్షత్రం ఉదయం 9 గంటల 52 నిమిషాల వరకూ ఉంది. అమృత సమయం రాత్రి 12 గంటల 36 నిమిషాల నుండి 2 గంటల 16 నిమిషాల వరకూ ఉంది. వర్జ్యం మధ్యాహ్నం 2 గంటల 3 నిమిషాల నుండి 3 గంటల 48 నిమిషాల వరకూ ఉంది. దుర్ముహర్తం ఉదయం 8గంటల 58 నిమిషాల నుండి 9 గంటల 35 నిమిషాల వరకూ ఉంది. దుర్ముహర్తం ఉదయం 10 గంటల 32 నిమిషాల నుండి 1 గంట 16 నిమిషాల వరకూ ఉంది. సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 42 నిమిషాలు. సూర్యాస్తమయ సమయం 5 గంటల 40 నిమిషాలు.

మేష రాశి: 21 మార్చి-20 ఏప్రిల్
అనుకున్న పనులు వాయిదా పడతాయి. భార్య సహకారంతో పనులు పూర్తి చేస్తారు. ఇంటి విషయాలు బాధ్యతగా పూర్తి చేయవలసి ఉంటుంది. కొన్ని అవకాశాలు చేతికి వచ్చి జారిపోయే ప్రమాదం ఉంటుంది. తండ్రి గారి ఆశీర్వాదం కూడా పొందవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు భాగ్యాన్ని కలుగచేస్తాయి.

వృషభ రాశి: 21 ఏప్రిల్-21 మే
అన్నదమ్ముల సహకారం ఉంటుంది. పనివారి సహాయ సహకారాలు కూడా ఏర్పడుతాయి. చేయు పనులందు ఆటంకాలు కూడా ఉన్నాయి. భార్యతో అనుకూల దాంపత్యం కూడా కలదు. వృత్తి వ్యాపారాలు బాధ్యతగా చేయవలసి ఉంటుంది.

మిథున రాశి: 22 మే-21 జూన్
అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ధనానికి ఇబ్బందులు కలవు. కొన్ని అవకాశాలు చేజారే ప్రమాదం ఉంది. విందు భోజనాలు చేస్తారు. పిల్లలు బాధ్యత ఎరిగి ప్రవర్తిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాన్ని తెస్తాయి.

కర్కాటక రాశి: 22 జూన్-22 జూలై
చేయు పనులు వాయిదా పడతాయి. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. అధికారులు ప్రసన్నం అవుతారు. ఇంటికి సంబంధించిన పనులు పట్టుదలగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

సింహ రాశి: 23 జూలై-21 ఆగష్ట్
చిన్న ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అన్నదమ్ముల సహకారం కూడా ఉంటుంది. పిల్లల అభివృద్ధికై పాటుపడతారు. దైవ దర్శన ప్రాప్తి కూడా కలదు. తల్లిగారి ఆశీర్వాదాన్ని కూడా పొందుతారు.

కన్యా రాశి : 22 ఆగష్ట్-23 సెప్టెంబర్
చిన్న ప్రయాణాలు చేస్తారు. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. వాహన ప్రయాణాలలో మెలకువ అవసరం. భార్య సహకారంగా ఉండగలదు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

తులా రాశి: 24 సెప్టెంబర్-23 అక్టోబర్
అనుకున్న పనులన్నీ సాధిస్తారు. ధన ప్రణాళికలన్నీ అనుకూలిస్తాయి. అధికారుల సహకారం ఉంటుంది. పిల్లల గురించి బాధ్యతగా మసులుకోవాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ధనాన్ని చేకూరుస్తాయి.

వృశ్చిక రాశి: 24 అక్టోబర్-22 నవంబర్
అనుకున్న పనులు కష్టం మీద పూర్తి చేస్తారు. ధన ప్రణాళికలు బాగా పనిచేస్తాయి. దైవ దర్శన ప్రాప్తి కలదు. దూరపు బంధువుల వార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలు ధనాన్ని కలుగచేస్తాయి.

ధనూ రాశి: 23 నవంబర్-22 డిసెంబర్
ఆరోగ్యంపై దృష్టి పెట్టవలసి ఉంటుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ధనానికి ఇబ్బందులు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి.

మకర రాశి: 23 డిసెంబర్-20 జనవరి
బంధు మిత్రుల కలయికలు ఉన్నాయి. కొన్ని అనవసర ఖర్చులు కూడా ఏర్పడతాయి. అనుకున్న పనులు వాయిదా పడే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

కుంభ రాశి: 21 జనవరి-20 ఫిబ్రవరి
అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. పని వారి సహాయ సహకారాలు లభిస్తాయి. అధికారులు ప్రసన్నం అవుతారు. తండ్రి గారి ఆశీర్వాదం కూడా లభిస్తుంది.

మీన రాశి: 20 ఫిబ్రవరి-20 మార్చి
దూరపు బంధువుల సమాచారం వింటారు. దైవ దర్శన ప్రాప్తి కలదు. పిల్లల పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతాయి. భార్య విషయంలో ఆలోచనలు ఉంటాయి.
ఇప్పటి వరకూ ఈ నాటి దిన ఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు.
సర్వేజనా సుఖినోఃభవంతు
సమస్త సన్మంగళానిభవంతు
అందరికీ నా నమస్కారం.



Click it and Unblock the Notifications