Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
దిన ఫలాలు: 18 జనవరి 2018
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశ
భారతదేశం లేదా పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం మన జీవిత గమనాలు అంతరిక్షంలోని నక్షత్ర సమూహాలతో ఏర్పడ్డ వివిధ జన్మరాశుల స్థితి, గమనం పై ఆధారపడి ఉంటాయి. మొత్తం పన్నెండు రాశులు ఉంటాయి. ఈ పన్నెండు రాశుల జ్యోతిష్య ఫలితాలు ఆయా సమయాల్లో గోచార స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని ఇవ్వటం జరుగుతుంది. ఈ ఫలితాలు సామాన్యంగా అన్ని వర్గాలకు కలిపి చెప్తారు. వ్యక్తిగతంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తి వుంటే దగ్గరలో ఉన్న జ్యోతిష్య నిపుణుడి వద్ద సంప్రదించి , మీ జన్మ వివరాలను తీసుకువెళ్ళి జాతకాలను, వాటిలో దోషాలు, దానికి పరిష్కారాలు వివరంగా తెలుసుకోవచ్చు.
ఈ నాటి దినఫలాలు అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయానికి చెందిన పెద్దలు బ్రహ్మశ్రీ శ్రీ నలమాటి కొండలరావు గారి నోటి మాటల్లోనే..
ఓం శ్రీ గురుభ్యోనమః
అఖిల భారత తెలుగు ప్రేక్షకులందరికీ అష్టలక్ష్మీ జ్యోతిష్య నిలయం వారి నమఃస్సుమాంజలి.
ది. 18-1-2018 తారీఖు,గురువారం నాటి దినఫలాలను ఒకసారి పరిశీలిద్దాం. హేమలంబి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత రుతువు, శీతాకాలం, మాఘ శుద్ధ పాడ్యమి, ఉదయం 9 గంటల 6 నిమిషాల వరకు ఉంది. శ్రవణా నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 01 నిమిషం వరకూ ఉంది. అమృత సమయం మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల నుండి 2 గంటల 31 నిమిషాల వరకూ ఉంది. వర్జ్యం రాత్రి తెల్లవారితే 4 గంటల 29 నిమిషాల లగాయతు 6 గంటల 15 నిమిషాల వరకు ఉంది. దుర్ముహర్తం ఉదయం 10 గంటల 26 నిమిషాల నుండి 11 గంటల 26 నిమిషాల వరకూ ఉంది. మరలా దుర్ముహర్తం మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషాల నుండి 3 గంటల 30 నిమిషాల వరకూ ఉంది. సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 35 నిమిషాలకు, సూర్యాస్తమయ సమయం సాయంత్రం 5 గంటల 43 నిమిషాలకు.

మేష రాశి: 21 మార్చి-20 ఏప్రిల్
తలచిన పనులు ఆటంకంతో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల నిమిత్తం చేయు పనులు పుంజుకుంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి వస్తుంది. తండ్రిగారి సహాయ సహకారాలు తీసుకోవాల్సి ఉంటుంది.

వృషభ రాశి: 21 ఏప్రిల్-21 మే
పని వారి సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయి. భార్య గారిని అర్థం చేసుకోటానికి ప్రయత్నించండి. దూరపు బంధువుల కలయికలు ఉన్నాయి. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు బాధ్యతగా చేయవలసి ఉంటుంది.

మిథున రాశి: 22 మే-21 జూన్
ధనానికి ఇబ్బందులున్నాయి. పిల్లలు వారి పనులు వారు పూర్తి చేసుకుంటారు. భార్యను అర్థం చేసుకుని మసులుకోవాల్సి ఉంటుంది. కొన్ని అవకాశాలు చేజారకుండా చూసుకోవాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కర్కాటక రాశి: 22 జూన్-22 జూలై
భార్య సహకారం పూర్తిగా ఉంటుంది. అన్యోన్య దాంపత్యం కూడా కలదు. ఇంటి విషయాలు శ్రద్ధ వహిస్తారు. పిల్లల విషయం శ్రద్ధగా ఉండవలసి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

సింహ రాశి: 23 జూలై-21 ఆగష్ట్
చిన్న ప్రయాణాలు ఎదురవుతాయి. ఇంటికి సంబంధించిన పనులపై శ్రద్ధ వహించవలసి ఉంటుంది. కొన్ని అవకాశాలు చేజారకుండా చూసుకోవాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది.

కన్యా రాశి : 22 ఆగష్ట్-23 సెప్టెంబర్ ;
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి వుంటుంది. ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. సోదరుల సహకారం ఉంటుంది. పిల్లలతో ఆనందంగా గడుపుతారు. పని వారి సహాయ సహకారాలు ఉంటాయి.

తులా రాశి: 24 సెప్టెంబర్-23 అక్టోబర్
అనుకున్న పనులు నెరవేరుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఇంటికి సంబంధించిన పనులు జాగ్రత్తగా చేస్తారు. తల్లిగారి ఆశీర్వాదం కూడా పొందుతారు. వృత్తి వ్యాపారాలు లాభాన్ని తెస్తాయి.

వృశ్చిక రాశి: 24 అక్టోబర్-22 నవంబర్
కోప తాపాలకు తావివ్వకండి. చిన్న ప్రయాణాలు చేస్తారు. ధనం కోసం శ్రద్ధ వహించవలసి ఉంటుంది. దూరపు బంధువుల వార్తలు వింటారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి.

ధనూ రాశి: 23 నవంబర్-22 డిసెంబర్
ధన ప్రణాళికలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. బంధు మిత్రుల కలయికలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు బాగున్నాయి.

మకర రాశి: 23 డిసెంబర్-20 జనవరి
అనుకున్న పనులు సులువుగా నెరవేరుతాయి. విందు భోజనం కూడా చేస్తారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. సోదరుల సహకారం కూడా ఉంటుంది. పిల్లల మనస్సు తగ్గట్టుగా మసులుకుంటారు.

కుంభ రాశి: 21 జనవరి-20 ఫిబ్రవరి
ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ప్రవచనాలు వింటారు. డబ్బు పట్ల శ్రద్ధ అవసరం. పని వారి సహకారం ఉంటుంది.

మీన రాశి: 20 ఫిబ్రవరి-20 మార్చి
పిల్లల పట్ల బాధ్యతగా మెలగాలి. అనుకున్న పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. భూ సంబంధమైన పనులకు, లావాదేవీలకు అనుకూలమైన సమయం. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు బాగున్నాయి.
ఇప్పటి వరకూ ఈ నాటి దిన ఫలితాలను చూసారు కదా ! మీకేమైనా సందేహాలు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. అది కూడా ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు.
సర్వేజనా సుఖినోఃభవంతు
సమస్త సన్మంగళానిభవంతు
అందరికీ నా నమస్కారం.



Click it and Unblock the Notifications