Latest Updates
-
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా?
మీ పేరు ముగిసే అక్షరాన్ని బట్టీ మీ వ్యక్తిత్వం: పేరులో ఆ అక్షరం చివరన ఉంటే నమ్మించి గొంతు కోస్తారు!
మీ పేరు చివరలో ఉండే అక్షరం ద్వారా మీ వ్యక్తిత్వం ఏమిటో తెలుసుకోవొచ్చట. అయితే ఇది తెలుగు కాదండోయ్. ఇంగ్లిష్ లో మీ పేరు ఏ లెటర్ తో ఎండ్ అవుతుందో దాన్నిబట్టి మీ వ్యక్తిత్వం తెలుసుకోవొచ్చు.
మీ పేరు చివరలో ఉండే అక్షరం ద్వారా మీ వ్యక్తిత్వం ఏమిటో తెలుసుకోవొచ్చట. అయితే ఇది తెలుగు కాదండోయ్. ఇంగ్లిష్ లో మీ పేరు ఏ లెటర్ తో ఎండ్ అవుతుందో దాన్నిబట్టి మీ వ్యక్తిత్వం తెలుసుకోవొచ్చు. మీ పేరు ఏ అక్షరంతో ముగుస్తుందో దాన్ని బట్టీ మీరేంటో చెప్పవచ్చట.

మీ పేరు A అనే అక్షరంతో ముగిస్తే?
A అనే అక్షరంతో పేరు ముగిస్తే అలాంటి వ్యక్తులు దయజాలి గుణాలు ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే నాయకత్వ లక్షణాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. వారిని నమ్మిన సిద్ధాంతాలనే పాటిస్తారు. ఇతరులను బాగా గౌరవిస్తారు. ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇస్తారు.
వీరు అంత తేలికగా ప్రేమలో పడరు కానీ వీరు గ్రేట్ లవర్స్.
ఒక్కసారి ఒకరితో బంధం ఏర్పరుచుకుంటే దాన్ని అంత తేలిగ్గా వదలరు. కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. అయితే ఏ తో పేరు పూర్తయ్యే వ్యక్తుల్లో కొందరు చాలా దారుణంగా నమ్మించి తర్వాత చిక్కుల్లోకి దింపుతారు జాగ్రత్త.

మీ పేరు E తో ముగుస్తుందా?
E అక్షరంతో పేరు ముగిస్తే అలాంటి వ్యక్తులు చాలా సున్నిత మనస్కులు అని అర్థం. అయితే వీరికి చాలా విషయాలపై మంచి నాలెడ్జ్ ఉంటుంది. ఇతరులతో పోల్చుకుంటే వీరు బాగా పరిణతి చెందినవారిగా ఉంటారు. కాస్త అధునాతనంగా కనిపిస్తారు.
అయితే వీరు నటించే వ్యకులకు డ్రామాలు చేసే వ్యక్తులకు దూరంగా ఉండాలని భావిస్తారు. వీరికి తమ సామర్థ్యం ఏమిటో తెలిసి ఉంటుంది. వారి విషయాల్లో ఇతరుల జోక్యాన్ని అస్సలు సహించరు.

"L లేదా H"తో ముగుస్తుందా?
"L లేదా H"తో పేరు ముగిస్తే వారు చాలా నమ్మదగ్గ వ్యక్తులని అర్థం. వీళ్లు ఇచ్చిన మాటను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పరు. నీతినిజాయితీ ఎక్కువగా ఉంటుంది. నిబద్ధత కలిగిన వ్యక్తులు. ఒక్కసారి మాట ఇస్తే మాట కోసం ప్రాణం ఇచ్చే రకం. అందుకే వీళ్లకు సమాజంలో ఎక్కువగా గౌరవం ఉంటుంది.

పేరు I తో ముగిస్తే... నమ్మించి గొంతు కోసేవాళ్లు ఉంటారు
I తో పేరు ముగిస్తే అలాంటి వ్యక్తులు చాలా విశ్వసనీయత కలిగిన వ్యక్తులని అర్థం. వీళ్లు భావాలు కాస్త ప్రత్యేకంగా ఉంటాయి. ఇతరులను ఆకర్షించే గుణం కలిగి ఉంటారు. వీరు డబ్బు, కెరీర్ సంబంధిత విషయంలో ముందడుగులో ఉంటారు. అయితే ఐ తో పేరు పూర్తయ్యే వ్యకుల్లో కొందరు మాత్రం నమ్మించి గొంతు కోసేవాళ్లు ఉంటారు. వారిని అస్సలు నమ్మకండి.

మీ పేరు O తో ముగిస్తే
O (ఓ) అక్షరంతో పేరు ముగిస్తే అలాంటి వ్యక్తులు బాగా నమ్మదగిన వ్యక్తులని అర్థం. వీళ్లు ఎక్కువగా కొత్త విషయాలు నేర్చుకోవాలని పరితపిస్తుంటారు. అలాగే వీరు త్వరగా అందరి దృష్టిని ఆకర్షిస్తారు.

"N లేదా M"తో ముగిస్తే
"N లేదా M" అక్షరాలతో పేరు ముగిస్తే అలాంటి వ్యక్తులు విశ్వసనీయతకు మారుపేరు అని అర్థం. వీరు ప్రతిదీ శుభ్రంగా ఉండాలని కోరుకుంటారు. వీరికి సమయం విలువ బాగా తెలుసు. వీరి జీవితంలో ప్రతి క్షణం హ్యాపీగా గడపాలని అనుకుంటారు.

"R లేదా S" తో ముగిస్తే ?
R లేదా S అక్షరాలతో పేర్లు ముగిస్తే అలాంటి వారు స్టైల్ ఐకాన్స్ గా ఉంటారని అర్థం. వీరు ఫ్యాషన్ సంబంధింత రంగంలో ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు. వీరి డ్రెస్సింగ్ స్టైల్ కూడా కాస్త ప్రత్యేకంగా ఉంటుంది.

"Y లేదా T" చివరి అక్షరం అయితే ?
"Y" లేదా "T" అనేవి పేరులో చివరి అక్షరాలు అయితే అలాంటి వ్యక్తులు మంచి మనస్సు గల వారని అర్థం. వీళ్లు వినే ఓపిక ఎక్కువగా ఉంటుంది. ఇతరులు చెప్పే మాటలన శ్రద్ధగా ఎంత సేపు అయినా వింటారు. వీళ్లు చాలా నేచురల్ గా ఉంటారు. వీరు చాలా విషయాలను ముందే ఊహిస్తారు. ప్రపంచంలో వీళ్లంతా నమ్మకమైనా మనషులు ఎవరూ ఉండరు. అలాగే నమ్మకద్రోహం చేస్తే దేనికైనా వెనకాడని నైజం వీరింది.



Click it and Unblock the Notifications
