Latest Updates
-
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.!
జ్యోతిష్యం ప్రకారం, ఈ రాశులవారు తమ ఎక్స్ తో స్నేహంగా ఉండలేరు
జ్యోతిష్యం ప్రకారం, ఈ జన్మరాశులవారు తమ ఎక్స్ తో స్నేహంగా ఉండలేరు
మన జీవితంలో ఎప్పుడో అప్పుడు బ్రేకప్ జరుగుతుంది. మనందరం దాన్ని వివిధ రకాలుగా హ్యాండిల్ చేస్తాం. కొంతమందికి బాధాకరమైన అనుభవం అయితే, కొంతమందికి కొంచెం బెటర్ గానే ఉంటుంది.
కొంతమంది తమ ఎక్స్ లతో బ్రేకప్ తర్వాత కూడా స్నేహంగా ఉండగలరు,కానీ ఇది అందరూ చేయలేరు!
మీ మాజీ ప్రేమికులతో స్నేహంగా ఉండటం చాలా కష్టంగా ఉండొచ్చు, ఎందుకంటే ఎక్కువసార్లు బంధాలు సరిగ్గా విడిపోవు.
కానీ మీకు తెలుసా, ఒకవేళ మంచిగా, సరిగ్గా బంధాలు విడిపోయినా కూడా, ఈ ప్రత్యేక జన్మరాశుల వారు తమ మాజీ ప్రేమికులతో స్నేహంగా ఉండలేరని?జ్యోతిష్యం ద్వారా తమ ఎక్స్ లతో స్నేహంగా ఉండలేని ఈ జన్మరాశుల గురించి మరింత మెరుగ్గా అర్థం చేసుకోండి.
తెలుసుకోండి.

కుంభం ; జనవరి 21-ఫిబ్రవరి 18
కుంభరాశి వారు ఎవరితోనైనా బ్రేకప్ విషయంలో చాలా నెమ్మదిగా,ఏం పట్టనట్లు ఉంటారు. అలాగే ఎక్స్ లతో స్నేహం విషయం కూడా పెద్దగా పట్టించుకోరు. వారికి తమ ఎక్స్ లతో మళ్ళీ వెళ్ళి స్నేహితులుగా ఉండటం ఇష్టం ఉండదు, ఎందుకంటే గతాన్ని మర్చిపోయి వర్తమానం మీదనే దృష్టి పెట్టడం మంచిదని భావిస్తారు.

మకరం ; డిసెంబర్ 23-జనవరి 20
మకరరాశి వారు అస్సలు క్షమించలేరు, ఇది అందరికీ తెలిసిన విషయమే. విడిపోయాక స్నేహంగా ఉండాలని పెద్దగా ప్రయత్నించరు కూడా. పైగా మీరు ఒకవేళ వారి మనస్సును గాయపరిస్తే, వారు క్షమించరు అలాగే మర్చిపోరు కూడా. ఏ సమయంలోనైనా సరే వారు వారి ఎక్స్ లతో స్నేహంగా ఉండలేరు.

వృశ్చికం ; అక్టోబర్ 24-నవంబర్ 22
వృశ్చికరాశి వారు ప్రతి పనిలో అసూయ పడకుండా ఉండలేరు. బంధాల్లో కూడా లేదా వారి ఎక్స్ లతో స్నేహంగా ఉండాల్సొచ్చినా సరే. వీరు ఏదైనా గాఢంగా తీసుకునే వారు, ఇది మంచి గుణమే అయినా అసూయకి కూడా దారితీయవచ్చు. ఈ గుణం వలన వీరు తమ ఎక్స్ ల కొత్త బంధాల పట్ల మంచిగా ఉండలేరు. వారు ప్రయత్నించినా కూడా, మిమ్మల్ని అందరి ముందు దారుణంగా ఫీలయ్యేలా చేసే అవకాశం కోసం చూస్తునే ఉంటారు.

సింహం ; జూలై23-ఆగస్ట్ 23
సింహరాశి వారికి అందరిచేతా ప్రేమించబడటం, గారాబం చేయించుకోవటం ఇష్టం. అందుకని వారి మాజీ ప్రేమికులు ఇంకెవరితో అయినా అలా ఉంటే భరించలేరు. ఒకవేళ వారి ఎక్స్ లతో స్నేహితులుగా ఉండాల్సొస్తే, వారి కొత్త బంధాల గురించి తెలుసుకోవడానికి చాలా తక్కువ ఆసక్తి చూపిస్తారు. సాధారణంగా ఎక్స్ లతో స్నేహంగా ఉండకపోవటానికి మరో కారణం వారి మొండితనం. ఒకవేళ ఎక్స్ ఏదైనా తప్పు చేయటం వలన విడిపోతే అంత సులభంగా సింహరాశి వారు క్షమించలేరు.

మేషం ; మార్చి 21-ఏప్రిల్ 19
మేషం అన్నిరాశుల కంటే పోటీతత్వాన్ని కలిగివుంటారు. వీరికి తమ మాజీ ప్రేమికులతో స్నేహంగా ఉండటం నచ్చదు, ఎందుకంటే వారితో కూడా ఆఖరికి ఎవరు మెరుగ్గా బ్రతుకుతున్నారు అనే పోటీ కలిగివుంటారు.కానీ మాజీ ప్రేమికులు సోషల్ మీడియాలో టచ్ లో ఉండటాన్ని పెద్ద విషయంగా పట్టించుకోరు ఎందుకంటే తమ జీవితంలో ఏం జరుగుతోందో వారికి చూపించవచ్చు, అలాగే ఇలా వారిని బాధపెట్టవచ్చు అనుకుంటారు.
జ్యోతిష్యం ప్రకారం ఆందోళన ఎక్కువపడే జన్మరాశులు
మరి మీ మాజీ ప్రేమికుల జన్మరాశి ఏంటి?కింద కామెంట్ సెక్షన్ లో మాకు తెలపండి.



Click it and Unblock the Notifications
