For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డాగ్ డివార్మింగ్ మెడిసిన్ తో టర్మినల్ క్యాన్సర్ ను నయం చేసుకున్న వ్యక్తి

|

కొన్ని అనారోగ్య సమస్యలను నయం చేసుకోడానికి కొందరు ప్రయత్నించే వింత చేష్టలు వినడానికి కూడా కొంత జిగుప్సాకరంగా అనిపిస్తుంటాయి.

తనకు సోకిన క్యాన్సర్ వ్యాధిని తగ్గించుకోడానికి, ఇటువంటి వికృత చర్యకు పాల్పడిన వ్యక్తి ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. అతను తన టర్మినల్ క్యాన్సర్ వ్యాధిని తగ్గించుకోడానికి ఉపయోగించిన ట్రిక్ విన్న వారిని విస్మయానికి గురి చేసింది. కుక్కల నులిపురుగుల సమస్యకు ఉద్దేశించిన డీవార్మింగ్ డ్రగ్ తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని అదుపులో ఉంచినట్లు పేర్కొనడం చర్చనీయాంశం అయింది. ప్రపంచవ్యాప్తంగా రోజుకో వింత సంఘటన జరుగుతూనే ఉంటుంది. క్రమంగా కొన్ని వింత సంఘటనలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంటాయి.

కేవలం 5 డాలర్ల డీవార్మింగ్ డ్రగ్ తీసుకోవడంమూలంగా, టెర్మినల్ కాన్సర్ దూరం చేయగలిగానని చెప్పుకుంటున్న ఈ వింత కథ గురించిన మరిన్ని వివరాలకోసం వ్యాసంలో ముందుకు సాగండి.

అతనికి ఉన్న అనారోగ్యానికి, 3 నెలలు మాత్రమే బ్రతికే అవకాశం ఉందని వైద్యుల నిర్ధారించారు …

అతనికి ఉన్న అనారోగ్యానికి, 3 నెలలు మాత్రమే బ్రతికే అవకాశం ఉందని వైద్యుల నిర్ధారించారు …

ఓక్లహోమాకి చెందినా జో టిప్పెన్స్ అనే ఈ వ్యక్తి, 2016 లోనే ఊపిరితిత్తులకు సంబంధించిన టెర్మినల్ కాన్సర్ బారిన పడినట్లుగా వైద్యులు నిర్దారించడం జరిగింది. అంతేకాకుండా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని, మరో 3 నెలలకు మించి జీవించడం కూడా కష్టమని వైద్యులు ధృవీకరించారు.

క్రమంగా ఈ కాన్సర్, అతని శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాపించింది ..

క్రమంగా ఈ కాన్సర్, అతని శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాపించింది ..

జో కి సోకిన ఈ క్యాన్సర్ కాలానుగుణంగా పొట్ట, మెడ, క్లోమంతో సహా ఇతర అవయవాలకు కూడా వ్యాపించిందని, వ్యాధి నిర్ధారణగావించిన కొద్ది నెలలలోనే అతని ఎముకలకు కూడా కాన్సర్ వ్యాపించిందని వైద్యులు వెల్లడించారు.

తన కుటుంబానికి, స్నేహితులకు వీడ్కోలు చెప్పాలని సలహా ఇచ్చారు కూడా..

తన కుటుంబానికి, స్నేహితులకు వీడ్కోలు చెప్పాలని సలహా ఇచ్చారు కూడా..

జో టెర్మినల్ క్యాన్సర్ బారినపడి, పరిస్థితి తీవ్రమవుతున్న దృష్ట్యా, వైద్యులు అతనిని ఇంటికి వెళ్ళమని, తన ప్రియమైనవారితో తనకు మిగిలిన మూడు నెలల కాలాన్ని సంతోషంగా జీవించమని సలహా ఇచ్చారు.

అతను డీవార్మింగ్ డ్రగ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు ..

అతను డీవార్మింగ్ డ్రగ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు ..

అతని పరిస్థితి దృష్ట్యా, అతను జీవించే అవకాశాలు ఒక శాతం కూడా లేవని నివేదించబడిన కారణంగా, ఈ 3 నెలల మిగిలిన సమయంలో ఏదో ఒక చర్యను అనుసరించి, వ్యాధిని తగ్గించే ప్రయత్నం చేయాలని సంకల్పించాడు. క్రమంగా అతను ఫెన్బెండజోల్ అనే కుక్కలకు వినియోగించే, డీవార్మింగ్ డ్రగ్ తీసుకోవడానికి నిర్ణయించుకున్నాడు.

క్రమంగా ఈ డ్రగ్ ను 3 నెలలపాటు తీసుకున్నాడు…

క్రమంగా ఈ డ్రగ్ ను 3 నెలలపాటు తీసుకున్నాడు…

జో, ఈ డీవార్మింగ్ డ్రగ్ తో పాటుగా, విటమిన్ ఇ సప్లిమెంట్లు, CBD మరియు బయోఅవైలబుల్ కుర్క్యుమిన్ సప్లిమెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది. క్రమంగా కేన్సర్ ఫ్రీ పేషెంట్ గా మారాడని చెప్పుకుంటున్నాడు. తాను ఈ మందును ప్రచారం చేయడంలేదని, బదులుగా తన కథను మాత్రమే ప్రపంచంతో పంచుకుంటున్నానని చెప్పుకుంటున్నాడు. కాకపోతే ఈ చర్యను వైద్యులు విభేదిస్తున్నారు. సైన్స్ నిర్ధారణ లేకుండా అనుసరించే కొన్ని విషయాలు, ఒక్కోసారి ప్రాణాలకే ముప్పును తీసుకుని రావొచ్చునని. ఇటువంటి ప్రయోగాలు చేయడం సరికాదని సూచిస్తున్నారు.

ఈ వింత సంఘటన చూస్తుంటే మీకేమనిపిస్తుంది ? మీ ఆలోచనలను క్రింది వ్యాఖ్యల విభాగంలో పంచుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర విషయాలతో పాటు. ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి.

English summary

He Claims He Cured His Terminal Cancer By Eating Dog Deworming Medicine

This is the weird case of a man from Oklahoma claiming that he was once diagnosed with small-cell lung cancer. The man revealed that doctors had told him that he only had three months to live. The man claimed that he is now tumour-free after he consumed a $ 5 deworming drug usually meant for dogs.He Ate Dog Deworming Medicine For Cancer
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more