Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
Bengaluru Traffic: ఈ గార్డెన్ సిటీలో ప్రయాణం నరకమే, ప్రపంచంలో అత్యంత రద్దీ ఉండే రెండో సిటీ
డచ్ లోకేషన్ టెక్నాలజీ స్పెషలిస్టు సంస్థ అయిన టామ్‌టామ్ విడుదల చేసిన 2022-ట్రాఫిక్ ఇండెక్స్ లో బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. ట్రాఫిక్ సూచిక ప్రకారం 2022లో సిటీ సెంటర్(బృహత్ బెంగళూరు మహానగర పాలిక) కేటగిరీలో లండన్ తర్
బెంగళూరు అంటే మొదట గుర్తొచ్చేది ఏంటి? బెంగళూరు బయట ఉండే వారిని ఈ ప్రశ్న అడిగితే బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, గార్డెన్ సిటీ ఇలా చెబుతారు. ఆ నగరంలో ఉండే వారిని ఈ ప్రశ్న అడిగితే సింపుల్ గా ట్రాఫిక్ సిటీ ఆఫ్ ఇండియా అనేస్తారు. ఎందుకంటే బెంగళూరు అంటే విపరీతమైన ట్రాఫిక్ భయపెడుతుంది. గంటల తరబడి ట్రాఫిక్ కే వెచ్చించాల్సి వస్తుంది. గంటలకొద్దీ రోడ్లపై ఉండాల్సి వస్తుంది. అత్యంత ఎక్కువ రద్దీ ఉండే నగరాల్లో ప్రపంచంలోనే బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది.

మొదటి స్థానంలో లండన్, రెండో స్థానంలో బెంగళూరే:
డచ్ లోకేషన్ టెక్నాలజీ స్పెషలిస్టు సంస్థ అయిన టామ్‌టామ్ విడుదల చేసిన 2022-ట్రాఫిక్ ఇండెక్స్ లో బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. ట్రాఫిక్ సూచిక ప్రకారం 2022లో సిటీ సెంటర్(బృహత్ బెంగళూరు మహానగర పాలిక) కేటగిరీలో లండన్ తర్వాత బెంగళూరు నిలవడం గమనార్హం.
లండన్ లో 10 కిలోమీటర్ల మేర ప్రయాణించాలంటే 36 నిమిషాల 20 సెకన్ల సమయం పడుతుంది. బెంగళూరులో 10 కిలోమీటర్ల మేర ప్రయాణించాలంటే 29 నిమిషాల 10 సెకన్ల సమయం పడుతున్నట్లు టామ్‌టామ్ నివేదిక పేర్కొంది.
టాప్ 10లో భారత్ నుండి 2 నగరాలు:
టామ్ టామ్ విడుదల చేసిన నివేదిక ప్రకారంలో టాప్ 10 లో భారత్ నుండి రెండు నగరాలు నిలిచాయి. సిటీ సెంటర్ కేటగిరీలో డబ్లిన్ -ఐర్లాండ్ 3వ స్థానం, సపోరో-జపాన్ 4వ స్థానం, మిలాన్-ఇటలీ 5వ స్థానం, పూణే 6వ స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ 34వ స్థానంలో, ఆర్థిక రాజధాని ముంబయి 47వ స్థానంలో ఉన్నాయి.
సిటీ సెంటర్ రద్దీకి హడలిపోవాల్సిందే:
సిటీ సెంటర్ అంటే బెంగళూరులోని ప్రధాన ప్రాంతం. ఇది మొత్తం 5 కిలోమీటర్ల వ్యాసార్థంతో ఉంటుంది. బెంగళూరులోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలు ఎక్కువగా సిటీ సెంటర్ పరిధిలోనే ఉంటాయి. అందుకే ఇక్కడ ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటుంది. గతేడాది ఇదే నివేదికలో బెంగళూరు 10వ స్థానంలో నిలిచింది. 2020లో బెంగళూరు అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో 6వ స్థానంలో నిలిచింది.
శుక్రవారాల్లో ట్రాఫిక్ నరకమే:
బెంగళూరు నగరంలో ట్రాఫిక్ వీకెండ్స్ వేళ విపరీతంగా పెరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది. శుక్రవారం సాయంత్రం వేళ రోడ్లపై వాహనాలు కదలడం నరకప్రాయమని చెప్పింది. శుక్రవారం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు రద్దీ విపరీతంగా ఉంటుంది. 10 కిలోమీటర్ల దూరం వెళ్లాలంటే 37 నిమిషాల 20 సెకన్ల సమయం పడుతుంది.
బెంగళూరు సిటీ ట్రాఫిక్‌ను ఎలా ఎదుర్కోవాలి:
1. మీ రూట్‌ను ముందే ప్లాన్ చేసుకోవాలి
ప్రయాణానికి బయలుదేరే ముందు, మీ మార్గాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ట్రాఫిక్ నావిగేషన్ యాప్‌లను ఉపయోగించి బెస్ట్ రూట్ ఎంచుకోవాలి. రద్దీ సమయాల్లో ప్రయాణాలు చేయొద్దు. రద్దీగా ఉండే ప్రాంతాలకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి.
2. ముందుగా ప్రారంభమవ్వాలి
ముందుగా బయలు దేరడం చాలా ముఖ్యం. రద్దీ మొదలుకాక ముందే గమ్యస్థానానికి బయలుదేరాలి. త్వరగా బయల్దేరడం వల్ల సమయానికి చేరుకోవచ్చు.
3. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ఉపయోగించాలి
బస్సులు, రైళ్లు, మెట్రోలను వాడి గమ్యస్థానానికి చేరుకోవాలి. దీని వల్ల రోడ్లపై వాహనాల రద్దీ తగ్గుతుంది. తక్కువ ఖర్చుతోనే ప్రయాణం చేయవచ్చు.
4. ప్రశాంతంగా, ఓపికగా ఉండాలి
ట్రాఫిక్ లో డ్రైవింగ్ చేయడం విసుగును, ఒత్తిడిని కలిగిస్తుంది. త్వరగా వెళ్లాలన్న ఉద్దేశంతో ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు. ఓవర్ టేక్‌లు, అతిగా హారన్ మోగించడం వంటివి చేయొద్దు.
5. ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలి
ట్రాఫిక్ లో చిక్కుకుపోతే సమయం వృథా అవుతుంది. అయితే ఆ సమయంలో మ్యూజిక్, ఆడియో బుక్స్, పాడ్ క్యాస్ట్ లు వినడాన్ని అలవాటు చేసుకోవాలి. వృత్తిపరమైన ఫోన్ కాల్స్, వ్యక్తిగత ఫోన్ కాల్స్ చేయండి.
6. ట్రాఫిక్ రద్దీకి రెడీగా ఉండాలి
బెంగళూరు నగర ట్రాఫిక్ అనూహ్యంగా ఉంటుంది. ఎంత సమయం ట్రాఫిక్‌లో ఉంటామో ఊహించడం కష్టం. అందుకే ఏ పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలి. స్నాక్స్, వాటర్, ఫోన్ లో ఛార్జింగ్, పెట్రోల్ లాంటివి సిద్ధంగా ఉంచుకోవాలి.



Click it and Unblock the Notifications