Latest Updates
-
ఫ్రిజ్‌లో ఏ కూరగాయ ఎంత కాలం నిల్వ ఉంటుంది?.. సరైన స్టోరేజ్ పద్ధతులు ఇవే! -
ఒంట్లో రక్తం పెంచి, బలాన్ని అందించే సూపర్ ఫుడ్ 'జొన్న మెంతి పరాటా’.. ఈజీగా ఇలా చేసేయండి.! -
దానిమ్మ తింటే నిజంగానే టెస్టోస్టెరాన్ పెరుగుతుందా.. పురుషులు తెలుసుకోవాల్సిన లాజిక్ ఇదే.! -
స్పైసీ ఫుడ్ లవర్స్‌కి పండగే.. ముక్కముక్కలో తెలంగాణ ఘాటు తెలిపే 'అంకాపూర్ నాటుకోడి కూర'! -
నకిలీ డిస్కౌంట్లకు నో ఛాన్స్.. ఆన్లైన్ షాపింగ్‌పై కేంద్రం కఠిన నిబంధనలు.! -
శుక్రుడి వక్రగతి మహర్దశ.. ఆ రాశుల వారికి కెరీర్, బిజినెస్‌లో సిరుల పంట.! -
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
తొలిసారి విదేశీ ప్రయాణమా.. ఈ 5 తప్పులు చేస్తే మీ వీసా తిరస్కరణకు గురైనట్లే.! -
మొఘలాయ్ తవా చికెన్.. మసాలా వేశాక ఇలా చేస్తే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది!
HYD Best Haleem: హైదరాబాద్‌లో ఇక్కడ హలీమ్ కమాల్ ఉంటది, తినకుండా అస్సలే ఉండొద్దు
హలీమ్.. రంజాన్, హైదరాబాద్ కు పర్యాయపదం. హలీమ్ అంటే అదో ఫుడ్ కాదు.. అదో ఎమోషన్. నిజాం కాలంలోనే కాదు.. ఇప్పటికీ ఎప్పటికీ నోరూరించే ఆ వంటకం హలీమ్. మినీ భారత దేశంలా భిన్న సంస్కృతులకు నెలవైన హైదరాబాద్ లో ఒక్క ముస్లింలే కాకుండా కులమత ప్రమేయం లేకుండా హైదరాబాదీలంతా హలీమ్ రుచిని ఆస్వాదిస్తుంటారు. హైదరాబాద్ హలీమ్ కు భౌగోళిక సూచిక హోదా కూడా లభించింది.

రంజాన్ వచ్చిందంటే హైదరాబాద్ లో ప్రతి గల్లీలో హలీమ్ స్టాల్స్ తెరచుకుంటాయి. మీరు హలీమ్ తినాలంటే హైదరాబాద్ లో ఈ బెస్ట్ ప్లేసెస్ కు వెళ్లండి. హలీమ్ అదిరిపోతుంది.
1. పిస్తా హౌజ్ హలీమ్
2. షాగౌజ్ హలీమ్
3. ప్యారడైజ్ హలీమ్
4. సర్వీ హలీమ్
5. షాదాబ్ హోటల్ హలీమ్
6. కేఫ్ 555 హలీమ్
7. మెఫిల్ హలీమ్
8. కేఫ్ బహార్ హలీమ్
ముస్లింల వంటకం కాదు
హలీమ్ కేవలం ముస్లింల వంటకం మాత్రమే కాదనీ చాలా పురాతన ఆహారమనీ పర్వత ప్రాంతాల్లో నివసించే కుర్దులు తినేవారనీ అంటారు వంటకాలపై పరిశోధన చేసిన క్లాడియా రోడెన్. లెబనీయులూ, సిరియన్ క్రిస్టియన్లూ చర్చిల వద్ద పేదలకు పంచి పెట్టడానికి పెద్ద మొత్తంలో దీన్ని తయారుచేసేవారనీ చెప్తారు. ఇరాక్‌లో దీన్ని అల్పాహారంగా తీసుకుంటారు. షియా ముస్లింలు మొహర్రం సందర్భంగా చేసుకుంటారు.
పోషకాలు పుష్కలం
హలీమ్ మంచి పోషకాహారం. అందుకే దీన్ని సింగిల్ డిష్ మీల్ అంటారు. మామూలు భోజనంలో అన్నం, రొట్టెలు, పప్పు, కూరలు, చారు, పెరుగు... ఇలా చాలా రకాలు తీసుకుంటాం. కానీ హలీమ్ ఒక్కటి తింటే పూర్తి భోజనంతో సమానమైన పోషకాలు లభిస్తాయంటారు నిపుణులు. పన్నెండు గంటలపాటు నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉన్నవారికి తక్షణ శక్తిని అందించే ఆహారం కావడంతో ఇఫ్తార్ విందులో ఇది ముఖ్యమైన అంశమైంది. రేటు ఎంతయినా సరే... ఈ నెలలో హలీమ్ ని తిని తీరాల్సిందే మరి. హలీమ్ కి వెలకట్టగలమా.. తిన్న తర్వాత కొన్ని గంటల వరకూ నోటిని వదిలిపెట్టని ఆ రుచి కోసం ఎంతయినా ఖర్చుపెట్టొచ్చు.



Click it and Unblock the Notifications
