Latest Updates
-
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.!
రొమాంటిక్ ప్రీ వెడ్ షూటింగ్ కోసం వైజాగ్‌లోని బెస్ట్ ప్లేసులు
అద్భుతమైన బీచ్‌లు, చారిత్రాత్మక ల్యాండ్‌మార్క్‌లు, సుందరమైన దృశ్యాలు వైజాగ్ చుట్టుపక్కలో చాలా ఉన్నాయి. మంచి రొమాంటిక్ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కోసం సరిగ్గా సరిపోయే బెస్ట్ లొకేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే అతి పెద్ద పండగ. ఈ ప్రత్యేక సందర్భాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలా పెళ్లి రోజు వెడ్డింగ్ షూట్, అంతకుముందు ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహిస్తుంటారు. ఫోటోలు, కొందరు కవర్ సాంగ్స్ చేస్తుంటారు. ఈ ఫోటోలను, షార్ట్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు, వాట్సాప్ స్టేటస్ లు పెట్టుకుని అతిథులను ఆహ్వానిస్తుంటారు.

ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కోసం మంచి ప్రాంతాల కోసం అన్వేషిస్తుంటారు. మీరు అలాగే వెతుకుతుంటే వైజాగ్ లోని ఈ ప్రాంతాలపై ఓ లుక్కేయండి. అద్భుతమైన బీచ్‌లు, చారిత్రాత్మక ల్యాండ్‌మార్క్‌లు, సుందరమైన దృశ్యాలు వైజాగ్ చుట్టుపక్కలో చాలా ఉన్నాయి. మంచి రొమాంటిక్ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కోసం సరిగ్గా సరిపోయే బెస్ట్ లొకేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తొట్లకొండ బీచ్:
ఈ బీచ్ ఫోటో షూట్లకు, సినిమా షూటింగ్ లకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి సహజసిద్ధమైన ఆర్చ్ మంచి స్పాట్ గా మారిపోయింది. ప్రీ వెడ్ షూటింగ్ కోసం ఇది చక్కగా ఉంటుంది. బీచ్ వద్ద రాళ్ల పైన అందమైన వ్యక్తితో రొమాంటిక్ పిక్స్ సూపర్ గా ఉంటాయి.

కైలాసగిరి:
ఇది వైజాగ్ తీరప్రాంతాన్ని మొత్తంగా చూసేందుకు చక్కని హిల్ స్టేషన్. ఇక్కడి దృశ్యాలు చాలా అందంగా ఉంటాయి. కైలాసగిరి దాని పచ్చదనం, అందమైన ప్రకృతి దృశ్యాలతో కూడిన తోటలు, మనోహరమైన శిల్పాలతో అద్భుతమైన లొకేషన్. ప్రీ వెడ్డింగ్ షూట్ కు మంచి రొమాంటిక్ ప్లేస్ ఇది.

వుడా పార్క్:
ఆర్కే బీచ్ ఒడ్డున ఉండే వుడా పార్క్ వైజాగ్ లోని ఒక ప్రసిద్ధ వినోద ప్రదేశం. వుడా పార్క్ లో తోటలు, మ్యూజికల్ ఫౌంటెన్, పిల్లలు ఆడుకునే స్థలం, వివిధ రకాల సవారీలు ఉంటాయి. ఇక్కడి వాతావరణం రొమాంటిక్ వైబ్ ను ఇస్తుంది.

డాల్ఫిన్ నోస్:
సముద్రానికి అభిముఖంగా ఉన్న కొండపైన ఉన్న డాల్ఫిన్ నోస్ వైజాగ్ తీరప్రాంతం యొక్క అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది. ఎత్తైన శిఖరాలు, పచ్చదనం, ప్రశాంతమైన పరిసరాతో డాల్ఫిన్ నోస్ ప్రీ-వెడ్డింగ్ షూట్ కోసం ఒక అద్భుతమైన ప్రదేశం.

MV మా షిప్:
ఇదో పాడు బడిన ఓడ. మీ ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం సరైన ప్రదేశం. ఇది ఒక ప్రసిద్ధి పర్యాటక ఆకర్షణగా మారిపోయింది. బీచ్ కెరటాలు, పక్కనే ఉన్న కొండ, శిథిలమైన ఓడ మంచి వైబ్ ను ఇస్తాయి. సూర్యోదయం వేళ ఇక్కడి ఫోటోషూట్ అద్భుతంగా ఉంటుంది.

కొండకర్ల ఆవ:
కొండకర్ల ఆవ మంచి పర్యాటక ప్రదేశం. ఒకవైపు అభయారణ్యం, మరోవైపు సరస్సు, సరస్సు నిండా తామరపూలు.. ఈ లొకేషన్ చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇది మంచి రొమాంటిక్ ఫోటో షూట్ లొకేషన్ అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.

అప్పికొండ:
(image:YoVizag)
ట్రెక్కింగ్ కు, క్యాంపింగ్ కు ఈ ప్రదేశం చాలా ప్రసిద్ధి. ఇక్కడి లొకేషన్లు ఫోటో షూట్ కు సరిగ్గా సరిపోతాయి. బీచ్ బ్యాగ్రౌండ్ లో రొమాంటిక్ ఫోటోలు తీసుకోవచ్చు.

దివీస్ బ్రిడ్జ్:
బీచ్, సముద్ర కెరటాలు, మరోవైపు బ్రిడ్జి. ఈ లొకేషన్ లో మంచి సిమెట్రీతో ఫోటోలు అద్భుతంగా వస్తాయి. మీ బెటర్ హాఫ్ తో మంచి పిక్స్ కావాలనుకుంటే ఇది సరైన ప్రదేశం.



Click it and Unblock the Notifications
