Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
దసరా 2024: ఈసారి దసరాను ఇలా జరుపుకోండి.. ఫలితాలు చాలా బాగుంటాయి!
బతుకు కోసం, ఉద్యోగాల కోసం పుట్టిన ఊరిని, కన్న తల్లిదండ్రులను వదిలేసి పట్టణాలకు వెళ్లి అక్కడే స్థిరపడిపోతుంటాం. ఎంత పని ఉన్నప్పటికీ చాలా మంది దసరా లాంటి పెద్ద పండగలప్పుడు కచ్చితంగా తాము పుట్టిన ఊళ్లకు వెళ్లి పండగలను జరుపుకుంటూ ఉంటారు. పండగను తమ అనుకున్న వాళ్ళతో కలిసి జరుపుకుంటారు.
అసలు పండగ అంటేనే.. అయిన వారందరినీ కలుసుకోవడం, ఆనందాలను పంచుకోవడం, పాత జ్ఞాపకాలను నెమరేసుకోవడం. పండగ ఉన్నన్నాళ్ళు మనం ఎలాంటి ఎలాంటి ఎంజాయ్ చేశామో దానిని పది కాలాల పాటు గుర్తుంచుకోవడం. అలాంటి పండగను నలుగురితో కలిసి, ఎలా సెలెబ్రేట్ చేయాలి, ఏ విధమైన పనులు చేయాలో ఈ స్టోరీలో పొందుపరచాము. నచ్చితే మీరు పండుగ జరుపుకునే మీ స్నేహితుడితో దీనిని పంచుకొండి

ఊళ్ళో అందరినీ పలకరించడం:
పండగ అంటేనే అయిన వాళ్లందరినీ కలుసుకోవడం. అలాంటి పండగకు ఊరెళ్ళినప్పుడు కచ్చితంగా మన అనుకున్నవాళ్లను, మన మంచి కోరే వాళ్ళను పలకరించాలి. ఎంతైనా పెరిగి పెద్దయిన ఊరు కాబట్టి.. ఊరి వాళ్ళను పలకరిస్తే, మన గురించి ఊళ్ళో మంచి భావన ఏర్పడడంతో పాటు, పండుగను అందరితో కలిసి జరుపుకున్నట్లు ఉంటుంది.
ఊళ్ళో వాళ్ళను పలకరించి.. స్నేహితులతో పంట పొలాలను చూసి రావడం, వారితో పిచ్చా పాటి మాట్లాడుకోవడం చేస్తే, మనసుకు ప్రశాంతత ఉండడంతో పాటు స్వచ్ఛమైన పల్లెటూరు గాలిని పీల్చుకోవచ్చు.
కన్న వాళ్ళతో సమయం కేటాయించడం:
ఉండేదే నాలుగు రోజులు. ఆ నాలుగు రోజులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ల్యాప్‌ట్యాప్‌లు, మొబైల్ ఫోన్స్ పట్టుకొని ఉంటే.. ఆ నాలుగు రోజులు కూడా వృధా అయినట్లే. ఉన్న నాలుగు రోజులు కూడా తల్లి దండ్రుల మంచి చెడులు తెలుసుకోండి. వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకొని, వారికి సమయం కేటాయించి ప్రేమగా ఉండండి. పండగ పూట నాలుగు రోజులు మీరు పంచె ఆ ప్రేమ ఆప్యాయతలు వారికి మళ్ళీ ఊరికెళ్లే వరకు, జ్ఞాపకాలుగా ఉంటాయి.
బంధువులతో పండుగను జరుపుకోండి:
పండగపూట, బంధువులందరూ ఒకే చోటికి చేరి ఆ పండుగను జరుపుకుంటే ఆ ఆనందమే వేరేలా ఉంటుంది. మన మంచి కోరే వారితో కూర్చొని భోజనం చేస్తూ.. మన వ్యాపార, ఉద్యోగ, కుటుంబ వ్యవహారాలూ మాట్లాడుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా.. చిన్నదిగా కనిపిస్తుంది. మనసు కుదుట పడుతుంది.
పిల్లలకు పండగ ఆచారాలు నేర్పండి:
టెక్నాలజీ రోజురోజుకూ పెరిగిపోవడంతో మన ఆచార సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా, మోడ్రన్ విధానంలో పండగను జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. దీంతో మన ఆచారాలు కనుమరుగవుతున్నాయి. కాబట్టి ఇలాంటి పెద్ద పండుగలను మన ఆచారాల పరంగా.. మనం ఎలా జరుపుకునే వాళ్ళమో పిల్లలకు వివరించండి. వారి అలానే పండగను జరిపించండి. అప్పుడే భావి తరాలకు మన ఆచార సంప్రదాయాలను అందించగలుగుతాము.



Click it and Unblock the Notifications
